ఆడవారి మాటలకు అర్థాలే వేరులే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
మధ్య తరగతి యువకుడు గణేష్‌ (వెంకటేష్‌) జీవితానికి సంబంధించిన కథ ఇది. ఉద్యోగం లేకుండా నిరుద్యోగిగా తిరుగుతూ అందరికీ చులకనవుతూ తండ్రి (కోట శ్రీనివాసరావు) తో కూడా తిట్లు తింటూ ఉండే గణేష్ అనే యువకుడు కీర్తి (త్రిషా) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె సాప్టువేర్ కంపెనీలో పని చేస్తుందని తెలుసుకొని ఆ కంపెనేలో ఉద్యోగానికి ప్రయత్నిస్తాడు. అక్కడ ఆమెకు తన ప్రేమను తెలియచేయగా ఆమె తన పెళ్ళి మరొక నెలరోజుల్లో వేరే వాళ్ళతో అని చెప్తుంది. గణేష్ బాధ పడటం చూసి అతని తండ్రి వెళ్ళి కీర్తిని అడుగుతాడు తన కొడుకుని పెళ్ళి చేసుకోమని. ఆ సందర్భంలో అయనపై అనుకోకుండా చేయి చేసుకుంటుంది కీర్తి. ఆ బాధలో అదే రాత్రి గుండె పోటుతో ఆయన మరణిస్తాడు. ఇంట్లో బాధపడుతున్న గణేషును తనతో తన ఊరు రమ్మని తీసుకెళతాడు గణేష్ స్నేహితుడు శ్రీరాం. అక్కడ అతనికి తెలుస్తుంది కీర్తి పెళ్ళి చేసుకోబోయేది శ్రీరాంనేనని. తరువాత జరిగే కొన్ని సన్నివేశాలతో కీర్తి గణేష్ను ప్రేమించుట మొదలెడుతుంది. అటుపై ఇంట్లో అందరికీ తెలియడంతో గణేష్ను అపార్ధం చేసుకొని ఇంట్లో నుండి వెళ్ళగొడతారు. ఆ కుటుంబానికి సంభందించిన ఒక విషయంలో గణేషును వేరే వాళ్ళు పొడిచేయడంతో అతడిని హాస్పిటల్లో చేరుస్తారు. విషయం తెలిసిన కీర్తి కుటుంబం మొత్తం ఒకరొకరుగా అతడిని చూసేందుకు వస్తారు. కొద్ది రోజుల తరువాత కీర్తిని అతడికే ఇచ్చి పెళ్ళి చేసేయడంతో కథ సుఖాంతం అవుతుంది.
==చిత్ర విశేషాలు==
[[యువన్ శంకర్ రాజా]] సంగీతం ఆడియోపరంగా మంచి విజయం సాదించింది.. చిత్రంలో చిత్రణ బాగుంది. భారీ బంధుగణం, పెద్ద లోగిళ్ళు, పల్లె అందాలు లాంటి వాటిని బాగా చూపించారు.
==నటీనటులు==
ఈ సినిమాలో [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] నటనకు గాను [[నంది అవార్డ్]] వరించింది. చిన్నపాత్ర అయినప్పటికీ కథా మూలమైన పాత్రలో [[కోట శ్రీనివాసరావు]] మంచి నటన కనబరచారు.