సత్యహరిశ్చంద్రీయం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది {{Unreferenced}}
చి నాటక రచయితకు లింకు ఇచ్చాను
పంక్తి 6:
==నాటక రచయిత==
{{main|బలిజేపల్లి లక్ష్మీకాంతం}}
[[నాటక రచయిత]] బలిజేపల్లి లక్ష్మీకాంత కవి బాపట్ల దగ్గర ఇటికలపాడు గ్రామంలో పుట్టారు. వీరి తల్లిదండ్రులు ఆదిలక్ష్మమ్మ మరియు నరసింహశాస్త్రి. వీరు మేనమామ భాగవతుల చిన్నకృష్ణయ్య గారి ఇంటిలో వుండి చదువుకున్నారు. [[కర్నూలు]] సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో హెడ్ గుమస్తాగా కొంతకాలం పనిచేశారు. [[గుంటూరు]] [[హిందూ కళాశాల (గుంటూరు)|హిందూ కళాశాల]] ప్రధానోపాధ్యాయునిగా కూడా పనిచేశారు. తెలుగు సంస్కృత భాషలలో అనర్గలంగా కవిత్వం చెప్పగలిగేవారు. వీరు తన సహజ పాండిత్యంతో ఎన్నో [[అవధానాలు]] నిర్వహించారు. వీరు 1930 లో [[ఉప్పు సత్యాగ్రహం]] కాలంలో జైలులో ఈ నాటకాన్ని రచించారు. హరిశ్చంద్ర నాటకానికి కవి పెట్టిన పేరు "సత్య హరిశ్చంద్రీయం". ఇందులో సుమారు 25 పాత్రలున్నాయి. నలుగురైదుగురు స్త్రీపాత్రలున్నాయి. భటులు, వందిమాగధులు, సూత్రధారుడు తదితరులతో కలిపి కనీసం 35 మంది నటులు ప్రదర్శించవలసిన నాటకం ఇది. "ఫస్ట్ కంపెనీ" పేరుతో నాటక సమాజాన్ని స్థాపించి హరిశ్చంద్ర నాటకాన్ని దేశం నలుమూలలా ప్రదర్శించారు.
 
== నాటక కథ ==
"https://te.wikipedia.org/wiki/సత్యహరిశ్చంద్రీయం" నుండి వెలికితీశారు