మహబూబ్​నగర్​ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి osm పటము చేర్చు
పంక్తి 24:
 
జిల్లాకు దక్షిణాన [[తుంగభద్ర నది]], [[కర్నూలు]] జిల్లా, తూర్పున [[నల్గొండ]] జిల్లా, ఉత్తరమున [[రంగారెడ్డి]] జిల్లా, పశ్చిమమున [[కర్ణాటక]] లోని [[రాయచూరు]], [[గుల్బర్గా]] జిల్లాలు ఉన్నాయి. ఈశాన్య దిశలో [[హైదరాబాదు]] జిల్లా ఉంది. హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికైక ఏకైక ముఖ్యమంత్రిని అందించిన జిల్లా ఇది. ఉత్తరప్రదేశ్ గవర్నరుగా పనిచేసిన బి.సత్యనారాయణ రెడ్డి ఈ జిల్లాలోనే జన్మించాడు.<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగు యోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సొసైటీ ప్రచురణ,తొలి ముద్రణ 2006, పేజీ 233</ref> రాష్ట్రంలోనే తొలి, దేశంలో రెండవ పంచాయతి సమితి జిల్లాలోనే స్థాపితమైంది. విస్తీర్ణం దృష్ట్యా చూసిననూ, మండలాల సంఖ్యలోనూ ఈ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. [[కృష్ణానది|కృష్ణా]] మరియు [[తుంగభద్ర నది|తుంగభద్ర]] నదులు రాష్ట్రంలో ప్రవేశించేది కూడా ఈ జిల్లా నుంచే. దక్షిణ కాశీగా పేరుగాంచిన[[ఆలంపూర్]]<ref>ఆంధ్రప్రదేశ్ దర్శిని, 1982 ముద్రణ, పేజీ 133</ref>, [[మన్యంకొండ]], [[కురుమూర్తి]],మల్దకల్ శ్రీస్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవస్థానం, ఊర్కొండపేట, [[శ్రీరంగాపూర్]] లాంటి పుణ్యక్షేత్రాలు, [[పిల్లలమర్రి (వృక్షం)|పిల్లలమర్రి]], [[బీచుపల్లి]], వరహాబాదు లాంటి పర్యాటక ప్రదేశాలు, [[ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు|జూరాల]], [[కోయిలకొండ]]కోయిల్ సాగర్, ఆర్డీఎస్, సరళాసాగర్ (సైఫర్ సిస్టంతో కట్టబడిన ఆసియాలోనే తొలి ప్రాజెక్టు<ref>నా దక్షిణ భారత యాత్రా విశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 247</ref>) లాంటి ప్రాజెక్టులు, చారిత్రకమైన [[గద్వాల]] కోట, [[కోయిలకొండ కోట]], [[చంద్రగఢ్ కోట]], పానగల్ కోట లాంటివి మహబూబ్‌నగర్ జిల్లా ప్రత్యేకతలు. [[సురవరం ప్రతాపరెడ్డి]], [[బూర్గుల రామకృష్ణారావు]], [[పల్లెర్ల హనుమంతరావు]] లాంటి స్వాతంత్ర్య సమరయోధులు, [[గడియారం రామకృష్ణ శర్మ]] లాంటి సాహితీవేత్తలు, [[సూదిని జైపాల్ రెడ్డి]], సురవరం సుధాకరరెడ్డి లాంటి వర్తమాన రాజకీయవేత్తలకు ఈ జిల్లా పుట్టినిల్లు. [[ఎన్.టి.రామారావు]]ను సైతం ఓడించిన ఘనత ఈ జిల్లాకే దక్కుతుంది.కెసిర్ ఈ జిల్లా మంత్రిగా ఉన్నపుడె తెలంగాణ రాష్ట్రం వచ్చింది. పట్టుచీరెలకు ప్రసిద్ధిచెందిన [[నారాయణపేట]], చేనేత వస్త్రాలకు పేరుగాంచిన [[రాజోలి]], కాకతీయుల సామంత రాజ్యానికి రాజధానిగా విలసిల్లిన వల్లూరు, రాష్ట్రకూటులకు రాజధానిగా ఉండిన కోడూరు, రసాయన పరిశ్రమలకు నిలయమైన కొత్తూరు, [[మామిడి]]పండ్లకు పేరుగాంచిన కొల్లాపూర్, [[రామాయణం|రామాయణ]] కావ్యంలో పేర్కొనబడిన జఠాయువు పక్షి రావణాసురుడితో పోరాడి నేలకొరిగిన ప్రాంతం, దక్షిణభారతదేశ చరిత్రలో ప్రసిద్ధి చెందిన రాక్షస తంగడి యుద్ధం జరిగిన [[తంగడి]] ప్రాంతం<ref>పాలమూరు వైజయంతి, 2013</ref> ఈ జిల్లాలోనివే. ఉత్తర, దక్షిణాలుగా ప్రధాన పట్టణాలను కలిపే 44వ నెంబరు జాతీయ రహదారి, సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం ఈ జిల్లానుంచే వెళ్ళుచున్నాయి. 2011, 2012లలో నూతనంగా ప్రకటించబడ్డ 7 పురపాలక/నగరపాలక సంఘాలతో కలిపి జిల్లాలో మొత్తం 11 పురపాలక/నగరపాలక సంఘాలు, 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోకసభ నియోజకవర్గాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 1553 రెవెన్యూ గ్రామాలు, 1348 గ్రామపంచాయతీలున్నాయి. ఈ జిల్లాలో ప్రధాన వ్యవసాయ పంట [[వరి]].
{{Infobox mapframe|zoom=8|frame-width=540|frame-height=400}}
 
==భౌగోళికం==
{{వేదిక|తెలంగాణ|Telangana.png}}