కిష్కింధకాండ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి లింకులు
పంక్తి 1:
'''కిష్కింధ కాండ''' లేదా '''కిష్కింధాకాండము''' (''Kishkindha Kanda'') [[రామాయణం]] కావ్యంలో నాల్గవ విభాగము.
 
[[భారత దేశం|భారతీయ]] వాఙ్మయములో '''రామాయణము''' ఆదికావ్యముగాను, దానిని [[సంస్కృత భాష|సంస్కృతములో]] రచించిన [[వాల్మీకి]]మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. చాలా భారతీయ భాషలలోను, ప్రాంతాలలోను ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. భారతీయుల సంస్కృతి, సాహిత్యము, ఆలోచనా సరళి, సంప్రదాయాలలో రామాయణం ఎంతో ప్రభావం కలిగి ఉంది. రామాయణంలోని విభాగాలను ‘’కాండములు’’''కాండములు'' అంటారు. ఒకో కాండము మరల కొన్ని ‘’సర్గ’’లుగా''సర్గ''లుగా విభజింపబడింది.
 
వీటిలో ‘’’కిష్కింధ '''కిష్కింధ కాండ''' [[నాలుగు|నాల్గవ]] కాండము. ఇందులో 67 సర్గలు ఉన్నాయి. అరణ్య కాండలో సీతాపహరణం జరిగిన తరువాతి కధ కిష్కింధ కాండలో వస్తుంది. ఇందులోని ప్రధాన కధాంశాలు: [[రాముడు|రాముని]] దుఃఖము, [[హనుమంతుడు]] రామనకు [[సుగ్రీవుడు|సుగ్రీవునకు]] స్నేహము గూర్చుట, [[వాలి]] వధ, [[సీత|సీతాన్వేషణ]].
 
==సంక్షిప్త కధ==
పంక్తి 9:
 
===హనుమంతుడు రామ లక్ష్మణులను కలసికొనుట===
రామ లక్ష్మణులు [[శబరి]] ఆతిధ్యాన్ని స్వీకరించిన తరువాత పంపాసరోవరం అందాలను చూస్తూ ముందుకు సాగారు. విలపిస్తున్న రామునికి లక్ష్మణుడు ధైర్యం చెప్పాడు. క్రమంగా వారు ఋష్యమూక పర్వతాన్ని సమీపించారు.
 
 
పంక్తి 15:
 
 
హనుమంతుడు బ్రహ్మచారి రూపంతో వారిని సమీపించి – ‘ఓ''ఓ పుణ్యపురుషులారా! తమరు వేషధారణను బట్టి తాపసులవలెనున్నారు. ధరించిన ఆయుధాలను బట్టి సర్వ శత్రు సంహారణాదక్షుల వలె ఉన్నారు. నర నారాయణుల వలెను, సూర్యచంద్రులవలెను, అశ్వినీ దేవతలవలెను కనుపిస్తున్నారు. నేను సుగ్రీవుడనే వానరుని మంత్రిని. అతడు తన అన్న ఆగ్రహానికి గురై దీనుడైయున్నాడు. మీ స్నేహాన్ని కోరుతున్నాడు. నేను కామరూపుడను గనుక వటువు వేషంలో మిమ్ములను కలవ వచ్చాను. తమ పరిచయ భాగ్యాన్ని ప్రసాదించండి’ప్రసాదించండి'' అని మృదువైన మాటలతో అన్నాడు.
 
 
హనుమంతుని మాటలకు, వినయానికి రాముడు ముగ్ధుడయ్యాడు. తన తమ్మునితో ఇలా అన్నాడు – ‘’ఈతని''ఈతని మాటలలో ఎక్కడా అనవుసర శబ్దం గాని, అపశబ్దం గాని లేవు. వేదాలను, వ్యాకరణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడే ఇలా మాట్లాడగలడు. ఇటువంటి వానిని మంత్రిగా కలిగిన రాజు ఏమయినా సాధించగలడు.''
 
రాముని ఆనతిపై లక్ష్మణుడు తమ రాకకు కారణాన్ని హనుమంతునికి వివరించాడు. కార్యార్ధులమై సుగ్రీవునితో స్నేహం కోరుతున్నామని చెప్పాడు. హనుమంతుడు తన నిజరూపం ధరించి రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవునివద్దకు తీసికొనివెళ్ళాడు.
పంక్తి 37:
 
 
అసలు కారణం వివరించి రాముడు సుగ్రీవునకు ధైర్యం చెప్పాడు. ఆనవాలుగా ఒక గజపుష్పి లతను సుగ్రీవుని మెడలో అలంకరించాడు. మళ్ళీ సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్ధానికి కవ్వించాడు. కోపంతో బయలు దేరిన వాలిని అతని భార్య [[తార]] వారింప ప్రయత్నించింది. అంతకు ముందే దెబ్బలు తిన్న సుగ్రీవుడు మళ్ళీ యుద్ధానికి రావడానికి అయోధ్యా రాకుమారుల అండయే కారణం కావచ్చు అని హితం పలికింది. కాని వాలి వినలేదు. తనకు ఇక్ష్వాకు రాకుమారులతో వైరం లేదు గనుక ఆ ధర్మపరులు తనకు హాని చేయరన్నాడు. కోపంతో బుసలు కొడుతూ యుద్ధానికి బయలుదేరాడు.
 
 
అన్నదమ్ములు మళ్ళీ భీకరంగా పోరాడసాగారు. వాలికి ఇంద్రుడిచ్చిన[[ఇంద్రుడు]] ఇచ్చిన కాంచనమాలా వర ప్రభావం వలన ఎదురుగా పోరాడే వారి శక్తిలో సగం వాలికి సంక్రమిస్తుంది. కనుక క్రమంగా సుగ్రీవుని బలం క్షీణించసాగింది. ఆ సమయంలోనే రామచంద్రుడు కోదండాన్ని ఎక్కుపెట్టి వజ్రసమానమైన బాణాన్ని వాలి గుండెలపై కొట్టాడు. వాలి హాహాకారాలు చేస్తూ మూర్ఛపోయాడు.
 
===వాలి మరణం===
కొంత సేపటికి వాలికి తెలివి వచ్చింది. అతని గుండెలనుండి రక్తం ధారలుగా పారుతోంది. ప్రాణాలు కడగడుతున్నాయి. ఎదురుగా రాముడు, అతనికి ఇరుప్రక్కలా లక్ష్మణుడూ, సుగ్రీవుడూ కనుపించారు. నీరసంగా రాముని చూచి వాలి ఇలా నిందించాడు.--
====రాముని వాలి నిందించుట====
''రామా! నీవు మహా తేజోవంతుడవు. కాని నీవు చేసిన ఈ నీచమైన పని వలన నీ వంశానికీ, తండ్రికీ అపకీర్తి తెచ్చావు. నేను నీకుగాని, వీ దేశానికి గాని ఏ విధమైన కీడూ చేయలేదు. అయినా న్ను వధిస్తున్నావు. నీవు సౌమ్య మూర్తిగా నటిస్తున్న మాయమయుడివి. ఇంద్రియ లోభాలకు వశుడవయ్యావు. అన్ని దోషాలు నీలో కనబడుతున్నాయి. నీవు క్షుద్రుడవు, మహాపాపివి.
 
 
పంక్తి 53:
నా యెదుటపడి యుద్ధం చేసే లావు నీకు లేదు. మద్యపాన మత్తుడై నిద్రపోయేవాడిని పాము కాటు వేసినట్లుగా చెట్టుమాటునుండి నాపై బాణం వేశావు. ఇందుకు నీకు సిగ్గు కలగడంలేదా! నా సహాయమే కోరి వుంటే క్షణాలమీద రావణుడిని నీ కాళ్ళవద్ద పడవేసి నీ భార్యను నీకు అప్పగించేవాడిని.
 
నేను చావుకు భయపడేవాడిని కాను. సుగ్రీవుడు నా అనంతరం రాజ్యార్హుడే. కాని ఇలా కుట్రతో నన్ను చంపి నా తమ్ముడికి రాజ్యం కట్టబెట్టడం నీకు తగినపని కాదు. నీ చేతలను ఎలా సమర్ధించుకొంటావు? నా గొంతు ఎండుకు పోతోంది. ఈ బాణం నా ప్రాణాలు హరిస్తున్నది. నిస్సత్తువలో ఎక్కువ మాట్లాడలేను. కాని నీ సమాధానాన్ని వినగలను.'' – అని వాలి అన్నాడు.
 
 
====రాముని సమాధానం====
వాలి పలుకులను ఆలకించి రాముడు శాంతంగా ఇలా అన్నాడు – ''ఇంద్ర నందనా! నీ సందేహాలు తీర్చడం నా కర్తవ్యం. అందువలన నీ అంత్యకాలం ప్రశాంతంగా ముగియవచ్చును.
 
నేను వేట మిష మీద నిన్ను చంపలేదు కనుక భష్యాభక్ష్య విచికిత్స అనవుసరం. ధర్మ రక్షణార్ధమే నిన్ను చంపాను. ప్రభువైన భరతుని ప్రతినిధులం గనుక మా రాజ్యంలో ధర్మహీనులను దండించే బాధ్యతా, హక్కూ మాకున్నాయి. నీ తమ్ముడు జీవించి ఉండగానే అతని భార్యను నీవు వశం చేసుకొన్నావు. నీ ప్రవర్తనలో దుష్టత్వం ఉన్నది. అందుకు మరణ దండనయే సరైన శిక్ష. కనుకనే మన మధ్య ప్రత్యక్ష వైరం లేకున్నా నిన్ను శిక్షించాను. ధర్మానికి శత్రు మిత్ర తత్వాలుండవని కిష్కింధకు రాజైన నీకు తెలుసు.
పంక్తి 65:
 
 
నీ వధకు మరొక అలౌకిక పరమార్ధ కారణం ఉంది. నీవు ఇంద్రుని పుత్రుడవు. సృష్టి కర్త ఆజ్ఞ మేరకు రావణ వధలో వానరులు నాకు సహకరించాలి. కాని నీవు రావణుడి మిత్రుడవయ్యావు. కనుక నీవు నాకు సహాయ పడితే మిత్ర ద్రోహివవుతావు. రావణుడి పక్షాన ఉంటే పితృద్రోహివవుతావు. అటువంటి మహాపాతకాలు నీకు అంటకుండా నిన్ను రక్షించాను. ఇకనైనా నా చేతలో ధర్మాన్ని తెలిసికొని చిత్త క్షోభను వర్జించి శాంతిని పొందు.''
 
====వాలి చివరి కోరికలు====
వాలి ఇలా చెప్పాడు –అన్నాడు– ''రామా! సర్వజ్ఞుడవైన నీకు బదులు చెప్పగలిగేవాడను కాను. నీ చేతిలో మరణించడం నా పూర్వ జన్మ సుకృతం. గారాబంగా పెరిగిన నా కొడుకు అంగదుని కూడా సుగ్రీవునిలాగానే నీవు రక్షించు. నామీద వున్న ద్వేషంతో సుగ్రీవుడు తారను హింసించకుండా చూడు. నా ప్రేలాపననూ, అపరాధాలనూ మన్నించు''.
 
 
పంక్తి 86:
 
 
రాముడు సీతా వియోగంతో కుములుతున్నాడు. తాను చేసిన మేలు మరచి అలసత్వం వహించిన సుగ్రీవుని వర్తన రామునికి మరీ బాధ కలిగించింది. అది చూసి [[లక్ష్మణుడు|లక్ష్మణునికి]] ఆగ్రహం పెల్లుబుకింది. అగ్ని హోత్రునిలా మండిపడుతూ కిష్కింధకు వెళ్ళాడు. కాలసర్ప సదృశమైన [[ధనుస్సు]] ధరించి క్రోధారుణ నేత్రుడై వచ్చిన లక్ష్మణుని చూచి వానరులు భయంతో వణికిపోయారు. అంగదుడు, మంత్రులు లక్ష్మణుని రాకను సుగ్రీవునికి తెలియజేశారు. వినయంతో మెలిగి ఆ రామానుజుని ప్రసన్నం చేసుకోమని [[హనుమంతుడు]] హితవు చెప్పాడు.
 
 
పంక్తి 92:
 
===సీతాన్వేషణ ఆరంభం===
సుగ్రీవుని ఆజ్ఞపై వినతుడనే వానర వీరుడు వేల కొలది సేనతో [[తూర్పు]] దిక్కున సీతా మాత అన్వేషణకు వెళ్ళాడు. [[పడమర|పడమటి]] దిక్కుకు సుషేణుడు, [[ఉత్తరం|ఉత్తర]] దిశకు శతబలుడు పెద్ద పెద్ద సేనలతో బయలుదేరి వెళ్ళారు. అంగదుడు [[దక్షిణం|దక్షిణ]] దిశాన్వేషణా బృందానికి నాయకుడు. అన్ని దిశలలో వెళ్ళేవారికీ వారు వెతక వలసిన స్థలాలను, తీసికొనవలసిన జాగ్రత్తలను సుగ్రీవుడు వివరించి చెప్పాడు. ఒక మాసం లోపు అన్వేషణ పూర్తి కావాలనీ, సీతమ్మ జాడ తెలిపినవారికి తనతో సమానంగా రాజ్య భోగాలు కల్పిస్తాననీ మాట ఇచ్చాడు. దక్షిణం వైపుకు నిర్దేశించిన బృందంలో అంగదుడు, జాంబవంతుడు, నీలుడు, హనుమంతుడు వంటి మహావీరులున్నారు. దక్షిణ దిశవైపు సీతను తీసికొని పోయిన రాక్షసుడు లంకాధిపతి రావణుడే కావచ్చునని సుగ్రీవుని అభిప్రాయం. అది గ్రహించిన రాముడు తన అంగుళీయాన్ని సీతకు ఆనవాలుగా ఇమ్మని హనుమంతునికిచ్చాడు.
 
 
పంక్తి 102:
 
 
అంతు లేని సాగరాన్ని చూసేసరికి వారి ఆశ అడుగంటింది. సుగ్రీవుడిచ్చిన గడువు అప్పటికే ముగిసిపోయింది. సీతమ్మ జాడ కానరాలేదు. వట్టిచేతులతో కిష్కింధకు పోలేరు. ఇక మరణమే తమకు శరణమని అంగదుడూ అతని అనుచరులూ ప్రాయోపవేశానికి సిద్ధమయ్యారు. వారిలో వారు జరిగిన విషయాలు నెమరు వేసుకొంటుండగా అక్కడికి [[సంపాతి]] అనే మహాకాయుడైన గ్రద్ద వచ్చాడు. వారి ప్రసంగాన్ని పట్టి తన తమ్ముడైన [[జటాయువు]] మరణించాడని తెలిసికొని దుఃఖించాడు. రావణుడనే రాక్షసుడు సీతను ఎత్తుకొని పోయి సముద్రంలో నూరు యోజనాల అవతల లంకానగరంలో దాచాడని వారికి చెప్పాడు.
 
===హనుమంతుని సంకల్పం===
 
సీత జాడ తెలిసి సంతోషించిన వానరుల ఉత్సాహం అపార సాగరాన్ని చూడగానే నీరుగారిపోయింది. గజుడు పది ఆమడలు గెంతగలనన్నాడు. గవాక్షుడు ఇరవై ఆమడలూ, గంధమాదనుడు ఏభై ఆమడలూ, మైందుడు అరవై ఆమడలూ, ద్వివిదుడు డెబ్భై ఆమడలూ, సుషేణుడు ఎనభై ఆమడలూ లంఘించగలమన్నారు. వృద్ధుడైన [[జాంబవంతుడు]] తొంభై యోజనాలు మాత్రం ఎగురగలనన్నాడు. [[అంగదుడు]] నూరు యోజనాలు లంఘించగలను గాని తిరిగిరావడం కష్టమైతే పని చెడుతుందని అన్నాడు.
 
 
అంగదుని వారించి జాంబవంతుడు హనుమంతునితో ఇలాగన్నాడు – నాయనా! ఈ కష్టాన్ని తరింపజేయడానికి నిన్ను మించిన సమర్ధుడు లేడు. [[గరుత్మంతుడు|గరుత్మంతునితో]] సమానమైన వేగ విక్రమాలు కలవాడవు. నీకు సమానమైన బలం, తేజం, బుద్ధి కుశలత, పరాక్రమం మరెవరికీ లేవు. నీ శక్తి నీకు తెలియదు. నీవు బహువర సంపన్నుడవు. వాయుపుత్రుడవు. ఈ సముద్రం దాటడం నీకు కష్టం కాదు. త్రివిక్రముడివై విజృంభించు, లేవయ్యా ఆంజనేయా! - అని ఉత్సాహపరచాడు.
 
 
పంక్తి 129:
:: నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే
:: నూపురేత్వభిజానామి నిత్యం పాదాభివందనాత్
''కేయూరాలు, కుండలాలను నేను గుర్తించలేను. కాని నిత్యం వదినకు పాదాభివందనం చేయడం వలన ఈ నూపురాలు ఆమెవని చెప్పగలను.''
 
 
"https://te.wikipedia.org/wiki/కిష్కింధకాండ" నుండి వెలికితీశారు