శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి cp edit
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 89:
పల్లవ, చేర, పాండ్య రాజ్యాల నుండి 9వ శతాబ్దం వరకు సాగించిన నిరంతర దాడుల వలన చోళ సామ్రాజ్య పతన దశ ఆరంభం అయింది. సింహవిష్ణు పల్లవ రాజు చోళులను బయటకు తరిమి క్రీ.శ 4వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం వరకు నెల్లూరు మీద తన ఆధిపత్యం ప్రతిష్ఠించాడు. పల్లవుల రాజకీయ అధికార కేంద్రం ఉత్తర భూభాగంలో క్షీణించి అక్కడి నుండి దక్షిణ భూభాగం వైపు కొనసాగింది. ఉదయగిరిలో పలు పాలవ, చోళ ఆలయాలు నిర్మించబడ్డాయి. గుంటూరు మరియు నెల్లూరు జిల్లాలలో పల్లవ మరియు చోళుల పాలనగురించిన అనేక శిలాశాసనాలు లభించాయి. వీటిలో ఉండవల్లి గుహలలో ఉన్న నాలుగంతస్థుల గుహలు ఉన్నాయి. భైరవకోనలో ఉన్న పాలవ శిల్పకళా శైలిని ప్రతిబింబిస్తున్న 8 గుహాలయాలు మహేంద్రవర్మ పాలనా కాలంలో నిర్మించబడ్డాయి.
 
బుద్ధుని కాలమునందు నెల్లూరు గుత్తి, [[కడప]], కందవోలు మండలములును కృష్ణానదికి దిగువనుండు దేశమును కృష్ణాగోదావరుల నడుమనుండు దేశమును వజ్రభూమిగా (Diamond fields) వ్యవహారమునందుండెను. ఆ కాలమునందు నాంధ్రదేశము లోని జనులును, కళింగా దేశము లోని జనులును నొక్క తెగలోనివారుగ గన్పట్టుచున్నారు. కళింగదేశమునందు ప్రసిద్ధములయిన రెండు రేవుపట్టణములు గలవని చీనా బర్మాదేశస్థులు వ్రాసిన చరిత్రము వలన దెలియుచున్నది. మఱియు ఉత్తర పినాకినీ నదీ ముఖద్వారమున నొక రేవుపట్టణముండినట్లుగ బౌద్ధుల గాథలయందు దెల్పబడియున్నది. [[బుద్ధుడు|బుద్ధు]]<nowiki/>ని శిష్యుడగు పూర్ణుడను బ్రాహ్మణుని సోదరుడొకడు మూడు వందల జనులతో సూర్పరాక పట్టణమునుండి (పశ్చిమతీరము లోని కొంకణదేశము లోనిది) యోడనెక్కి లంకాద్వీపమును జుట్టివచ్చి పై జెప్పిన ఉత్తర పినాకినీ [[ముఖద్వారము]] లోని రేవుపట్టణము కడ దిగెనని బౌద్ధులగాథలవలన దెలియుచున్నది. బుద్ధుని కాలమునందాంధ్రదేశమిట్టి నారగికతా చిహ్నములను వహించియుండినను దేశము విశేషభాగమరణ్యభూమిగానే యుండెనని చెప్పవలసియున్నది. ఇంతకన్న బుద్ధునికాలమునందాంధ్రదేశమును గూర్చిన చారిత్రము సవిస్తరముగా దెలియరాదు.
 
=== నెల్లూరు చోళరాజులు ===
పంక్తి 109:
 
=== స్వాతంత్ర్యం తరువాత ===
నెల్లూరు జిల్లా, [[1953]] [[అక్టోబర్ 1]] దాకా సంయుక్త [[మద్రాసు రాష్ట్రము|మద్రాసు రాష్ట్రం]] లో భాగంగా ఉంది. 1956 [[నవంబర్‌ 1]] న భాషాప్రయుక్తంగా రాష్ట్రాల పునర్విభజన జరిగినపుడు జిల్లా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కిందికి వచ్చింది. [[నెల్లూరు]] 1953 అక్టోబర్ 1 వరకు సంయుక్త మద్రాసు రాష్ట్రంలో ఒక భాగం. 1956 నవంబర్ 1వ తారీఖున భాషాప్రయుక్త రాష్ట్ర ఏర్పాటు జరిగిన తరువాత నెల్లూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భాగం అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణలో నెల్లూరు ప్రధాన పాత్ర వహించింది. తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు మరియు దేశభక్తుడు అయిన [[పొట్టి శ్రీరాములు]] ఆమరణ నిరాహార దీక్ష వహించి ప్రాణత్యాగం చేసిన ఫలితంగా ఆంధ్రప్రదేశ్ అవతరణతో సంయుక్త భారతదేశంలో భాషాప్రయుక్త రాష్ట్ర ఏర్పాటుకు దోహదం చేసింది.
 
నెల్లూరు ప్రజలు స్వాతంత్ర్య సమరంలో పాల్గొనడమే కాక తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి పాటుపడ్డారు. గుర్తించతగిన స్వాతంత్ర్య సమరయోధులు ముతరాజు గోపాలరెడ్డి మరియు పొట్టి శ్రీరాములు. నెల్లూరు ప్రజలు రాజకీయాలలో సైతం చురుకు అయిన పాత్ర వహంచారు. నెల్లూరు జిల్లా నుండి ఇద్దరు ముఖ్య మంత్రులు రాష్ట్రపాలన సాగించారు. [[బెజవాడ గోపాలరెడ్డి]] మరియు [[నేదురుమల్లి జనార్ధన రెడ్డి]] నెల్లూరు నుండి ముఖ్యమంత్రులుగా నియమించబడ్డారు. నెల్లూరు జిల్లా ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్ మరియు తెలుగుదేశం. పొరుగు జిల్లాలు అయిన ఒంగోలు మరియు వైఎస్ఆర్ జిల్లాలతో పోలిస్తే నెల్లూరులో కమ్యూనిస్ట్ పార్టీ అనుచరులు అధికమే. ప్రముఖ కమ్యూనిష్టు అయిన [[పుచ్చలపల్లి సుందరయ్య|పుచ్చపల్లి సుందరయ్య]] తనజీవితాన్ని మరియు ఆస్తులను కూడా నెల్లూరు జిల్లాలో ఆర్థికంగా అంతగా బలంగా లేని కమ్యూనిష్టు పార్టీకి అంకితం చేసాడు.
పంక్తి 291:
 
=== పండుగలు /తిరునాళ్ళు ===
నెల్లూరులో జరుపుకొనే ముఖ్యమైన పండుగలు:''[[సంక్రాంతి]]'',''[[ఉగాది]]'', ''[[వినాయక చవితి]]'', ''[[దసరా]]'', ''[[దీపావళి]]'', ''[[శ్రీరామనవమి]]'' రంగనాదరంగనాథ స్వామి తిరునాళ్ళు, బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ.
 
== పశుపక్ష్యాదులు ==
పంక్తి 368:
 
== మూలాలు ==
<br />
<references />
{{ఆంధ్ర ప్రదేశ్}}
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు]]
[[వర్గం:కోస్తా]]