"ఫ్రాన్సు" కూర్పుల మధ్య తేడాలు

== రవాణా వ్యవస్థ ==
[[దస్త్రం:TGV at Avignon.jpg|thumb|left|ఒక [[టి.జి.వి.]] సుడ్-ఎస్ట్ (TGV Sud-Est, అక్షరాలా "టి.జి.వి. ఆగ్నేయం" లేదా "టి.జి.వి. దక్షిణ-తూర్పు").]]
విస్తారమైన ఫ్రాన్స్ రైల్వే వ్యవస్థ 31,840 కిలోమీటర్లు (19,784 మై) పొడవుతో పశ్చిమ యూరప్‌లో అధిక విస్తృతమైందిగా ఉంది. ఇది [[ఎస్.ఎన్.సి.ఎఫ్.]] చే నిర్వహించబడుతుంది. అధిక వేగపు రైళ్ళలో థాలిస్, యూరోస్టార్, టి.జి.వి. ఉన్నాయి. ఇవి 320 కి.మీ.(199 మై) మధ్య వాణిజ్య అవసరాలకు ఉపయోగించబడుతున్నాయి. యూరోస్టార్, యూరోటన్నెల్ షటిల్‌తో యునైటెడ్ కింగ్డం ఛానల్ టన్నల్‌తో కలుపుతుంది. అండొర్రా మినహా యూరప్ లోని ఇతర పొరుగు దేశాలన్నిటికీ రైలుమార్గాలు ఉన్నాయి. పట్టణ-అంతర్గత సేవలు కూడా బాగా అభివృద్ధి చెంది భూగర్భ సేవలు, ట్రాం మార్గ సేవలు రెండిటితో బస్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.
 
ఫ్రాన్స్‌లో సుమారు 8,93,300 కి.మీ. (5,55,071 మై) పొడవైన సేవలనందించే రోడ్డుమార్గాలు ఉన్నాయి. దేశంలో అన్ని ప్రాంతాలను కలుపగలిగిన విస్తృతమైన రహదారులు, ప్రధాన రహదారులతో పారిస్ ప్రాంతం చుట్టబడింది. పరిసరాలోని [[బెల్జియం]], [[స్పెయిన్]], [[అండొర్రా]], [[మొనాకో]], [[స్విడ్జర్లాండ్]], [[జర్మనీ]] ఇటలీల లోని అనేక నగరాలను కలుపుతూ ఫ్రెంచ్ రహదారులు అంతర్జాతీయ ట్రాఫిక్‌ను రవాణా చేయగలుగుతున్నాయి. వార్షిక నమోదు రుసుము లేదా రహదారి పన్నులేదు. అయినప్పటికీ పెద్ద కమ్యూన్ల పరిసరాలలో తప్ప ఇతరప్రాంతాలలో వాహన వాడకం సుంకం ఉంటుంది. రెనాల్ట్ (2003లో ఫ్రాన్స్ లో అమ్మబడిన కార్లలో 27% ), పియగియో (20.1%),సిట్రోయిన్ (13.5%) వంటి దేశీయ బ్రాండ్లు నూతన కార్ల విపణిలో ప్రాధాన్యతవహిస్తూ ఉన్నాయి.<ref>L'ఆటోమొబైల్ మాగజైన్, హార్స్-సీరీ 2003/2004 పేజి 294</ref> 2004లో అమ్మబడిన నూతన కార్లలో 70% డీజిల్ ఇంజిన్‌లను కలిగి ఉన్నాయి. ఇవి [[పెట్రోల్]] (ఎల్.పి.జి) ఇంజిన్ల కంటే చాలా ఎక్కువ.<ref>{{cite web|url=http://www.ademe.fr/particuliers/Fiches/voiture/rub3.htm |title=Guide pratique de l' ADEME, la voiture |publisher=Ademe.fr |date= |accessdate=2008-10-22}}</ref> ఫ్రాన్స్ ప్రపంచంలోని అతి ఎత్తైన రోడ్డు వంతెనను కలిగిఉంది: దానిపేరు మిల్లవు వియడక్ట్. అంతేకాక పాంట్ డి నోర్మండీ వంటి అనేక ముఖ్యమైన వంతెనలను నిర్మించింది.
564

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2703996" నుండి వెలికితీశారు