దుర్గాబాయి దేశ్‌ముఖ్: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
వికీకరణ, మూలాలు చేర్చితిని
పంక్తి 35:
}}
 
'''దుర్గాబాయి దేశ్‌ముఖ్''' ([[జూలై 15]], [[1909]] - [[మే 9]], [[1981]]) భారత స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త . [[చెన్నై]], [[హైదరాబాదు]]<nowiki/>లలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఈవిడే స్థాపించారు. ఆమె భారతదేశం యొక్క రాజ్యాంగ సభ మరియు భారతదేశం యొక్క [[ప్రణాళికా సంఘం]] సభ్యురాలు. ఆమెను [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో సామాజిక సర్వీస్ మదర్ గా పిలిచేవారు. ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కు మొదటి చైర్‌మన్ గా వ్యవహరించింది.<ref>{{cite book|last=Government of India|title=Report of the National Committee on Women's Education|year=1959|publisher=Government of India|location=New Delhi}}</ref>
 
== జీవిత విశేషాలు ==
దుర్గాబాయి దేశ్‌ముఖ్ [[ఆంధ్ర ప్రదేశ్]]లో ఆమె [[రాజమండ్రి]], 1909 జూలై 15 న మద్య తరగతి కుటుంబంలో రామారావు, కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించింది<ref name="auto">{{cite book|last=Deshmukh|first=Durgabai|date=1980|title=Chintaman and I|publisher=Allied|page=1|quote=I was born on 15 July 1909 in Rajahmundry in the coastal district of East Godavari in Andhra|url=https://archive.org/details/in.ernet.dli.2015.172432}}</ref>. 8 ఏండ్ల వయసులో ఆమె మేనమామ సుబ్బారావుతో వివాహమయింది.<ref name=":3">{{Cite book|url=https://books.google.com/books?id=hjilIrVt9hUC|title=Women in Modern India|last=Forbes|first=Geraldine|last2=Forbes|first2=Geraldine Hancock|date=1999|publisher=Cambridge University Press|isbn=9780521653770}}</ref> తరువాత ఆమె ఆ వివాహాన్ని వ్యతిరేకింది. ఆమె నిర్ణయాన్ని తండ్రి, సోదరుడు అంగీకరించారు.<ref name=":32" ఈమె/> బాల్యం నుండి ప్రతిభాపాటవాలను కనబరుస్తూ పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి, హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసులవారికీ విద్యాబోధన అందించింది. [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం|బెనారస్‌ విశ్వవిద్యాలయం]] నుండి మెట్రి క్యులేషన్‌, [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి ఎం.ఏ (పొలిటికల్‌ సైన్స్‌), 1942లో ఎల్‌. ఎల్‌.బి పూర్తిచేసింది. న్యాయశాస్త్రం చదివిన తరువాత మద్రాసులో హైకోర్టు వద్ద సాధన ప్రారంభించింది.
 
== స్వాతంత్ర్య పోరాటం ==
దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకుంది. తన 12 యేండ్ల వయసులో ఆంగ్ల విద్యపై పోరాటం ప్రారంభించింది. ఆమె రాజమండ్రిలో బాలికలకు హిందీలో విద్యను అందించడానికి బాలికా హిందీ పాఠశాలను ప్రారంభించింది. <ref name=":0">{{Cite book|url=https://books.google.com/books?id=EFI7tr9XK6EC&pg=RA1-PA42|title=The Oxford Encyclopedia of Women in World History: 4 Volume Set|last=Smith|first=Bonnie G.|date=2008-01-01|publisher=Oxford University Press, USA|isbn=9780195148909}}</ref> తెలుగుగడ్డ పై [[మహాత్మా గాంధీ]] రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది. మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందించింది<ref name=":2">{{Cite book|url=https://books.google.com/books?id=eTrs9MF9374C&pg=PA133|page=133|title=The Great Indian Patriots|last=Rao|first=P. Rajeswar|date=1991|publisher=Mittal Publications|isbn=9788170992806}}</ref>. 1923లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీరుగా పనిచేస్తూ [[నెహ్రూ]] వద్ద టిక్కెట్ లేని కారణము చేత ఆయనను అనుమతించక, తన కర్తవ్య నిర్వహణకు గాను ఆయన నుండి ప్రశంసలను పొందింది<ref>[http://thehindu.com/thehindu/mp/2002/11/04/stories/2002110401330200.htm Dedicated to cause of women], ''The Hindu''. 4 November 2002</ref><ref name=":1">{{Cite book|url=https://books.google.com/books?id=mhC2IQ53uQ8C&pg=PA127|title=Women's Movement|last=Suguna|first=B.|date=2009|publisher=Discovery Publishing House|isbn=9788183564250|page=127}}</ref>. ఆ పై మహాత్ముని ఆంధ్ర పర్యటనలలో ఆయన [[హిందీ]] ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది. [[ఉప్పు సత్యాగ్రహం|ఉప్పు సత్యాగ్రహము]]<nowiki/>లో పాల్గొని అరెస్టు కాబడింది<ref>{{Cite book|url=https://books.google.com/books?id=-Z8OzIyGt0MC&pg=PA73|page=73|title=History Of India (from National Movement To Present Day)|last=Jayapalan|first=N.|date=2001|publisher=Atlantic Publishers & Dist|isbn=9788171569175}}</ref>. స్వాతంత్ర్య సమరకాలంలో ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసి ఎంఎ, బిఎల్‌, బిఎ ఆనర్స్‌ చేసి న్యాయకోవిదురాలిగా, ప్రఖ్యాత క్రిమినల్‌ లాయర్‌గా పేరుగాంచారు<ref name=":22" /><ref name=":02" />.
 
== సామాజిక సేవలు ==
దుర్గాబాయి అనేక మహిళా సంస్థలు, సాంఘిక సంక్షేమ సంస్థలను ప్రారంభించి స్త్రీల అభ్యున్నతికి కృషిచేశారు. ఈమె ఆధ్వర్యంలో 1937లో చెన్నైలో [[ఆంధ్ర మహిళా సభ]] స్థాపించబడింది<ref>[http://www.andhramahilasabha.org] {{webarchive|url=https://web.archive.org/web/20070717055254/http://www.andhramahilasabha.org/|date=17 July 2007}}</ref>.1937లో ''లిటిల్ లేడీస్ ఆఫ్ బ్రుందావన్ ''అనే బాల సంఘాన్ని ప్రారంభించింది.ఈమె 1941లో ''ఆంధ్ర మహిళ'' పత్రికను స్థాపించి, సంపాదకత్వ బాధ్యతలను నెరవేర్చింది. 1958లో హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతిగృహ ఏర్పాటుకై పాటుపడటమేగాక రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలు, వసతిగృహాలు, నర్సింగ్ హోమ్‌లు మరియు వృత్తి విద్యాకేంద్రాలు నెలకొల్పారు. చెన్నైలో 70మంది కార్యకర్తలతో ''ఉదయవనం''అను పేరుతో సత్యాగ్రహ శిభిరం ఏర్పరిచారు.1953లో ఆర్థికమంత్రి చింతామణి దేశ్ ముఖ్ తో వివాహం జరిగింది.1971లో సాక్షారతా భవన్ ని ప్రారంభించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాబాయికి 1971లో గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది.
 
== స్వాతంత్ర్యం తర్వాత ==
భారత రాజ్యాంగ నిర్మాణ సభలో 1946 నుండి 1950 వరకు సభ్యురాలిగా పనిచేసిన పిమ్మట, 1952లో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా పనిచేసింది<ref name=":03" />. ఆ సందర్భములో [[సి.డి.దేశ్‌ముఖ్]]తో కలిగిన పరిచయం పరిణయానికి దారి తీసింది. వీరి వివాహము 1953 జనవరి 22న జరిగింది<ref name="auto2" />. ఈవిడ 1953 ఆగస్టులో భారత ప్రభుత్వంచే నెలెకొల్పబడిన కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పనిచేసింది. ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా పనిచేసింది.
 
== అవార్డులు ==
పంక్తి 68:
== బాహ్య లంకెలు ==
 
* http://www.blindreliefdelhi.org/AboutUs.html
* http://wcd.nic.in/ar0304/chapter7.pdf
* http://epaper.sakshi.com/Details.aspx?id=213926&boxid=29637870
 
* [https://web.archive.org/web/20110812174634/http://blogs.thehindu.com/delhi/?p=25977 Durgabai Deshmukh: A pioneer and a transformative leader], Prema Kasturi and Prema Srinivasan, [[The Hindu]].{{Commons category|Durgabai Deshmukh}}
{{Authority control}}