తాండూర్ నాపరాతి పరిశ్రమ: కూర్పుల మధ్య తేడాలు

→‎పాలిషింగ్ చేయడం: వ్యాసం విస్తరణ
→‎పాలిషింగ్ చేయడం: వ్యాసం విస్తరణ
పంక్తి 8:
గనులనుంచి వెలికి తీసిన ముడి నాపరాతిని పాలిషింగ్ పరిశ్రమలకు లారీలద్వారా సరఫరా చేయడం జరుగుతుంది. ఈ రవాణా కొరకే తాండూర్ ప్రాంతంలో వేల సంఖ్యలో లారీలు నిరీక్షిస్తుంటాయి. గనులనుంచి పరిశ్రమలకు నిత్యం లారీల రవాణా వలన తాండూర్-[[చించోళి]] ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిండుగా ఉంటుంది. గనుల ప్రాంతంలో లారీలలో ముడిరాయిని గనులలో పనిచేసే కార్మికులే లోడింగ్ చేస్తారు. పరిశ్రమల వద్ద ముడిరాతిని దింపడం పరిశ్రమలలో పనిచేసే కార్మికులు చేస్తారు. లారీలలో ఎక్కించడం మరియు దించడానికి ప్రత్యేకంగా రేట్లు ఉంటాయి.
===పాలిషింగ్ చేయడం===
ముడిరాతిని గనులనుంచి వెలికితీయడం ఒక ఎత్తయితే దానిని భవనాల నిర్మాణంలో ఉపయోగించే విధంగా నునుపుచేయడం మరో ఎత్తు. ప్రారంభంలో చుట్టు తిరిగే ఒక పెద్ద చక్రం కింద ముడినాపరాతిని పెట్టి గంటలతరబడి నీళ్ళు, ఇసుక వేసి నునుపు చేసేవారు. అయిననూ అది పూర్తిగా నునుపుగా కాకుండా గరుకుగా ఉండేది. ఇటీవలి కాలంలో ఒకే కార్మికుడు చేతితే ఒక నాపరాతిని వేగంగా తిరిగే యంత్రం సహాయంతో దానిపై తిప్పి నునుపు చేయడం జరుగుతోంది. ఇదే హ్యాండ్‌పాలిషింగ్ పరిశ్రమగా పేరుగాంచినది. ఈ పరిశ్రమద్వారా ఒకే రాతిని మూడు సార్లు యంత్రం ద్వారా తిప్పవలసి ఉంటుంది. యంత్రం క్రింది భాగంలో గిట్టీలు అనబడే పత్యేకంగా చేయబడినవి ప్లేతుకు అమర్చుతారు. యంత్రం సహాయంతో ప్లేటు వేగంగా తిరుగుతున్నప్పుడు నాపరాతి నునుపు చెందుతుంది. ఈ ప్రక్రియలో నీళ్ళు ధారాళంగా ప్రవహిస్తూ ఉండాలి. ప్లేటును మూడూ సార్పు మార్పుచేయవలసి వస్తుంది. మొదటిసారి ప్రాథమిక గిట్టిలు ఉండే ప్లేటు ద్వారా ముడినాపరాతిమీద ఉండే భాగం చదునుగా తయారవుతుంది. రెండో దశలో ప్రాథమిక దశలో ఏర్పడిన మరకలు కూడా మునుపుగా తయారౌతాయి. అంతిమదశలో నునుపు గిట్టీల ప్లేటు ద్వారా నాపరాయి పూర్తిగా ప్రకాశవంతంగా తయారౌతుంది.
ఈ విధంగా పాలిషింగ్ చేయడం ఒకరోజులో ఒక కార్మికుడు దాదాపు 100 నుంచి 150 చదరపు అడుగుల రాతిని నునుపుచేయగలడు. ప్రతిఫలంగా అతనికి రూ.200/- నుంచి రూ.300/- వేతనం లభిస్తుంది.
===మార్కెటింగ్===
ముడినాపరాతిని పాలిష్ చేసిన తరువాత భవనాల నిర్మాణంలో ఉపయోగించడానికి దేశంలోని వివిధ ప్రాంతాలను రవాణా చేయడం జరుగుతుంది. [[ఆంధ్ర ప్రదేశ్]] లోనే కాకుండా పొరుగురాష్ట్రాలైన [[మహారాష్ట్ర]], [[కర్ణాటక]], [[తమిళనాడు]] రాష్ట్రాలకు కూడా దీనిని సరఫరా చేస్తుంటారు.
==సమస్యలు==
తాండూర్ ప్రాంతంలో నాపరాతి పరిశ్రమ వలన కాలుష్యం విపరీతంగా వెదజల్లుతోంది. పాలిషింగ్ సమయంలో నాపరాయి పొడిరూపంలో గాలిలో కలిసి పనిచేసే కార్మికులకే కాకుండా పరిసరప్రాంతంలో ఉన్నవారికి కూడా సమస్యలు కలుగజేస్తుంది. రాత్రిసమయంలో పరిశ్రమల వలన వచ్చే శబ్దం వల్ల కూడా అనేక అనర్థాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అక్కడ పనిచేసే కార్మికుల ఆరోగ్యం విపరీతంగా దెబ్బతింటుంది. నిత్యం ట్రాఫిక్ వలన అనేక రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయి.