ఆలూరి బైరాగి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 36:
}}
 
'''[[ఆలూరి బైరాగి]]''', ప్రముఖ [[తెలుగు]] కవి, కథా రచయిత, [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] గ్రహీత, [[మానవతావాది]].
 
బైరాగి, [[తెనాలి]] తాలూకాలోని ఐతానగరంలో [[1925]], [[నవంబర్ 5]]వ తేదీన సరస్వతి, ఆలూరి వెంకట్రాయుడు దంపతులకు మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. బైరాగి రెండవ తరగతి వరకే తెలుగులో చదువుకున్నాడు. ఆయన తండ్రి [[హిందీ]] చదవమని ప్రోత్సహించడంతో 1935 ప్రాంతాల్లో [[యలమంచిలి వెంకటప్పయ్య]] స్థాపించిన హిందీ పాఠశాలలో చేరారు. పదమూడో ఏట హిందీలో ఉన్నత విద్యనభ్యసించడానికి ఆయన [[ఉత్తరాది]] వెళ్లారు. పదిహేనో ఏట ఆయన [[హిందీ]]లో కవితలు రాసి కవి సమ్మేళనాల్లో పాల్గొన్నారు. తన కవితా వ్యాసంగపు తొలినాళ్లలోనే ''పలాయన్'' అనే పేరుతో హిందీ కవితా సంకలనం ప్రచురించారు. [[ఎం.ఎన్.రాయ్]] నెలకొల్పిన ర్యాడికల్ డెమోక్రాటిక్ పార్టీకే అంకితమయ్యారు. స్వతహాగా [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] నేర్చుకొని [[ఇంగ్లీషు]]లో మంచి ప్రావీణ్యం సంపాదించారు. 1946లో గుంటూరు జిల్లా [[ప్రత్తిపాడు]] హైస్కూల్లో హిందీ ఉపాధ్యాయుడుగా చేరారు. తెలుగులో బైరాగి మొదటి కవితా సంకలనం ''చీకటి నీడలు'' ప్రచురించారు. బైరాగి పినతండ్రి, [[చందమామ]] వ్యవస్థాపకులలో ఒకరైన [[చక్రపాణి]] (ఆలూరు వెంకట సుబ్బారావు) హిందీ [[చందమామ]]కు సంపాదకత్వం వహించమని కోరడంతో మకాం మద్రాసుకు మార్చారు. తొలినుంచీ స్వేచ్ఛాజీవి అయిన బైరాగి చందమామలో కొనసాగలేక బయటకు వెళ్లిపోయారు. ''నూతిలో కప్పలు'', ''దివ్యభవనం'' కథా సంపుటిని ప్రచురించారు. బైరాగి రచనలలో కెల్లా ''నూతిలో కప్పలు'' ఆయన ఉత్కృష్ట రచన.
పంక్తి 67:
[[వర్గం:1925 జననాలు]]
[[వర్గం:1978 మరణాలు]]
[[వర్గం:కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుపురస్కార గ్రహీతలు]]
[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:గుంటూరు జిల్లా రచయితలు]]
"https://te.wikipedia.org/wiki/ఆలూరి_బైరాగి" నుండి వెలికితీశారు