వేంపెంట ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
+ మూలం
పంక్తి 2:
==విశేషాలు==
 
1998లో ఎనిమిది మందిని సజీవ దహనం చేసినపుడు<ref>{{Cite web|url=https://www.hrw.org/news/1998/07/28/hrw-letter-killings-dalits-andhra-pradesh-india|title=HRW Letter: Killings of Dalits in Andhra Pradesh (India)|last=Avenue|first=Human Rights Watch {{!}} 350 Fifth|last2=York|first2=34th Floor {{!}} New|date=1998-07-28|website=Human Rights Watch|access-date=2019-07-12|last3=t 1.212.290.4700|first3=NY 10118-3299 USA {{!}}}}</ref><ref>{{Cite web|url=https://www.thehindu.com/2005/03/02/stories/2005030212150300.htm|title=The Hindu : Andhra Pradesh / Kurnool News : Vempenta villagers shell-shocked|website=www.thehindu.com|access-date=2019-07-12}}</ref>, 2004లో ఎనిమిది మందిని ఊచకోత కోసినపుడు, వేపెంట ప్రధానంగా వర్తలలోకి ఎక్కింది. ఈ ఊరు నక్సల్స్ ఉద్యమానికి పురిటిగడ్డ. ఈ గ్రామంలో 7వేల జనాభా, 1500 ఇళ్ళు ఉన్నాయి. ఈ గ్రామానికి ఒకవైపు నల్లమల అడవులు మరోవైపు సీమ ప్రాంతానికి నీరందించే కె.సి.కెనాల్ ఉన్నాయి. గ్రామంలో 5800 ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే అందులో 1300 ఎకరాల రిజర్వు ఫారెస్టు ఉంది. మిగిలిన భూమికి కె.సి. కెనాల్ నుండి సాగునీరు అందుతుంది. ఊరి పక్కనే ఉన్న శ్రీశైలం కుడిగట్టు కాలువ నుంచి మోటర్లతో పంటలకు నీరుపెట్టుకుంటారు. కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం నుండి ఈ గ్రామంలో కమ్యూనిస్టుల ప్రభావం ఉంది. ఇళ్లస్థలాల కోసం, భూము కోసం గ్రామంలో అనేక ఉద్యమాలు జరిగాయి. 1990, 1994-95 లలో గ్రామస్థులు ప్రభుత్వం నుండి భూములు పొందారు. రైతుకూలీ సంఘాలు, రైతు సంఘాల అధ్వర్యంలో భూ ఉద్యమాలు ఈ ప్రాంతంలో జరిగాయి.
 
వేంపెంటలో ఒక దశలో దళిత, అగ్రవర్ణాలకు మధ్య విభేదాలు ఏర్పడి అది కాస్త దమనకాండకు, ఊచకోతకు దారితీసింది. 1998లో 9 మందిని సజీవ దహనం చేసారు. అందులో ఐదుగురు దళితులు, నలుగురు బీ.సీలు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. ఈ ఘటన తరువాత గ్రామంలో 173 మందిని బాధితులుగా గుర్తించి ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున ప్రభుత్వం అందజేసింది. వారందరికీ ఇళ్ళు కట్టి ఇచ్చింది ప్రభుత్వం. ఈ ఘటనకు ప్రతీకారంగా 2004లో మావోయిస్టులు ఎనిమిది మందిన నల్లకాల్వ వద్ద ఊచకోత కోసారు. ఈ రెండు ఘటనలతో వేంపెంట సంచలనంగా మారింది. సారా ఉద్యమం కూడాఅ వేంపెంట లో తీవ్ర స్థాయిలో జరిగింది.
"https://te.wikipedia.org/wiki/వేంపెంట_ఉద్యమం" నుండి వెలికితీశారు