కన్యాశుల్కం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''కన్యాశుల్కం''', పెళ్ళిచేసుకుంటున్నందుకు వరుడు వధువుకిచ్చే రొక్కం. ఇదొక హిందూ సంప్రదాయం.గురజాడ మహాకవి రచించిన గొప్ప నాటకం కన్యాశుల్కం. నిజానికి తెలుగు సాహిత్యలోకంలో కన్యాశుల్క నాటకం ద్రువతార. ఇందులో సమాజమంతా ఉంది. సమాజంలోని అన్ని మనస్తత్వాల వ్యక్తులు ఇందులో ఉన్నారు. వ్యావహారిక భాషలో గురజాడ ఈ నాటకాన్ని రచించి గిడుగు రామమూర్తి గారి వ్యావహారిక భాషోద్యమానికి చేయూతనిచ్చాడు. కన్యాశుల్కంలో సమకాలీన సామాజిక సమస్యలన్నీ గురజాడ వివరించాడు. మధుర వాణి, గిరీశం, రామప్పంతులు, అగ్నిహోత్రావధానులు, లుబ్ధావధాని, కరటక శాస్రి, వెంకటేశమ్, బుచ్చమ్మ వంటి పాత్రలు సజీవ శిల్పాలు.
కన్యాశుల్కంలోని మధురవాణి గురజాడ అపూర్వ సృష్టి. మధురవాణి వేశ్య. ఈ నాటకానికి నాయిక. నాటకకథను నడిపించింది మధురవాణియే. వేశ్య అయినా నీతి నిజాయితీలు మధురవాణి సొత్తు. మృచ్చకటికం నాటకంలోని వసంతసేన మధురవాణి సృష్టికి ప్రేరణ. గురజాడపై శూద్రకుని ప్రభావం ఉంది.
గీరీశం జిత్తులమారి నక్క. కుహనా సంస్కర్త. తన కాలమ్నాటి సమాజంలోని దొంగ సంస్కర్తలకు ప్రతినిధిగా గిరీశాన్ని గురజాడ సృష్టించాడు. బుచ్చెమ్మ అనే యంగ్ విడోను వలలో వేసుకోవడానికి గిరీశం అనేక యెత్తులు వేస్తాడు.చివరికి పప్పులు ఉడక్క డామిట్ కథ అడ్డం తిరిగింది అని నిష్క్రమిస్తాడు.
 
"http://te.wikipedia.org/wiki/%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:%E0%B0%95%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B6%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D%E0%B0%95%E0%B0%82" నుండి వెలికితీశారు
"https://te.wikipedia.org/wiki/కన్యాశుల్కం" నుండి వెలికితీశారు