"పెమ్మసాని నాయకులు" కూర్పుల మధ్య తేడాలు

చి
చిన్నతిమ్మానాయుడు [[గండికోట]] చివరి పాలకుడు. ఈతని మంత్రి పొదిలి లింగన్న ప్రోద్భలముతో గోల్కొండ నవాబు పెద్ద సైన్యముతో మీర్ జుంలాను గండికోట వశము చేసుకొనుటకు పంపెను (1652). భీకరయుద్ధము జరిగినను కోట వశముకాలేదు. గండికోట అప్పగించినచో [[గుత్తి]] దుర్గమునకు అధిపతి చేస్తానని జుంలా బేరసారాలు చేశాడు. తిమ్మా నాయుడు అంగీకరించలేదు<ref>Dr Ghulam Yazdani Commemoration Volume, H. K. Sherwani, 1966, Dr Abul Kalam Azad Oriental Research Institute, Delhi</ref>. చివరికి మీర్ జుంలా లింగన్నకు లంచమిచ్చి చిన్నతిమ్మానాయునిపై విషప్రయోగము గావించి కోటను ఆక్రమించాడు. చిన్నతిమ్మనాయుని [[కొడుకు]] బాలుడగు పిన్నయ నాయుని ఆతని బంధువులు తప్పించి మైసూరు తీసుకొనివెళ్ళిరి. మిగిలిన అరువదియారు ఇంటిపేర్ల [[గండికోట]] [[కమ్మ]] వంశములు గంపలలో ఆభరణములు, విలువైన వస్తువులు పెట్టుకొని [[గుంటూరు]], కార్వేటిరాజుపురము, [[మధుర]], [[తిరునెల్వేలి]], రామనాథపురములకు తరలివెళ్ళిరి. వీరందరు గంపకమ్మవారని, గండికోట కమ్మవారని వాడుకలోనికి వచ్చిరి.
 
కొందరు నాయకులు మధురనేలుచున్న విశ్వనాథ నాయకుని వద్ద, తంజావూరి నాయకుల వద్ద సేనానులుగా చేరిరి. ఫెద్దవీరప్ప నాయుదునాయుడు, రుద్రప్ప నాయుడు మున్నగువారు సింహళదేశ యుద్ధములలో మధుర నాయకులకు విజయములు సాధించిపెట్టి కురివికులము మొదలగు జమీందారీలు పొందిరి.
 
[[బ్రిటిషు|బ్రిటిష్]] వారి కాలములో కురివికులము [[జమీందారు]] [[పెమ్మసాని నందస్వామిదురై కొండలరాయస్వామి నాయుడు]].
5,722

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2690687" నుండి వెలికితీశారు