స్టీవ్ జాబ్స్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
జాబ్స్ గారిని డిజిటల్ విప్లవానికి పితామహుడు అని అంటారు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 31:
}}
స్టీవెన్ పాల్ "స్టీవ్" జాబ్స్ (1955 ఫిబ్రవరి 24 - 2011 అక్టోబరు 5) అమెరికన్ ఐటీ వ్యాపారవేత్త, ఆవిష్కర్త. ఆయన యాపిల్ ఇన్‌కార్పొరేషన్‌కు సహ-వ్యవస్థాపకుడు, ఛైర్మన్, సీఈవో; పిక్సర్ యానిమేషన్ స్టూడియోస్ సీఈవో, ప్రధాన వాటాదారు;<ref name="jobspix"><cite class="citation web">D'Onfro, Jillian (March 22, 2015). </cite></ref> వాల్ట్ డిస్నీ కంపెనీ పిక్సర్ కంపెనీను కొన్నాకా దాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుడు; నెక్స్‌ట్ సంస్థ సంస్థాపకుడు, ఛైర్మన్, సీఈవో. 1970లు, 80ల నాటి మైక్రోకంప్యూటర్ విప్లవంలో మార్గదర్శిగా యాపిల్ సహ-వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ తో పాటుగా నిలిచారు.  ఆయన మరణానంతరం కొద్ది రోజులకు వెలువడ్డ సాధికారిక జీవిత చరిత్రలో వాల్టర్ ఇసాక్సన్ జాబ్స్ ను "విపరీతమైన చోదక శక్తి, పరిపూర్ణత పట్ల తీవ్రమైన కోరికలతో పర్సనల్ కంప్యూటర్స్, యానిమేషన్ సినిమాలు, సంగీతం, ఫోన్లు, టాబ్లెట్ కంప్యూటింగ్, డిజిటల్ ప్రచురణలు అన్న ఆరు పరిశ్రమల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన సృజనాత్మక వ్యాపారవేత్త"గా అభివర్ణించారు.<ref name="JobsBio1"><cite class="citation book">Isaacson, Walter (2011). </cite></ref>
 
జాబ్స గారీనీ డిజిటల్ విప్లవ పితామహుడు అని అంటారు
 
జాబ్స్ లోని విరుద్ధ సంస్కృతీ జీవన విధానం, తాత్త్వికతకు ప్రధాన కారణం అతను పెరిగిన స్థలకాలాలు. [[శాన్ ఫ్రాన్సిస్కో]]<nowiki/>లో జన్మించిన జాబ్స్ దత్తత అయి, 1960ల్లో విరుద్ధ సంస్కృతికి కేంద్రంగా నిలిచిన శాన్ ఫ్రాన్సిస్కోలో పెరిగారు.<ref><cite class="citation web">Foremski, Tom. </cite></ref> కాలిఫోర్నియాలోని క్యూపెర్టినో ప్రాంతపు హోంస్టెడ్ హైస్కూల్లో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థి, హోంస్టెడ్ హైస్కూలు పూర్వ విద్యార్థి వోజ్నియాక్, అతని గర్ల్ ఫ్రెండ్, విరుద్ధ సంస్కృతికి ఆకర్షితురాలైన, కళారంగం పట్ల మక్కువ కల హోంస్టెడ్ విద్యార్థిని క్రిసాన్ బ్రెనాన్ ఆయనకు చాలా సన్నిహిత మిత్రబృందంగా ఉండేవారు.<ref name="The Steve Jobs Nobody Knew"><cite class="citation web">[http://www.rollingstone.com/culture/news/the-steve-jobs-nobody-knew-20111027 "The Steve Jobs Nobody Knew"]. </cite></ref> జాబ్స్, వోజ్నియాక్ ఇద్దరూ పాప్ సంగీత దిగ్గజం [[బాబ్ డైలాన్]] పాటలకు అభిమానులు, ఈ బంధంతో వారు ఆయన సాహిత్యం గురించి చర్చించుకోవడం, డైలాన్ సంగీత ప్రదర్శనల బూట్ లెగ్ రీల్-టు-రీల్ టేపులు సేకరించడం వంటి ఆసక్తులు పంచుకునేవారు.<ref name="rollingstone.com"><cite class="citation web">[http://www.rollingstone.com/music/news/new-steve-jobs-bio-reveals-details-of-his-relationships-with-bob-dylan-bono-20111024 "New Steve Jobs Bio Reveals Details of His Relationships With Bob Dylan, Bono"]. </cite></ref> మునుపు డైలాన్ తో వైవాహిక సంబంధంలో ఉండి ప్రఖ్యాతురాలైన సంగీతకారిణి జోన్ బేజ్ తో తర్వాతికాలంలో జాబ్స్ డేటింగ్ చేశారు.<ref name="rollingstone.com"/> జాబ్స్ కొద్దికాలం పాటు 1972లో రీడ్స్ కళాశాలలో చేరి చదివి, కాలేజీ వదిలేశారు.<ref name="The Steve Jobs Nobody Knew"/> 1974లో జ్ఞానోదయాన్ని ఆశించి, జెన్ బౌద్ధాన్ని అధ్యయనం చేసేందుకు భారతదేశానికి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు.<ref><cite class="citation web">[http://www.businessinsider.com/steve-jobs-zen-meditation-buddhism-2015-1 "Here's How Zen Meditation Changed Steve Jobs' Life And Sparked A Design Revolution"]. </cite></ref> జాబ్స్ గురించి ఎఫ్.బి.ఐ. రిపోర్టులో ఒక పరిచయస్తుడు చెప్పినదాని ప్రకారం కళాశాలలో ఉన్నప్పుడు చట్టవిరుద్ధమైన డ్రగ్స్ అయిన మారిజునా, ఎల్.ఎస్.డి. వంటివి వినియోగించేవారని నివేదించింది.<ref><cite class="citation news">Tsukayama, Hayley (2012-02-09). </cite></ref> మరో సందర్భంలో ఒక విలేకరితో జాబ్స్ ఎల్.ఎస్.డి. తీసుకోవడం తన జీవితంలో చేసిన మూడు అత్యంత ప్రాధాన్యత కలిగిన పనుల్లో ఒకటి అని చెప్పారు.<ref><cite class="citation news">Palmer, Brian (2011-10-06). </cite></ref>
"https://te.wikipedia.org/wiki/స్టీవ్_జాబ్స్" నుండి వెలికితీశారు