వేంపెంట ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
1998లో ఎనిమిది మందిని సజీవ దహనం చేసినపుడు, 2004లో ఎనిమిది మందిని ఊచకోత కోసినపుడు, వేపెంట ప్రధానంగా వర్తలలోకి ఎక్కింది. ఈ ఊరు నక్సల్స్ ఉద్యమానికి పురిటిగడ్డ. ఈ గ్రామంలో 7వేల జనాభా, 1500 ఇళ్ళు ఉన్నాయి. ఈ గ్రామానికి ఒకవైపు నల్లమల అడవులు మరోవైపు సీమ ప్రాంతానికి నీరందించే కె.సి.కెనాల్ ఉన్నాయి. గ్రామంలో 5800 ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే అందులో 1300 ఎకరాల రిజర్వు ఫారెస్టు ఉంది. మిగిలిన భూమికి కె.సి. కెనాల్ నుండి సాగునీరు అందుతుంది. ఊరి పక్కనే ఉన్న శ్రీశైలం కుడిగట్టు కాలువ నుంచి మోటర్లతో పంటలకు నీరుపెట్టుకుంటారు. కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం నుండి ఈ గ్రామంలో కమ్యూనిస్టుల ప్రభావం ఉంది. ఇళ్లస్థలాల కోసం, భూము కోసం గ్రామంలో అనేక ఉద్యమాలు జరిగాయి. 1990, 1994-95 లలో గ్రామస్థులు ప్రభుత్వం నుండి భూములు పొందారు. రైతుకూలీ సంఘాలు, రైతు సంఘాల అధ్వర్యంలో భూ ఉద్యమాలు ఈ ప్రాంతంలో జరిగాయి.
 
వేంపెంటలో ఒక దశలో దళిత, అగ్రవర్ణాలకు మధ్య విభేదాలు ఏర్పడి అది కాస్త దమనకాండకు, ఊచకోతకు దారితీసింది. 1998లో 9 మందిని సజీవ దహనం చేసారు. అందులో ఐదుగురు దళితులు, నలుగురు బీ.సీలు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. ఈ ఘటన తరువాత గ్రామంలో 173 మందిని బాధితులుగా గుర్తించి ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున ప్రభుత్వం అందజేసింది. వారందరికీ ఇళ్ళు కట్టి ఇచ్చింది ప్రభుత్వం. ఈ ఘటనకు ప్రతీకారంగా 2004లో మావోయిస్టులు ఎనిమిది మందిన నల్లకాల్వ వద్ద ఊచకోత కోసారు. ఈ రెండు ఘటనలతో వేంపెంట సంచలనంగా మారింది. సారా ఉద్యమం కూడాఅ వేంపెంట లో తీవ్ర స్థాయిలో జరిగింది.
 
== పవర్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమం ==
1999లో వేంపెంటకు కొన్నిమీటర్ల దూరంలో మూడు పవర్ ప్లాంట్లకు అనుమతినిచ్చింది ప్రభుత్వం. అప్పట్లో ఆ ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమం తీవ్రంగా ఉండటంతో పవర్ ప్లాంటు ఏర్పాటు చేయలేదు. వేంపెంట ప్రక్కనే ఉన్న నిప్పుల వాగు మీదుగా 2.4 మెగావాట్ల సామర్థ్యం చొప్పున మూడు పవర్ ప్లాంట్ లను అనుమతి నిస్తూ 2003లో జీ.వో నెం.48,49,50 లను జారీ చేసింది ప్రభుత్వం. 2011లో పవర్ ప్లాంటు నిర్మాణానికి సర్వే మొదలు కావటంతో గ్రాంస్థులలో ఆందోళన మొదలైంది. పవర్ ప్లాంటు నిర్మాణం చేపడుతున్న స్థలం గ్రామానికి ప్రక్కనే ఉండటంతో నిర్మాణ సమయంలో ప్రేలుళ్లకు ఇళ్ళు కూలిపోయాయనీ, ప్రేలుడు సమయంలో వెలుపడే రసాయన పదార్థాలు అనారోగ్యానికి దారితీస్తాయని, ఆందోళన మొదలైంది. పవర్ ప్లాంటు కోసం కాలువ లోతుగా త్రవ్వితే భూగర్భ జలాలు అడుగంటి పోయాయని దాని మూలంగా పంటలు పండవని భావించిన గ్రాంస్థులు 2011 ఆగస్టులో భూమి పూజ చేసేందుకు వెళ్ళిన వారిని అడ్డుకున్నారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వేంపెంట_ఉద్యమం" నుండి వెలికితీశారు