"రాజారావు (ఆంగ్ల రచయిత)" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో వర్గం మార్పు
చి (+{{Authority control}})
చి (AWB తో వర్గం మార్పు)
రాజారావు [[1908]], [[నవంబరు 8]]వ తేదీన [[మైసూరు రాజ్యం]] (ప్రస్తుతం [[కర్ణాటక రాష్ట్రం]]) లోని [[హసన్]] పట్టణంలో ఒక స్మార్త బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతడు వారి తల్లి దండ్రులకు జన్మించిన 9 మంది సంతానంలో పెద్దవాడు. ఇతనికి ఏడుగురు చెల్లెల్లు, ఒక తమ్ముడు యోగేశ్వరానంద ఉన్నారు. ఇతని తండ్రి హెచ్.వి.కృష్ణస్వామి [[హైదరాబాదు]]లోని [[నిజాం కళాశాల]]లో [[కన్నడ భాష]]ను బోధించేవాడు. ఇతని తల్లి గౌరమ్మ ఒక గృహిణి. ఇతడు 4 యేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె మరణించింది.<ref name ="Guardian"/>
 
ఇతడు నైజాం పరిపాలనలో ఉన్న ఆనాటి [[హైదరాబాదు]]లోని మదరసా - ఎ - ఆలియాలో మెట్రిక్యులేషన్ వరకూ చదివాడు. తరువాత తండ్రి పనిచేస్తున్న [[నిజాం కళాశాల]]లో డిగ్రీ చదివాడు<ref name="మిసిమి">{{cite journal|last1=బి.పార్వతి|title=రాజారావు శతజయంతి|journal=మిసిమి|date=1 November 2008|volume=19|issue=11|pages=27-30|url=https://misimi1990.files.wordpress.com/2013/06/misimi_2008_11.pdf|accessdate=31 March 2018}}</ref>. తరువాత ఇతడు [[అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం]]లో ఫ్రెంచి అధ్యయనం చేశాడు. ఆ తర్వాత [[మద్రాసు విశ్వవిద్యాలయం]] నుండి ఇంగ్లీషు, చరిత్రలలో పట్టా పుచ్చుకున్నాడు. హైదరాబాదు రాష్ట్ర ప్రభుత్వంచేత 1929లో ఏషియాటిక్ స్కాలర్‌షిప్ పొంది [[ఫ్రాన్స్|ఫ్రాన్స్‌]]లోని మొపెయి విశ్వవిద్యాలయం (University of Montpellier)లో ఐరిష్ సాహిత్యంపై భారతీయ ప్రభావం అనే అంశంపై అధ్యయనం చేశాడు. 1931లో ఇతడు కేమిల్ మౌలీ అనే ఫ్రెంచి అధ్యాపకురాలిని వివాహం చేసుకున్నాడు. 1939 వరకు వీరు కలిసి ఉన్నారు. తరువాత వీరి సంబంధం భగ్నమైంది. ఈ వైవాహిక జీవితం గురించి రాజారావు తన నవల "ది సెర్పెంట్ అండ్ ది రోప్"లో వర్ణించాడు. 1939లో ఇతడు భారతదేశం తిరిగి వచ్చాడు. 1942లో ఇతడు [[క్విట్ ఇండియా]] ఉద్యమంలో పాల్గొన్నాడు. 1943-1944లో ఇతడు [[ముంబాయి|బొంబాయి]] నుండి వెలువడిన "టుమారో" అనే పత్రికకు సహసంపాదకుడిగా వ్యవహరించాడు. "శ్రీ విద్యా సమితి" అనే సాంస్కృతిక సంస్థ ప్రారంభానికి ఇతడు ముఖ్యకారకుడు. ఇతడు "చేతన" అనే మరో సాంస్కృతిక సంస్థతో కూడా అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. ఇతడు 1966 నుండి 1986 వరకు [[ఆస్టిన్|ఆస్టిన్‌]]లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో తత్త్వశాస్త్రాన్ని బోధించాడు. అక్కడ ఇతడు బోధించిన వాటిలో మార్క్సిజం నుండి గాంధీయిజం దాకా,మహాయాన బౌద్ధము, భారతీయ తత్త్వము, ఉపనిషత్తులు మొదలైనవి ఉన్నాయి. 1965లో ఇతడు అమెరికన్ రంగస్థల నటి ''కేథరిన్ జోన్స్‌''ను వివాహం చేసుకున్నాడు. వారికి క్రిస్టఫర్ రామారావు అనే ఒక కుమారుడు కలిగాడు. 1986లో ఆమెకు విడాకులు ఇచ్చి ''సూసన్ వాట్‌''ను మూడవ వివాహం చేసుకున్నాడు సూసన్ 1970లో టెక్సాస్ యూనివర్సిటీలో ఇతని శిష్యురాలు.
 
==రచనలు==
 
==మరణం==
ఇతడు [[2006]], [[జూలై 8]]వ తేదీన [[టెక్సాస్|టెక్సాస్]] రాష్ట్రంలోని [[ఆస్టిన్|ఆస్టిన్‌]] నగరంలోని తన గృహంలో 97వ యేట గుండెపోటుతో మరణించాడు.<ref name="Rao's demiseGuardian">{{cite webnews |url=httphttps://www.expressindiatheguardian.com/fullstorynews/2006/jul/17/guardianobituaries.php?newsid=70740india|title=Noted author Raja Rao: passesAn awayIndian writer using mysticism to explore the spiritual unity of east and west|publisher=[[The Indian ExpressGuardian]]|accessdate=83 July 2017 | location=London | date=17 July 2006 |first=Letizia |last=Alterno}}</ref><ref name="Rao's demise">{{cite newsweb |url=http://www.hinduexpressindia.com/2006/07/09/stories/2006070901831000fullstory.htmphp?newsid=70740|title=Noted author Raja Rao passes away|publisher=[[The HinduIndian Express]]|accessdate=9 July 2006|location=Chennai, India|date=98 July 2006}}</ref><ref name="Guardian">{{cite news |url=httpshttp://www.theguardianhindu.com/news/2006/jul07/1709/stories/guardianobituaries2006070901831000.indiahtm|title=Raja Rao: Anpasses Indian writer using mysticism to explore the spiritual unity of east and westaway|publisher=[[The GuardianHindu]]|accessdate=39 July 2017 2006| location=LondonChennai, India| date=179 July 2006 |first=Letizia |last=Alterno}}</ref>
 
==మూలాలు==
[[వర్గం:భారతీయ సాహిత్యవేత్తలు]]
[[వర్గం:ఆంగ్ల రచయితలు]]
[[వర్గం:కేంద్ర సాహిత్య అకాడెమిఅకాడమీ పురస్కార గ్రహీతలు]]
[[వర్గం:ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్ధులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2679280" నుండి వెలికితీశారు