పండుగ: కూర్పుల మధ్య తేడాలు

చి 2405:204:63A3:861A:BE48:A436:931:904E (చర్చ) చేసిన మార్పులను 2405:204:6624:CE62:0:0:511:38AC చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
సంప్రదాయాలు, ఆచారాలు, శాంతిసహృద్భావాల మేలు కలయికే '''పండుగ''' (Festival). సాధారణముగా పండుగలన్నీ ఏదైనా దేవుడు లేదా దేవతకు సంబంధించి, జాతి మత పరంగా జరుపుకుంటారు. సంవత్సరం పొడవునా వచ్చే పండుగల్లో దేని ప్రాముఖ్యత, విశిష్టత దానికే ఉంది. భాష లేదా ప్రాంతాన్ని బట్టి పండుగలు జరుపుకొనే విధానములో స్వల్ప తేడాలు వున్నప్పటికీ వాటిలోని ఏకసూత్రత మాత్రము చెడదు. సంవత్సరం పొడవునా చైత్ర మాసముతో మొదలిడి ఎన్నో పండుగలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన పండుగలు:హ.పందుగలు ఎప్పుధొ జరిగిన సంగతను తెలుపుతాయి
 
== హిందువుల పండుగలు ==
[[తెలుగు]] సంస్కృతిలోని అందచందాలు ఎక్కువగా కనబడేది పండుగ సమయాలలోనే ఉదాహరణకు, సంక్రాంతినే తీసుకోండి. [[సంక్రాంతి]]లో అచ్చమైన తెలుగుదనం వెలుగుతూ ఉంటుంది. భోగి, మకర సంక్రమణం, కనుమ - ఈ మూడు రోజులూ పండుగే కనుక, దీన్ని పెద్ద పండుగ అంటారు. నిజానికి ధనుర్మాసారంభంతో నెల రోజులు మూమూలుగానే సంక్రాంతి వాతావరణం చలిచలిగా తెలుగునాట ప్రారంభమవుతుంది. ఆ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతూ ఉంటాయో చూసి తీరవలసిందే. బుడబుక్కలవారు, పగటివేషధారులు రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు. కళ్లం నుంచి బళ్ల మీద ధాన్యం బస్తాలు వస్తూ ఉంటాయి. భోగినాడు భోగిమంట విధిగా వేయవలసిందే. ఆ సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగిపళ్లు తప్పవు. ఈ పెద్ద పండుగకు కొత్త అల్లుడు తప్పనిసరిగా అత్తవారింటికి వస్తాడు. మరదళ్ల ఎకసెక్కాలకు ఉడుక్కుంటాడు. ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చే సర్వసామాన్య విషయాలు.
"https://te.wikipedia.org/wiki/పండుగ" నుండి వెలికితీశారు