భారత జాతీయపతాకం: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
విస్తరణ
పంక్తి 5:
చట్టప్రకారం జెండా ఖద్దరుతో తయారుచేయాలి. జాతీయోద్యమానికి, స్వరాజ్య పోరాటానికి సంకేతంగా [[మహాత్మా గాంధీ]] ఖద్దరును ఉపయోగించడం దీనికి కారణం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ పతాకాన్ని తయారుచేయాల్సిన పద్ధతిని, ప్రత్యేక లక్షణాలను నిర్దేశించింది. పతాకాన్ని తయారుచేయడానికి ఖాదీ అభివృద్ధి, గ్రామీణ పరిశ్రమల కమీషన్‌కే హక్కు ఉంది. ఈ కమీషన్‌ ఇతర స్థానిక గ్రూపులకు తయారీ అప్పగించిస్తుంది. 2009 నాటికి పతాకం ఏకైక తయారీదారుగా కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘం ఉంది.
 
భారత జెండా కోడ్‌, జాతీయ చిహ్నాలకు సంబంధించిన ఇతర చట్టాలు జెండా వాడుకకు వర్తిస్తాయి. మొదట్లో ఈ కోడ్ [[భారత స్వాతంత్ర్య దినోత్సవం]], [[గణతంత్ర దినోత్సవం]] వంటి జాతీయ దినోత్సవాల సందర్భంగా తప్ప మిగతా రోజుల్లో సాధారణ పౌరులు జెండాను వాడడం నిషేధించింది. 2002లో [[నవీన్ జిందాల్]] అభ్యర్థన పరిశీలిస్తూ [[భారతదేశ అత్యున్నత న్యాయస్థానం]] సాధారణ పౌరులు జెండాను వాడుకునేందుకు వీలుగా కోడ్‌ను సవరించమని [[భారత ప్రభుత్వము|భారత ప్రభుత్వానికి]] ఆదేశాలు జారీచేసింది. దాన్ని అనుసరించి భారతీయ కేంద్ర మంత్రివర్గం కోడ్‌ను పరిమితంగా వాడేందుకు సాధారణ పౌరులకు వీలునిస్తూ సవరించింది.
 
== ప్రతీక ==
"https://te.wikipedia.org/wiki/భారత_జాతీయపతాకం" నుండి వెలికితీశారు