తాండూర్ నాపరాతి పరిశ్రమ: కూర్పుల మధ్య తేడాలు

→‎పాలిషింగ్ చేయడం: వ్యాసం విస్తరణ
పంక్తి 5:
===గనుల నుంచి వెలికితీయడం===
తాండూర్ ప్రాంతంలో గత అర్థ శతాబ్ది కాలంగా నాపరాతిని గనులనుంచి వెలికితీయడం జరుగుతున్ననూ సాంకేతిక పద్దతులను ఉపయోగించడం ఇటీవలే ప్రారంభమైంది. ప్రారంభంలో కార్మికుల ద్వారానే చేతిపనిముట్లను ఉపయోగించి నాపరాతిని బయటకు తీస్తున్నప్పుడు చాలా భాగం పనికిరాకుండా ముక్కలు ముక్కలుగా లభ్యమయ్యేది. ఇటీవలి కాలంలో సాంకేతిక పరిజ్ఞానంతో, ఆధునిక యంత్రసామాగ్రిని ఉపయోగించి భూమి పొరలలో లభ్యమయ్యే ముడి నాపరాతిని వృధాకాకుండా వెలికితీయడం జరుగుతోంది. గనుల వలన యజమానులకే కాకుండా అక్కడ పనిచేసే కార్మికులకు కూడా జీవనోపాధి కలుగుతోంది.
===గనుల నుంచి పాలిషింగ్ పరిశ్రమలకు ముడి సరకు సరఫరా===
గనులనుంచి వెలికి తీసిన ముడి నాపరాతిని పాలిషింగ్ పరిశ్రమలకు లారీలద్వారా సరఫరా చేయడం జరుగుతుంది. ఈ రవాణా కొరకే తాండూర్ ప్రాంతంలో వేల సంఖ్యలో లారీలు నిరీక్షిస్తుంటాయి. గనులనుంచి పరిశ్రమలకు నిత్యం లారీల రవాణా వలన తాండూర్-[[చించోళి]] ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిండుగా ఉంటుంది. గనుల ప్రాంతంలో లారీలలో ముడిరాయిని గనులలో పనిచేసే కార్మికులే లోడింగ్ చేస్తారు. పరిశ్రమల వద్ద ముడిరాతిని దింపడం పరిశ్రమలలో పనిచేసే కార్మికులు చేస్తారు. లారీలలో ఎక్కించడం మరియు దించడానికి ప్రత్యేకంగా రేట్లు ఉంటాయి.
===పాలిషింగ్ చేయడం===
ముడిరాతిని గనులనుంచి వెలికితీయడం ఒక ఎత్తయితే దానిని భవనాల నిర్మాణంలో ఉపయోగించే విధంగా నునుపుచేయడం మరో ఎత్తు. ప్రారంభంలో చుట్టు తిరిగే ఒక పెద్ద చక్రం కింద ముడినాపరాతిని పెట్టి గంటలతరబడి నీళ్ళు, ఇసుక వేసి నునుపు చేసేవారు. అయిననూ అది పూర్తిగా నునుపుగా కాకుండా గరుకుగా ఉండేది. ఇటీవలి కాలంలో ఒకే కార్మికుడు చేతితే ఒక నాపరాతిని వేగంగా తిరిగే యంత్రం సహాయంతో దానిపై తిప్పి నునుపు చేయడం జరుగుతోంది. ఇదే హ్యాండ్‌పాలిషింగ్ పరిశ్రమగా పేరుగాంచినది. ఈ పరిశ్రమద్వారా ఒకే రాతిని మూడు సార్లు యంత్రం ద్వారా తిప్పవలసి ఉంటుంది. యంత్రం క్రింది భాగంలో గిట్టీలు అనబడే పత్యేకంగా చేయబడినవి ప్లేతుకు అమర్చుతారు. యంత్రం సహాయంతో ప్లేటు వేగంగా తిరుగుతున్నప్పుడు నాపరాతి నునుపు చెందుతుంది. ఈ ప్రక్రియలో నీళ్ళు ధారాళంగా ప్రవహిస్తూ ఉండాలి.