కాళిదాసు: కూర్పుల మధ్య తేడాలు

పరిచయంలో కాళిదాసు ప్రముఖ రచనల ప్రస్తావింపు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{అయోమయం}}
[[దస్త్రం:kalidas.jpg|thumb|250px|right|కాళిదాసు ఊహా చిత్రం.]]
'''కాళిదాసు''' ఒక గొప్ప [[సంస్కృతం|సంస్కృత]] కవి మరియు నాటక కర్త. "కవికుల గురువు" అన్న బిరుదు ఇతని యొక్క ప్రతిభాపాటవాలకు నిలువెత్తు సాక్ష్యం. గొప్ప శివ భక్తునిగా భావింపబడే కాళిదాసు, తన యొక్క కావ్యములు మరియు నాటకములు చాలావరకు హిందూ పురాణ మరియు తత్త్వ సంబంధముగా రచించాడు. [[రఘువంశము]], [[కుమార సంభవము]], [[మేఘ సందేశం (సంస్కృతం)|మేఘసందేశం]] అనే మూడు మహాకావ్యాలు, [[అభిజ్ఞాన శాకుంతలము]], [[విక్రమోర్వశీయము]], [[మాళవికాగ్నిమిత్రము|మాళవికాగ్ని మిత్రము]] అనే మూడు నాటకాలు ఆయన రచనల్లో పేరు గాంచినవి. కాళిదాసు అను పేరుకు అర్థం [[కాళి]] యొక్క దాసుడు.
 
== జీవితము ==
పంక్తి 66:
 
== కవి నిర్లిప్తత ==
 
కాళిదాదు కవితలో స్ఫురించే ఇంకొక విషయం ముఖ్యంగా పేర్కొనవలసినది ఎక్కడా కవి తన కావ్యాల్లో తననుగూర్చి ప్రస్తావించుకోలేదనీ, దీనివల్ల పరిశోధకులకు తన కాలనిర్ణయం దుష్కరం అయిపోయినమాట అటువుంచితే ఆయన నిర్లిప్తత ఇతని జీవన ధృక్పధం అని ఊహించుకోవచ్చును. రఘువంశ ప్రారంభంలో ఈకవి తాను ముందుడనీ, కవియశస్సు ప్రార్ధించే తాను పొడగరులు అందుకోగలిగిన ఫలం ఆశించిన వామనుని వలె అపహాస్యపాత్రుడను కాగలననీ వ్రాశాడు.తిరిగి మాళవికాగ్నిమిత్రంలో ప్రాచీనమైనదల్లా యోగ్యమైనది కాజాలదనీ, నవ్యకావ్యమైనంత మాత్రంచేత అది నింద్యం కాజాలదనీ సహృదయులు ఈరెంటినీ అతిక్రమిచినవారనీ సూత్రధారుని ముఖతః పలికించాడు. ఇంతకంటే ఈకవి ఆత్మగతాభిప్రాయాలు ఇతని కావ్యాల్లో ఇంకెక్కడా లభించలేదు.ఈకవి వ్యక్తిచరిత్ర విషయంలో అవలంబించిన మౌనాన్ని బట్టికూడా నిర్లిప్తమైన ఈతని జీవనశైలిని తెలియపరుస్తున్నది.అసలు ప్రాచీన కవితా సంప్రదాయాలలో కవికి నేటి కాలంలో బయలు దేరిన "స్వాతంత్ర్యం, అస్వాతంత్ర్యం" వంటి సమస్యలు బయలుదేరనేలేదు అనుకోవచ్చును. ఆకాలంలో భారతీయకవులు భారతీయమైన ఆధ్యాత్మిక సంప్రదాయం సహజంగా ఆకళించుకొన్నారు. అప్పుడు వ్యక్తి స్వాతంత్ర్యం సాంప్రదాయకమైన సాంఘికథర్మం అతిక్రమించి పైడదారులు తొక్కలేదు లేక యాంత్రికమైన ఒక్క శుష్కసంఘ శాసనానికి కట్టుబడనూలేదు. ఆధార్మిక ధృక్పధంలో సంఘవ్యక్తులకు పరస్పరాశ్రితమైన సహకారం సహజంగా పెంపొందింది. కనుకనే ఆరోజులలో కవులెవ్వరూ వ్యక్తి చరిత్రలు తమ కావ్యాల్లో వ్రాసుకోలేదని తోస్తుంది. అదీగాక భారతీయాధ్యాత్మిక సంప్రదాయాన్ని సంపూర్ణంగా ఆకళించుకొన్న కాళిదాసుకవి తన వ్యక్తిత్వం విషయంలో గంభీరమైన ఓదాసీన్య వైఖరి అవలింబించి ఉంటాడు. కనుకనే ఈతని చరిత్ర నేటి పరిశోధకులకు ఇంత గడ్డు సమస్యగా పరిణమించింది. కాని ఆమహాకవి భౌతికవ్యక్తి జీవితం కాలగర్భంలో, మరుగుబడిపోయినా మనోహరమైన ఆతని ఆధ్యాత్మికత, ధార్మికత ఈ రెండిటినీ మించిన జీవితసౌందర్యార్చన ఆతని కావ్యాల్లో త్రిపధములై ఆతని కవితకు మందాకినీ గౌరవం కలిగించాయి.
 
Line 76 ⟶ 75:
=== ఇవి కూడా చూడండి ===
* [[మహాకవి కాళిదాసు (సినిమా)]]
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
=== బయటి లింకులు ===
* [http://en.wikipedia.org/wiki/Kalidasa కాళిదాస - వికీ ఆంగ్లము]
* [http://www.cs.colostate.edu/~malaiya/kalidas.html కాళిదాసు జీవితం మరియు రచనలు]
{{Authority control}}
 
<!-- అంతర్వికీ లింకులు -->
 
[[వర్గం:సంస్కృత కవులు]]
"https://te.wikipedia.org/wiki/కాళిదాసు" నుండి వెలికితీశారు