జువ్వాడి గౌతమరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలములు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 36:
}}
 
'''[[జువ్వాడి గౌతమరావు]]''' ([[ఫిబ్రవరి 1]], [[1929]] - [[2012]]) భాషాభిమాని, సాహితీకారుడు.
 
[[దస్త్రం:Juvvada Gautam Raju and his wife.JPG|right|thumb|జువ్వాడి గౌతమరావు దంపతులు, ఆయన చనిపోవటానికి కొద్దిరోజులు ముందు తీసిన చిత్రం]]
== జననం ==
[[కరీంనగర్]] మండలం [[ఇరుకుళ్ళ]] గ్రామంలో [[1929]], [[ఫిబ్రవరి 1]] న '''జువ్వాడి గౌతమరావు''' జన్మించాడు. [[కరీంనగర్|కరీంనగర్‌]]<nowiki/>లో విద్యాభ్యాసం సాగించాడు. [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో బీఏ ఎల్‌ఎల్‌బీ పట్టా పుచ్చుకున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. [[పాములపర్తి వెంకట నరసింహారావు|పీవీ నరసింహారావు]], [[కోవెల సుప్రసన్నాచార్య]], [[కోవెల సంపత్కుమారాచార్య]] వంటి సాహితీ మిత్రులతో ఆయనకు చాలా సాన్నిహిత్యం ఉన్నది. కరీంనగర్ సాహిత్య చైతన్య కేంద్రంగా భాసిల్లడంలో గౌతంరావు పాత్ర ఘననీయమైనది. [[వరంగల్‌]]లో [[కాళోజీ]], [[ఆదిలాబాదు]]లో [[సామల సదాశివ]] మాదిరిగా కరీంనగర్‌లో జువ్వాడి గౌతంరావు సాహితీ వటవృక్షంగా వేలాదిమంది సాహితీకారులకు ఆశ్రయమిచ్చాడు. [[ఔరంగాబాద్]] జైలు గోడలను ఛేదించుకొని వచ్చిన ధైర్యశాలి. [[కరీంనగర్‌]]లో [[తెనుగు]] ఉనికిని కాపాడుతూ, అనేక కవితా గోష్ఠులలో పాల్గొంటూ నిరంతర సాహిత్య సేవ చేసిన భాషాభిమాని జువ్వాడి. ఆధునిక కాలంలో అడుగంటి పోతున్న సంప్రదాయ కవితా పరిరక్షణ కోసం పాటుపడ్డాడు. <ref>http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/juvvadi-gautham-rao-passes-away/article3819061.ece</ref>
స్వాతంత్య్ర పోరాటంలో యోధుడిగా పని చేసిన ఆయన సోషలిస్టుగా పరిణతి చెందాడు. ప్రగతిగామిగా ఉంటూనే [[విశ్వనాథ సత్యనారాయణ|విశ్వనాథ]] [[రామాయణ కల్పవృక్షం|రామాయణ కల్పవృక్షా]]నికి, విశ్వనాథకు భక్తుడిగా మారాడు. ప్రేమతో విశ్వనాథుని తన హృదయంలో దాచుకొని ఆ స్కూల్ ఆఫ్ థాట్‌కు తనను తాను పరిమితం చేసుకున్నాడు. రాజకీయాలంటే ఇష్టం లేకుండానే ఎన్నికల్లో జనతా పార్టీ పక్షాన 1977లో పోటీ చేశాడు.
 
పంక్తి 57:
[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:2012 మరణాలు]]
[[వర్గం:తెలుగు సాహితీకారులు]]
[[వర్గం:స్వాతంత్ర్య సమర యోధులు]]
[[వర్గం:సంపాదకులు]]
"https://te.wikipedia.org/wiki/జువ్వాడి_గౌతమరావు" నుండి వెలికితీశారు