"రాయలసీమ" కూర్పుల మధ్య తేడాలు

342 bytes added ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (8), కు → కు (2), గా → గా , స్థంభము → స్తంభము, బడినది. using AWB)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
'''రాయలసీమ''' అనునది [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని మూడు ముఖ్యప్రాంతాల్లో ఒకటి . ఆంధ్ర ప్రదేశ్ లోని దక్షిణ భాగంలో ఉండే నాలుగు జిల్లాలు ( [[కర్నూలు]], [[కడప]], [[అనంతపురం]], [[చిత్తూరు]]) రాయలసీమ ప్రాంతంలోకి వస్తాయి.
 
రాయలసీమ [[విజయనగర సామ్రాజ్యం]]లో భాగాంగా [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీ కృష్ణదేవ రాయల]]చే పరిపాలించబడింది. అదేవిదంగా కాకతీయ, ముసునూరి వారసులైన పెమ్మసాని, రావెళ్ళ, మిక్కిలినేని, సాయపనేని కమ్మనాయక రాజులు రాయలసీమ ప్రాంతని పరిపాలించారు. అది వరకూ [[తూర్పు చాళుక్యులు|తూర్పు చాళుక్యుల]] పరిపాలనా కేంద్రంగా '''హిరణ్యక రాష్ట్రం'''గా ఈ ప్రాంతం విలసిల్లినది. తర్వాత రాయలసీమ పై [[చోళులు|చోళుల]] ప్రభావం పెరిగింది. బ్రిటీషు వారి సహకారాన్ని పలు యుద్ధాలలో పొందిన [[హైదరాబాదు]]కి చెందిన నిజాం సుల్తానులు 1802 లో ఈ ప్రాంతాన్ని వారికి ధారాదత్తం చేయటంతో దీనికి '''దత్త మండలం ''' అని పేరు వచ్చింది. 1808 లో '''దత్త మండలం''' ను విభజించి [[బళ్ళారి]] మరియు [[కడప]] జిల్లాలని ఏర్పరచారు. 1882 లో అనంతపురాన్ని బళ్ళారి నుండి వేరు చేశారు. ఈ ప్రాంతానికి [[1928]]లో [[చిలుకూరి నారాయణరావు]] "రాయలసీమ" అని పేరుపెట్టాడు. అప్పటి నుండి ఆ పేరే స్థిరపడినది.
 
ప్రాథమికంగా తెలుగు మాట్లాడే ఈ జిల్లాలు 1953 వరకూ [[మద్రాసు ప్రెసిడెన్సీ]]లో భాగంగా ఉన్నాయి. [[బళ్ళారి]] కూడా రాయలసీమలో ప్రాంతంగానే ఉండేది. [[కోస్తా]], రాయలసీమ నాయకులు జరిపిన అనేక సంవత్సరాల ఉద్యమం ఫలితంగా 1953లో ప్రత్యేక [[ఆంధ్ర రాష్ట్రం]] ఏర్పడింది. అప్పుడు ఈ నాలుగు జిల్లాలను [[ఆంధ్ర రాష్ట్రం]] లో, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు దృష్ట్యా బళ్ళారిని [[కర్ణాటక]]లో కలిపి వేశారు. [[కన్నడ]], [[తెలుగు]] మాట్లాడేవారు సమానంగా ఉన్న బళ్ళారి నగరాన్ని పలు చర్చలు, వివాదాల తర్వాత [[మైసూరు]]లో చేర్చారు. 1956 లో ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణాలో కలపటంతో అప్పటి నుండి ఇవి [[ఆంధ్ర ప్రదేశ్]]లో భాగంగా ఉంటున్నవి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2685295" నుండి వెలికితీశారు