ఆత్రేయ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 34:
| weight =
}}
'''ఆచార్య [[ఆత్రేయ]]'''గా సినీరంగ ప్రవేశం చేసిన '''కిళాంబి వెంకట నరసింహాచార్యులు''' ([[మే 7]], [[1921]] - [[సెప్టెంబర్ 13]], [[1989]]) తెలుగులో సుప్రసిద్ధ నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత మరియు దర్శకులు. దాదాపు 400 సినిమాలకు మాటలు, పాటలు రాసిన గొప్పకవి.<ref>[http://www.sakshi.com/news/opinion/heartstrings-poet-atreya-64765 మనసులు దోచిన కవి ఆత్రేయ Written by Nagesh | Updated: September 13, 2013]</ref> అత్రేయకి ప్రముఖ నటుడు [[కొంగర జగ్గయ్య]] ఆప్తమిత్రుడు.ఆత్రేయ వ్రాసిన పాటలు,నాటకాలు,నాటికలు,కథలు మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి [[జగ్గయ్య]] తన మిత్రుడికి గొప్ప నివాళి అర్పించాడు అని చెప్పవచ్చు. ఆచార్య ఆత్రేయ [[తెలుగు సినిమా]] గేయరచయితగా, సంభాషణకర్తగా పేరుపొందినా నిజానికి ఆయన మాతృరంగం నాటకాలే. నాటక [[రచయిత]]<nowiki/>గా ఆయన స్థానం సుస్థిరం. మనసుకవిగా సినిమా వారు పిలుచుకునే '''ఆత్రేయ''' నాటకాల్లో చక్కని ప్రయోగాలు చేసి నాటక రంగాన్ని మలుపుతిప్పారు.
==జీవిత సంగ్రహం==
[[1921]] [[మే 7]] న [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]లోని [[సూళ్ళూరుపేట]] మండలంలో గల [[మంగళంపాడు]] గ్రామంలో జన్మించాడు. తండ్రి [[కృష్ణమాచార్యులు]]. తల్లి సీతమ్మ. చిన్నప్పటినుండి నాటకంలోని పద్యాలను రాగయుక్తంగా చదివేవారు. సమాజంలో మధ్య తరగతి కుటుంబ సమస్యలను తీసుకుని మనోహరమైన నాటకాలుగా మలిచారు. వీరి 'ప్రవర్తన', '[[ఎన్.జి.వో]]' నాటకాలు [[ఆంధ్ర నాటక కళా పరిషత్తు|ఆంధ్ర నాటక కళా పరిషత్]] అవార్డులను గెలుచుకున్నారు. విశేషంగా రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రదర్శనలు జరిగాయి. అలాగే '[[కప్పలు]]' బాగా ప్రాచుర్యం పొందిన నాటకం. [[రాయలసీమ]] క్షామ పరిస్థితులను వివరించే 'మాయ' నాటకం, స్వాతంత్ర్యానంతరం దేశంలో చెలరేగిన హిందూ ముస్లిం హింసాకండను 'ఈనాడు' అనే మూడంకాల నాటకం మరియు విశ్వశాంతిని కాంక్షించే 'విశ్వశాంతి' నాటకాన్ని రచించారు. విశ్వశాంతి నాటకానికి కూడా రాష్ట్ర స్థాయి బహుమతి లభించింది. 'సామ్రాట్ అశోక','గౌతమ బుద్ధ' మరియు 'భయం' నాటకాలు కూడా వ్రాసారు.
పంక్తి 131:
[[వర్గం:తెలుగు కళాకారులు]]
[[వర్గం:నెల్లూరు జిల్లా సినిమా పాటల రచయితలు]]
[[వర్గం:కలం పేరుతో పేరుపొందినప్రసిద్ధులైన ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు]]
[[వర్గం:నెల్లూరు జిల్లా నాటక రచయితలు]]
[[వర్గం:నెల్లూరు జిల్లా సినిమా నిర్మాతలు]]
"https://te.wikipedia.org/wiki/ఆత్రేయ" నుండి వెలికితీశారు