ఒంటిమిట్ట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఒంటిమిట్ట''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]], [[ఒంటిమిట్ట మండలం]] లోని గ్రామం, ఈ మండలానికి కేంద్రం.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇది మండల కేంద్రమైన ఒంటిమిట్ట నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[కడప]] నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3915 ఇళ్లతో, 16067 జనాభాతో 1964 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 8147, ఆడవారి సంఖ్య 7920. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3735 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 303. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 593383<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 516213.
 
కడప నుంచి [[రాజంపేట]]కు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది.<ref>[http://www.kadapa.info/telugu/ఒంటిమిట్టకు/ ఒంటిమిట్టకు ఎలా చేరుకోవచ్చు?]</ref> ఈ క్షేత్రము ఏకశిలానగరము అని ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఉన్న [[కోదండ రామాలయం, ఒంటిమిట్ట|కోదండ రామాలయం]]లోని విగ్రహాన్ని [[జాంబవంతుడు]] ప్రతిష్టించాడు. ఒకే శిలలో శ్రీరామున్ని సీతను లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్ధము ఉంది సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడినది. గోపురనిర్మాణము చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతముగా ఉంటుంది. [[ఫ్రాన్స్|ఫ్రెంచి]] యాత్రికుడు [[టావెర్నియర్]] 16వ శాతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి "భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి" అని కీర్తించాడు.
పంక్తి 61:
పొద్దుతిరుగుడు
===చేతివృత్తులవారి ఉత్పత్తులు===
చీరలు
SAREE WORKS
==స్థల పురాణం==
[[File:View of Kodanda Ramaswamy Temple in Vontimitta.jpg|800px|thumb|center|ఒంటిమిట్ట కోదండరామాలయ సముదాయము]]
పంక్తి 75:
ఏకశిలానగరానికి పడమరవైపున, ఒక కి.మీ.దూరంలో ఉన్న ఈ ఆశ్రమం, పూర్వం మృకుందమహర్షి చే నిర్మితమైనదని పురాణాల ఉవాచ. ఆయన ఈ ఆశ్రమంలో కొలువైన ముక్కంటిని నిత్యం ఆరాధించేవారని పూర్వీకుల కథనం. అందువలన ఈ గ్రామానికి ఆ పేరు వచ్చినది. ఈ ఆలయానికి సమీపములోని ఉన్న ఒక '''వంక '' (వాగు), దక్షిణం నుండి ఉత్తరంవైపు ప్రవహించుచూ ఉండటంతో, ఇందులోని జలధారను భక్తులు పవిత్రమైనదిగా భావించుచున్నారు. చుట్టూ అటవీ ప్రాంతం కావడంతో ఫలాలు, ఔషధ మొక్కలూ అధికంగా అందుబాటులో ఉండేవి. యఙయాగాదులు, తపస్సుల నిర్వహణకు అనుకూలంగా ఉండటంతో, మునులు, మహర్షులు ఈ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకునేవారు.
మృకుందాశ్రమానికీ, ఈ ముకుందాపురానికీ జైనమతంతో సంబంధం ఉన్నట్లు ఆనవాళ్ళు ఉన్నాయని చరిత్ర పరిశోధకులు శ్రీ [[కట్టా నరసింహులు]] తెలియజేసినారు. స్కంద పురాణంలో ఈ ఆశ్రమ ప్రస్తావన ఉన్నట్లు గూడా ఆయన వివరించినారు. ఇక్కడ పరమేశ్వరుని లింగం, [[వినాయకుడు]], [[సుబ్రహ్మణ్యస్వామి]], భ్రమరాంబ, నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, కాలభైరవుల విగ్రహాలు కొలువై ఉన్నవి. ప్రతి సంవత్సరం [[కార్తీకమాసం]]లో ఈ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. [2]
 
:
==మూలాలు, వనరులు==
{{మూలాలజాబితా}}
[1] వైఎస్ఆర్ జిల్లా విజ్ఞాన విహార దర్శిని - డా. [[జానమద్ది హనుమచ్ఛాస్త్రి]] మరియు విద్వాన్ కట్టా నరసింహులు
[2] ఈనాడు కడప; 2016,డిసెంబరు-29; 8వపేజీ.
 
== వెలుపలి లంకెలు ==
[1]. వైఎస్ఆర్ జిల్లా విజ్ఞాన విహార దర్శిని - డా. [[జానమద్ది హనుమచ్ఛాస్త్రి]] మరియు విద్వాన్ కట్టా నరసింహులు
 
[2] ఈనాడు కడప; 2016,డిసెంబరు-29; 8వపేజీ.{{ఒంటిమిట్ట మండలంలోని గ్రామాలు}}
[[వర్గం:వైఎస్ఆర్ జిల్లా పుణ్యక్షేత్రాలు]]
[[వర్గం:రాయలసీమ లోని పుణ్యక్షేత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/ఒంటిమిట్ట" నుండి వెలికితీశారు