స్థానం నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
 
== రంగస్థల ప్రస్థానం ==
1920 సంవత్సరంలో ఒకనాడు [[బాపట్ల]]లో ప్రదర్శించే [[హరిశ్చంద్ర]]లో చంద్రమతి పాత్రధారి రానందున ఆ కొరత తీర్చడానికి తానే ఆ పాత్రను ధరించి తన నట జీవితాన్ని ప్రారంభించాడు. [[తెనాలి ]]లోని [[శ్రీరామ విలాస సభ, తెనాలి|శ్రీరామ విలాస సభ]]లో ప్రవేశించి ఆకాలంలోని గొప్ప నటులందరి సరసన పాత్రలు ధరించి దేశమంతటా పర్యటించి అపారమైన [[అనుభవం]] సంపాదించాడు.
 
ఆంధ్రదేశంలో దాదాపు 3,000 సార్లు [[రంగస్థలం]] మీద పౌరాణిక, [[చారిత్రక దినములు|చారిత్రక]], [[సాంఘిక శాస్త్రం|సాంఘిక]] నాటకాలలో [[స్త్రీ]] పాత్రలను ధరించి ప్రజాభిమానాన్ని చూరగొన్నాడు. [[శృంగారం|శృంగార]] రసాన్ని ప్రతిబింబించే రీతిలో [[సత్యభామ]] పాత్ర, ప్రణయానికి చిత్రాంగిగా, వీరరసాన్ని చిత్రించడంలో రోషనార, వలపుల చింతామణిగా, ప్రణయదేవతగా, భక్తురాలిగా, దేవదేవిగా, మధురాతి మధురమైన మధురవాణిగా [[నవరసాలు]] కలిగిన పాత్రలను ప్రతిభావంతంగా పోషించాడు. వేషధారణ మరియు వస్త్రాలంకరణలో స్థానం వారిది ఒక ప్రత్యేకత. రకరకాల చీరకట్టు సొగసులతో మనోహరంగా రంగస్థానం మీదకు ప్రవేశించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశేవాడు.
"https://te.wikipedia.org/wiki/స్థానం_నరసింహారావు" నుండి వెలికితీశారు