నది: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి 2409:4070:80B:C529:0:0:114F:B0A4 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు. ట్యాగు: రోల్‌బ్యాక్ |
Risto hot sir (చర్చ | రచనలు) File |
||
పంక్తి 1:
[[File:Claude Monet - Branch of the Seine near Giverny.JPG|thumb|]]
వర్షపు నీటి వలన కాని, ఎత్తయిన పర్వతాలలో మంచు కరిగిన నీటి వలన కాని చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ అవి ఒకదానికొకటి ఏకమై పెద్ద ప్రవాహంగా మారడమే నదిగా పరిగణించబడుతుంది. సాధారణంగా పెద్ద నదులు పర్వత ప్రాంతాలలో పుట్టి వేల కిలోమీటర్లు ప్రవహించి చివరికి సముద్రాలలో అంతమౌతాయి. కొన్ని నదులు భూమిలోనే ఇంకిపోతాయి. [[పశ్చిమ అమెరికా]] లోని ఎడారులలోను, [[సౌదీ అరేబియా]] లోని ఎడారులలోను ఇలా భూమి లోకి ఇంకిపొయే నదులు ఉన్నాయి. ఇవి వర్షాలు పడ్డప్పుడు మాత్రం పొంగి పొర్లుతాయి. వర్షం ఆగిపోగానే మిగిలిన నీరు నేలలోకి ఇంకిపోయి ఎండి పోతాయి. మన వైపు దొంగేర్లు ఇలాంటివే. ఇలా ఇంకిపోని నదులనే మనం [[జీవనదులు]] అంటాం. నేల లోకి ఇంకి పోగా మిగిలిన నీరే జీవనదులలో ప్రవహించేది. ఎంత నీరు ఇంకుతుందీ అనేది నదీ గర్భం అడుగున ఉన్న రాతి పొరల లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. అడుగున సున్నపు రాయి (లైమ్ స్టోన్) ఉంటే ఎక్కువ నీరు ఇంకే సావకాశం ఉంది. అడుగున నల్లసేనపు రాయి (గ్రేనైట్) ఉంటే నీరు అంతగా ఇంకదు.
|