దుర్గాబాయి దేశ్‌ముఖ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు తొలగించబడింది; వర్గం:రాజమండ్రి వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో వర్గం మార్పు, typos fixed: జూలై 15, 1909 → 1909 జూలై 15, సాంఘీక → సాంఘిక, → , ( → (
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 38:
 
== దుర్గాబాయి దేశ్ ముఖ్ ==
దుర్గాభాయి దేశ్ ముఖ్ ఒక నిర్భయమైన [[స్వాతంత్ర్య సమరయోధురాలు]] మరియు ఒక ప్రత్యేక సామాజిక కార్యకర్త అని పేరు. ప్రముఖంగా ఒక మధ్యతరగతి [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో [[ఆంధ్ర ప్రదేశ్]]లో ఆమె [[రాజమండ్రి]], 1909 జూలై 15, 1909 న జన్మించింది. కానీ ఆమె ఆంధ్రప్రదేశ్ నుండి స్నాతక పట్టా పొందింది.తర్వాత [[న్యాయశాస్త్రం]] చదివి [[మద్రాసు]]లో [[హైకోర్టు]] వద్ద సాధన ప్రారంభించింది. ఆమె [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో సామాజిక సర్వీస్ మదర్ గా పిలిచేవారు.దుర్గాభాయి దేశముఖ్ ఒక భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, న్యాయవాది, సామాజిక కార్యకర్త మరియు రాజకీయ నాయకురాలు. ఆమె భారతదేశం యొక్క రాజ్యాంగ సభ మరియు భారతదేశం యొక్క [[ప్రణాళికా సంఘం]] సభ్యురాలు.
 
== బాల్యం మరియు చదువు ==
పంక్తి 51:
దుర్గాబాయి 1909లో రాజమండ్రిలో కృష్ణవేణమ్మ, రామారావు దంపతులకు జన్మించారు. ఈమె బాల్యంనుండి ప్రతిభాపాఠవాలను కనబరుస్తూ పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి, హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసులవారికీ విద్యాబోధన కావించేవారు. చిన్ననాటి నుండే స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకుంది. తెలుగుగడ్డ పై [[మహాత్మా గాంధీ]] రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది. మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందించింది. 1923లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీరుగా పనిచేస్తూ [[నెహ్రూ]] వద్ద టిక్కెట్ లేని కారణము చేత ఆయనను అనుమతించక, తన కర్తవ్య నిర్వహణకు గాను ఆయన నుండి ప్రశంసలను పొందింది. ఆ పై మహాత్ముని ఆంధ్ర పర్యటనలలో ఆయన [[హిందీ]] ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది. ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని అరెస్టు కాబడింది. స్వాతంత్య్ర సమరకాలంలో ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసి ఎంఎ, బిఎల్‌, బిఎ ఆనర్స్‌ చేసి న్యాయకోవిదురాలిగా, ప్రఖ్యాత క్రిమినల్‌ లాయర్‌గా పేరుగాంచారు.
 
దుర్గాబాయి అనేక మహిళా సంస్థలు, సాంఘీకసాంఘిక సంక్షేమ సంస్థలను ప్రారంభించి స్త్రీల అభ్యున్నతికి కృషిచేశారు. ఈమె ఆధ్వర్యంలో 1937లో చెన్నైలో ఆంధ్ర మహిళా సభ స్థాపించబడింది.1937లో ''లిటిల్ లేడీస్ ఆఫ్ బ్రుందావన్ ''అనే బాల సంఘాన్ని ప్రారంభించింది.ఈమె 1941లో ''ఆంధ్ర మహిళ'' పత్రికను స్థాపించి, సంపాదకత్వ బాధ్యతలను నెరవేర్చింది. చెన్నైలో 70మంది కార్యకర్తలతో ''ఉదయవనం''అను పేరుతో సత్యాగ్రహ శిభిరం ఏర్పరిచారు.1953లో ఆర్థికమంత్రి చింతామణి దేశ్ ముఖ్ తో వివాహం జరిగింది.1971లో సాక్షారతా భవన్ ని ప్రారంభించింది.
 
== స్వాతంత్ర్యం తర్వాత ==
పంక్తి 59:
*1975 - [[పద్మ విభూషణ్]]. అదే సంవత్సరం ఆవిడ భర్త [[సి.డి.దేశ్‌ముఖ్]] కూడా [[పద్మ విభూషణ్]] పొందారు.
*[[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]నుండి గౌరవ డాక్టరేట్
*1971 - నెహ్రూ లిటరసీ అవార్డు (వయోజన విద్యాసేవలకు గుర్తింపుగా వొచ్చింది.)
*[[యునెస్కో]] నుండి పాల్ జి. హాఫ్‌మన్ అవార్డు..