కిన్నెరసాని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
కిన్నెరసాని నదిపై [[పాల్వంచ]] మండలములోని [[యానంబైలు]] గ్రామము వద్ద విద్యుత్ ఉత్పాదనకై మరియు కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరందించేందుకు కిన్నెరసాని ప్రాజెక్టు నిల్వ జలాశ్రయాన్ని నిర్మించారు. [[1972]]లో నిర్మాణము పూర్తి చేసున్న ఈ ప్రాజెక్టుకు 558 లక్షల వ్యయమైనది. [[1998]] ఏప్రిల్ లో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈ ప్రాజెక్టును విద్యుచ్ఛక్తి శాఖకు బదిలీ చేసింది. ఈ ప్రాజెక్టు [[వ్యవసాయం|వ్యవసాయ]] భూములకు, విద్యుత్ ఉత్పత్తికే కాక పాల్వంచ, [[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]] పట్టణ ప్రజలకు త్రాగునీరు కూడా అందిస్తుంది.
 
2005లో జలయజ్ఞం పథకం క్రింద పాల్వంచ, [[బూర్గంపాడు]] మండలాల్లో పదివేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు కిన్నెరసాని ప్రాజెక్టుకు కుడి మరియు ఎడమ కాల్వల నిర్మాణాన్ని ఆమోదించారు. తొలి విడతలో భాగంగా నిర్మించిన కుడి ప్రధాన కాల్వను 2012లో [[ముఖ్యమంత్రి]] నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రారంభించాడు.<ref>http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article3740522.ece</ref>. ఇక్కడ [[కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం]] ఉంది. దీన్ని కిన్నెరసాని అభయారణ్యంలో నెలకొల్పారు.
 
==సాహిత్యంలో==
"https://te.wikipedia.org/wiki/కిన్నెరసాని" నుండి వెలికితీశారు