ఉమాశంకర్ జోషి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
=== జాతీయోద్యమం ===
జోషి గాంధీ నేతృత్వంలోని జాతీయోద్యమంలో పనిచేశాడు.<ref name="ReferenceA" /> 1929 జనవరిలో ప్రారంభమైన గుజరాత్ కళాశాల విద్యార్థుల 34 రోజుల సమ్మెలో పాల్గొన్నాడు. 1930 ఏప్రిల్లో విరాంగం ఆశ్రమంలో సత్యాగ్రహిగా చేరాడు. నవంబరు నుంచి 14 వారాల పాటు ప్రభుత్వం జోషిని ఖైదు చేసింది. 1931 వరకు సబర్మతీ జైలు, యెరవాడ టెంట్-జైలులో గడిపాడు. 1931లో [[కరాచీ|కరాచీలో]] జరిగిన కాంగ్రెస్ జాతీయ సమావేశాలకు హాజరయ్యాడు. జూలై నుంచి ఆరు నెలల పాటు గుజరాత్ విద్యాపీఠ్ లో ఉన్నాడు. 1932లో రెండవ మారు జైలుపాలయ్యాడు. ఈసారి సబర్మతీ, విసాపూర్ జైళ్ళలో ఎనిమిది నెలలు గడిపాడు.<ref name="umashankarjoshi.in" /><ref name="Divya Bhaskar 2016" />
 
=== వ్యక్తిగత జీవితం ===
1934లో జోషి తండ్రి మరణించాడు. 1937 మే 25న జోషికి జ్యోత్స్నతో ముంబైలో వివాహం అయింది. వారికి నందిని, స్వాతి అని ఇద్దరు కుమార్తెలు. తల్లి 1966లో మరణించింది.<ref name="umashankarjoshi.in3" />
 
=== ఉద్యోగ జీవితం (విద్యారంగంలో) ===
[[దస్త్రం:Chunilal_Madia_and_Umashankar_Joshi.jpg|alt=|thumb|1960లో [[ముంబై]]<nowiki/>లో చునియాలాల్ మాదియాతో ఉమాశంకర్ జోషి (ఎడమవైపు)]]
1937లో జోషి [[ముంబై]]<nowiki/>లోని గోక్లిబాయ్ హైస్కూల్లో ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. ఆపై ఎం.ఎ. పట్టా సంపాదించాక ముంబైలోని సైదెన్హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో పార్ట్-టైం లెక్చరరుగా 1939 వరకు పనిచేశాడు. గుజరాత్ వెర్నాక్యులర్ సొసైటీ (గుజరాత్ విద్యాసభ)లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ స్టడీస్ విభాగంలో ఆచార్యునిగా నియమితుడయ్యాడు. అక్కడ 1946లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకునేంతవరకూ అక్కడే పనిచేశాడు. 1953లో బొంబాయి ప్రభుత్వం అతనిని గుజరాతీ పాఠ్యపుస్తక కమిటీలో సభ్యునిగా నియమించింది. 1953లో [[గుజరాత్]]<nowiki/>లోని [[భావ్‌నగర్|భావ్‌నగర్ జిల్లా]]<nowiki/>లోని సనొసరాలో లోక్ భర్తీ శిక్షణ సంస్థ అనే విద్యా సంస్థలో సందర్శక బోధకునిగా పనిచేశాడు. 1954 జూన్ లో [[గుజరాత్ విశ్వవిద్యాలయం]]<nowiki/>లో గుజరాతీ సాహిత్య ఆచార్యునిగా నియమితుడయ్యాడు. ఆ విశ్వవిద్యాలయంలోనే భాషా విభాగాధిపతిగానూ బాధ్యతలు స్వీకరించాడు. 1956లో అమెరికా, బ్రిటీష్ విశ్వవిద్యాలయాల్లోని సాధారణ విద్య కార్యకలాపాలను అధ్యయనం చేయడానికి భారత ప్రభుత్వం [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]], [[ఇంగ్లాండు]] దేశాలకు పంపిన కమిటీలో ఇతను ఒకడు. 1964లో దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర విశ్వవిద్యాలయాల స్థాపనకు గుజరాత్ ప్రభుత్వం నియమించిన కమిటీలో జోషీ సభ్యుడు. ఇతను 1966 నవంబరు 30న గుజరాత్ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా బాధ్యతలు తీసుకున్నాడు. 1972 నవంబరు 17న ఉపకులపతిగానే ఉద్యోగ విరమణ చెందాడు.<ref name="umashankarjoshi.in2" /><ref name="Divya Bhaskar 20162" />
 
=== మరణం ===
1988లో ముంబైలోని టాటా మొమోరియల్ ఆసుపత్రిలో కాలేయ క్యాన్సర్ సమస్య కారణంగా జోషీని చేర్చారు. అతను క్యాన్సర్ కారణంగా 77 సంవత్సరాల వయసులో 1988 డిసెంబరు 19న ముంబైలో మరణించాడు.<ref name="umashankarjoshi.in4" />
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఉమాశంకర్_జోషి" నుండి వెలికితీశారు