సత్తెకాలపు సత్తెయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:చలం నటించిన చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
starring =[[చలం]], <br>[[రాజశ్రీ (నటి) | రాజశ్రీ]], <br>[[విజయలలిత]], <br>[[గుమ్మడి]], <br>బేబీ [[రోజారమణి]] |
}}
==కథ==
 
అయినవాళ్లు ఎవ్వరూలేని అమాయకపు ఒంటరి వ్యక్తి సత్తెయ్య. క్యారేజీలు అందిస్తూ జీవనం సాగిస్తుంటాడు. అతనిలాగే క్యారేజీలు అందించే మరో యువతి సుబ్బులు (విజయలలిత). ఆ ఊరిలోని కోటీశ్వరుడు, వ్యాపారవేత్త, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మడి. అతని భార్య స్నేహలతాదేవి (ఎస్ వరలక్ష్మి). వారి ఏకైక సంతానం శాంతి (రోజారమణి). ఆ ఊరి పోలీస్ ఆఫీసర్ ప్రసాద్ (శోభన్‌బాబు), అతని తల్లి శాంతమ్మ (హేమలత). క్యారేజీలు మోసుకునే సత్తెయ్యను శాంతమ్మ కన్నకొడుకులా ఆదరిస్తుంటుంది. అదే వూరిలో మంచితనం, అందం కలబోసిన కాలేజీ విద్యార్థిని రాధ (రాజశ్రీ). కాలేజీ ఫీజు కట్టమని రాధ ఇచ్చిన డబ్బులు సత్తెయ్య అమాయకంగా పోగొడతాడు. ఆ సంఘటన ద్వారా రాధకు, ప్రసాద్‌కు పరిచయం కలిగి ప్రేమగా మారుతుంది. తమ తమ కార్యక్రమాలలో బిజీగా వున్న తల్లిదండ్రులతో సమయం గడిపే అవకాశం లేక, ఇంట్లో నౌకర్లు, అమ్మమ్మ (ఋషేంద్రమణి)తో ఉండే శాంతి ఒంటరిగా బాధపడుతుంటుంది. మీటింగ్‌లోవున్న తల్లిని కలుసుకోవాలని వెళ్ని శాంతి జనంలో తప్పిపోయి సత్తెయ్య గుడిసెకు చేరుకుంటుంది. అతని అమాయకత్వం చూసి అతనిపై అభిమానం పెంచుకుంటుంది. తన తల్లితండ్రులను కలిశాక కూడా సత్తెయ్య, శాంతిని ఆమె స్కూలువద్ద కలుసుకోవటం, వారి వాత్సల్యం అభివృద్ధి చెందటం జరుగుతుంది. ప్రసాద్‌కు పెళ్లి కుదిరిన సందర్భంగా శాంతమ్మ ఇచ్చిన మిఠాయిలో ఎవరో దొంగ విషం కలపటం, అది తెలియక శాంతికి సత్తెయ్య ఇవ్వటంతో.. శాంతి ఆరోగ్యం విషమిస్తుంది. దీంతో శాంతిని కలుసుకోవద్దని ఆమె తల్లితండ్రులు శాసిస్తారు. శాంతి కోరినట్టు పోలీసు అయి శాంతిని కలుసుకోవాలని సత్తెయ్య ప్రయత్నాలు చేయటం, ఒక దొంగల ముఠాను పట్టిచ్చినందుకు అతనికి పోలీసుగా ప్రభుత్వం ఉత్తర్వు ఇవ్వటం, అ డ్రెస్‌తో శాంతిని చూడటానికి వెళ్లిన సత్తెయ్య పిలుపు, పాటవిని శాంత కోలుకోవటం, సుబ్బులుతో సత్తెయ్యకు వివాహం జరగటంతో చిత్రం ముగుస్తుంది.
==పాటలు==
# అలాగా చూడు ఇలాగ చూడు బలే మంచి శాంతమ్మ - పిఠాపురం