కోటప్ప కొండ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి cleanup and fix copy violations partly
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 39:
| date_built =
| creator =
| website = http://www.kotappakonda.com
}}
 
 
[[బొమ్మ:kotappakonda 2.jpg|thumb|right|త్రికోటేశ్వరస్వామి ఆలయ దృశ్యం.]]
[[దస్త్రం:Sri Trikoteswara Swamy Temple Entrance, Kotappakonda.JPG|thumb|300px|right|శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం ప్రవేశద్వారం, కోటప్ప కొండ]]
 
'''[[కోటప్పకొండ]]''' [[గుంటూరు]] జిల్లా, [[నరసరావుపేట]] దగ్గర ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి. కైలాశాధినేత అయిన ఆ మహా శివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిది కోటప్పకొండ. యల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతి పాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. <ref>{{Cite web |title= |url=http://www.kotappakonda.com|accessdate=2019-08-12}} </ref>
 
=='''త్రికూట పర్వత దేవాలయము'''==
'''త్రికూట పర్వతం''' అనే త్రికోటేశ్వరుని సన్నిది కల కోటప్ప వెలసిన కొండ మూడు శిఖరాలతో భక్తులనూ ఆకర్షిన్తూ ఉంటుంది. అందుకే దీనికి త్రికూటమని, ఇక్కడ వెలసిన శంకరుడికి త్రికోటేశ్వరుడని పేరు వచ్చింది. ఈయననే మేధా దక్షిణా మూర్తి అంటారు. దక్షిణా మూర్తి జ్ఞానప్రదాత. ఈ స్వామిని కొలిస్తే జ్ఞానం అభివృద్ది చెందుతుందని నమ్మకం. అంతేకాదు, స్వామి దర్శనం చేసుకున్న వారి జాతకాలలో గురుబలం పెరుగుతుందని నమ్మకం.
 
* ఈ క్షేత్రం మొదటి కొండపై ముసలి కోటయ్యగారి గుడి ఉంది ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది.
* రెండవ కొండ త్రికోటేశ్వరస్వామివారి దేవాలయము కలది. ఇక్కడ ఎర్రగా ఉండే కోతులు ఒక ప్రత్యేకత. గుడి పరిసరాలలో భక్తులు ఇచ్చే ప్రసాదాలను తీసుకొంటూ ఒక్కోసారి లాక్కుంటూ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒక పెద్దపుట్ట, నవగ్రహముల దేవాలయము, ద్యాన మందిరము, దేవాలయపు వెనుక బాగమున వసతి గదులు ఉన్నాయి.
* మూడవ భాగమైన కొండ క్రింద బొచ్చుకోటయ్యగారి మందిరము మరియు కళ్యాణ కట్ట, సిద్ధి వినాయక మందిరములు ఉన్నాయి.
 
;త్రికూటేశ్వర ఆవిర్భావం:
 
దక్షయజ్న విధ్వంసం చేసి లయకార శివుడు శాంతి పొంది యోగ నిష్టతో పన్నెండేళ్ళ వటువుగా దక్షిణామూర్తిగా త్రికోటాద్రిపై ఉంటూ మధ్య శిఖరమైన రుద్ర శిఖరాన బిల్వవనంలో వటవృక్షం కింద బ్రహ్మాసనస్తితుడై దేవ, ముని యక్ష కిన్నరాదులచే సేవింపబడుతున్నాడు. రుద్ర శిఖరానికి ఈశాన్యంలో ఒక శిఖరం ఉంది. దాన్ని’’గద్దల బోడు‘’ అంటారు. బోడు అంటే శిఖరం. శివుడిని ఆహ్వానించకుండా దక్షుడు చేసిన యజ్ఞానికి తాము హాజరైన హవిర్భాగాన్ని తినటం వలన కలిగిన దోషాన్ని విష్ణువు మొదలైన దేవతలు నివారించుకోవటానికి ఇక్కడ శివుని కోసం తపస్సు చేశాడు. శివుడు మెచ్చి దర్శనమిచ్చి తన త్రిశూలంతో శిఖరాన్ని పొడిచి జలాన్ని ఉద్భవింప జేసి, తాను వారి అభ్యర్ధన మేరకు అక్కడే ఉండిపోయి అనుగ్రహించాడు. ఆ శివ జలంలో సస్నానం చేసి విష్ణువు మున్నగు దేవతలు పాప విముక్తులయ్యారు. ఈ జలాన్ని పాపవినాశన తీర్ధమని, ఈ శివుని ’’పాపవినాశక లింగమూర్తి‘’ అని అంటారు. కార్తీక, మాఘ మాసాలలో ఇక్కడి జలంలో స్నానించి ఈ శివుని దర్శిస్తే మోక్షమే.
 
ఏ దయ వలన దుహాలన్నీ సంపూర్ణంగా నశించి శాశ్వతానంద కైవల్య సిద్ధి లభిస్తుందో ఆ దయను దాక్షిణ్యం అంటారు. దీన్ని కల దైవమె దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తి స్వరూపమే కోటప్ప కొండపై ఉన్న త్రికూటేశ్వర స్వామి. సర్వ సంపదలు, మనశ్శాంతి, సత్సంతానం ప్రసాదించే వాడు త్రికూటేశ్వరుడు. త్రికూటేశ్వర నామస్మరణమే మోక్షదాయకం అని అగస్త్య మహర్షి అభివర్ణించాడు. గుంటూరు జిల్లా, నరసరావుపేటకు పద్నాలుగు కిలో మీటర్ల దూరంలో ఎల్లమంద, కొండ కావూరు మధ్య ఉన్న పర్వతాన్ని ‘’త్రికూటాచలం’ లేక ‘’కోటప్ప కొండ’’ అంటారు. 1587 అడుగుల ఎత్తు, 1500ఎకరాల వైశాల్యం, పన్నెండు కిలో మీటర్ల చుట్టుకొలత ఉండి కోటి ప్రభా భాసమానమైన దివ్య విరాజిత క్షేత్రం కోటప్పకొండ. ఏ వైపు నుంచి చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి. అవి బ్రహ్మ విష్ణు మహేశ్వర ప్రతి రూపాలు. త్రిమూర్త్యాత్మక దక్షిణామూర్తి అవతారమే త్రికూటేశ్వర పరమేశ్వరుడు. దేవ, మానవ సేవితమై ముక్తి దాయుడైన ఈ స్వామిని ‘’ఎల్లమందేశ్వరుడు‘’ ’కావూరి త్రికోటేశ్వరుడు’, కోటప్ప, కోటయ్య అని భక్తితో పిలుచుకొంటారు. ఇక్కడ ధ్వజస్తంభం, అమ్మవారు లేకపోవటం, కల్యాణం జరక్కపోవటం ప్రత్యేకతలు. ఈ కొండపై కాకులు వాలక పోవటంవింతలలో వింత. ఈ కొరతను తీర్చటానికా అన్నట్లు కోతులు మాత్రం అసంఖ్యాకం. జాగ్రత్తగా ఉండక పొతే చేతిలోని వన్నీ ‘’హనుమార్పణమే‘’.
 
'''సోపాన (మెట్ల) మార్గాలు:'''
 
చేదుకో కోటయ్య.. మమ్మాదుకోవయ్యా!...... అంటూ, యల్లమంద కోటయ్యగా ప్రజల పూజలందుకొనే త్రికోటేశ్వరస్వామివారి దేవాలయము ఎప్పుడూ నిర్జనంగా ప్రశాంతంగా ఉంటుంది. రోజువారీ భక్తులరాక పరిమితంగా ఉంటూ కేవలంమహాశివరాత్రి సమయంలో మాత్రం కాలు పెట్టే సందు కూడాలేనంతగా భక్తజనంతో నిండిపోతుంది. సౌకర్యాల విషయంలో ఒకప్పటికంటే ఇప్పటి పరిస్థితి బావుంది. కొండ మీదకు పోవడానికి నిర్మించబడిన ఘాటు రోడ్డులో ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ ఆలయానికి చేరుకోవచ్చు. పాప వినాశన స్వామిగుడీ పడమరగా ఉన్న నిటారుగా ఉండే సోపాన (మెట్ల) దారిలో పైకి ఎక్కి యాత్రికులు ఆలయానికి చేరుకుంటారు. ఇదే ఏనుగుల బాట లేక ఎల్లమంద సోపానం. దీనిని శ్రీ మల్రాజు నరసింహరాయణి నిర్మింపజేశారు. మొత్తం విద్యుద్దీపాలను ఏర్పాటు చేసారు. మార్గమద్యంలో ఉన్న జింకలపార్కు కూడా అభివృద్ధి చేయబడింది. ఆ నాటి ఆంద్ర ప్రదేశ్ హోం శాఖామంత్రి శ్రీ కోడెల శివ ప్రసాద రావు భక్తుల అభ్యర్ధన మేరకు ఘాటు రోడ్డును నిర్మించటానికి పూనుకొని, ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్. టి. రామారావు తో శంకుస్థాపన చేయించి, మూడు కోట్ల రూపాయలతో నిర్మింపజేసి 10-2-1999 న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు తో ఆవిష్కరింప జేశారు.
 
=='''ఆలయ పునర్నిర్మాణం'''==
[[దస్త్రం:Sri Trikoteswara Swamy Temple Entrance, Kotappakonda.JPG|thumb|300px|right|శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం ప్రవేశద్వారం, కోటప్ప కొండ]]
శ్రీ శృంగేరి పీఠాదిపతులు శ్రీశ్రీ భారతీ మహా తీర్ధ స్వామి వారు డెబ్భై లక్షల ఖర్చుతో ఆగమ విధానంలో కోటప్ప కొండ ఆలయ పునర్నిర్మాణం జరిగింది. ముఖ్య మంత్రి చంద్ర బాబు ఘాటు మార్గం ద్వారా విచ్చేసి దీన్ని ప్రారంభించారు.
 
=='''దేవాలయ చరిత్ర'''==
[[బొమ్మ:kotappakonda 1.jpg|thumb|right|త్రికోటేశ్వరస్వామి వారి అంతరాలయ దృశ్యం.]]
చారిత్రక త్రికోటేశ్వర ఆలయం క్రీ.శ 1172 లో నాటికే ప్రసిద్ధి చెందినట్లు వెలనాటి చోళ రాజైన కుళొత్తుంగా చోళరాజు, సామంతుడు మురంగినాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. {{Cite web |title=మహిమాన్విత క్షేత్రం.. కోటప్పకొండ|url=https://www.eenadu.net/districts/mainnews/37574/Guntur/19/4 |archiveurl=https://web.archive.org/web/20190812041154/https://www.eenadu.net/districts/mainnews/37574/Guntur/19/4|archivedate=2019-08-12|publisher= ఈనాడు |date=2018}} ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురి రాజులలో ఒకరైన [[శ్రీకృష్ణదేవరాయలు]] దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చాడు. [[నరసరావుపేట]], [[చిలకలూరిపేట]], [[అమరావతి]] మరియు ఇతరులు దేవాలయాభివృద్ధికి అనేక విధాలుగా దానాలు చేసారు. కోటప్ప కొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి [[ఆలయం]] 600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయాన్ని భక్తులు కొండపైకి ఎక్కడానికి 703 మెట్లతో మెట్లమార్గాన్ని క్రీ.శ.1761లో నరసరావుపేట జమీందారు '''శ్రీ రాజా మల్రాజు నరసింహరాయణి''' నిర్మింపజేశారు. ఈ ఆలయానికి నరసరావుపేట సంస్థానాధీశులు రాజా మల్రాజు వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలూ చేసారు. రాను రానూ ఆ మెట్లు ఎక్కలేని భక్తుల కోసం, వాహనాలలో వెళ్ళడానికి 1999లో డాక్టర్ కోడెల శివప్రసాదరావు మంత్రిగా ఉన్న సమయంలో గుడి దాకా చక్కని ఘాట్ రోడ్డు వేయించారు. ఘాట్ రోడ్డు మొదట్లో విజయ గణపతి, సాయిబాబా ఆలయాలు, రోడ్డు ఇరువైపులా ఏంతో అందమైన పూలతోటలు, తోవలో మ్యూజియం, జింకల పార్కు, పిల్లల కోసం పార్కు, ఒక సరస్సు, మధ్య చిన్ని కృష్ణుడు కాళీయమర్దనం చేసే విగ్రహం, దూరంనుంచే చూస్తే ఆకర్షించే బ్రహ్మ, లక్ష్మీనారాయణులు, వినాయకుడు, ముగ్గురమ్మలు (లక్ష్మి, సరస్వతి, పార్వతి ఒక్కచోట ఉంటారు).. ఇలా పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేసారు. ఈ ఆలయాన్ని ఎంతో శ్రద్ధతో డాక్టర్ కోడెల శివప్రసాదరావు అభివృద్ది చేసారు.
 
ఇంతటి దివ్య మహిమ కలిగిన త్రికూటాచల కొండమీదకు ఎక్కటానికి మూడు దారులు ఉన్నాయి. యాత్రీకులు సాధారణంగా శ్రీ రాజా మల్రాజు నరసింహరాయలు నిర్మించిన మార్గంలో ప్రయాణించి ఆలయం చేరుకుంటారు. ఈ కొండను ఏ కోణం నుండి చూసినా (త్రికూటాలు) మూడు శిఖరాలు కనపడుతుంటాయి. కనుక దీనికి త్రికూటాచలమని పేరు వచ్చింది. అందువలన ఇక్కడి స్వామి త్రికూటాచలేశ్వరుడు అయ్యాడు. ఈ మూడు శిఖరాలు [[బ్రహ్మ]], [[విష్ణు]], రుద్ర రూపాలుగా భావించబడుతుంటాయి. పురాణ కథనాలను అనుసరించి దక్షాయజ్ఞం భగ్నం చేసిన తరువాత పరమశివుడు తనకు తాను చిన్న బాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపస్సు ఆచరించిన సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో [[దక్షిణామూర్తి]]<nowiki/>ని సందర్శించి, ప్రార్థించి తమకు జ్ఞానభోధ చెయ్యమని కోరాడు.
 
ఇంతటి దివ్య మహిమ కలిగిన త్రికూటాచల కొండమీదకు ఎక్కటానికి మూడు దారులు ఉన్నాయి. యాత్రీకులు సాధారణంగా శ్రీ రాజా మల్రాజు నరసింహరాయలు నిర్మించిన మార్గంలో ప్రయాణించి ఆలయం చేరుకుంటారు. ఈ కొండను ఏ కోణం నుండి చూసినా (త్రికూటాలు) మూడు శిఖరాలు కనపడుతుంటాయి. కనుక దీనికి త్రికూటాచలమని పేరు వచ్చింది. అందువలన ఇక్కడి స్వామి త్రికూటాచలేశ్వరుడు అయ్యాడు. ఈ మూడు శిఖరాలు [[బ్రహ్మ]], [[విష్ణు]], రుద్ర రూపాలుగా భావించబడుతుంటాయి. పురాణ కథనాలను అనుసరించి దక్షాయజ్ఞం భగ్నం చేసిన తరువాత పరమశివుడు తనకు తాను చిన్న బాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపస్సు ఆచరించిన సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో [[దక్షిణామూర్తి]]<nowiki/>ని సందర్శించి, ప్రార్థించి తమకు జ్ఞానభోధ చెయ్యమని కోరాడు.
[[పరమశివుడు]] బ్రహ్మాదులను త్రికూటాచలానికి వస్తే జ్ఞానం ఇస్తానని చెప్పగా, బ్రహ్మదేవుడు త్రికూటాచలానికి వచ్చి పరమశివుని నుండి జ్ఞానోపదేశం పొందాడు. అంతట శివుడు ఈ త్రికూటాద్రి మధ్య శిఖరమున బిల్వ వృక్ష వనాంతరమున వెలసి వారలకెల్లరకును
బ్రహ్మోపదేశము చేసెను. ఈ చోటనున్న గుడికే పాత [[కోటప్పగుడి|కోటప్ప గుడి]] అను పేరు. లోపలి లింగము ఒక అడుగు ఎత్తు కలది. ఈ గుడి ఉన్న శిఖరమును రుద్ర శిఖరము అనబడుచున్నది. రుద్ర శిఖరమునకు [[నైఋతి]] భాగమునున్న శిఖరమునకు బ్రహ్మశిఖరమని పేరు. రుద్ర విష్ణు శిఖరములపై స్వయంభువులగు [[జ్యోతిర్లింగాలు|జ్యోతిర్లింగములు]] వెలయుటయు, ఈ శిఖరముపై ఏమియు లేకపోవుటయుకని చింతిల్లి, బ్రహ్మ శివుని గూర్చి తపము చేసి శివుడిని లింగమును ఆవిర్భవింపజేసెను. ఇదియే బ్రహ్మశిఖరము. ఇచ్చట తూర్పున గల చిన్నపల్లె ''' మునిమంద''', '''ఎల్లమంద''' అనిపేరు గలది. తొలుత బ్రహ్మాది దేవతలు, సకల మునిగణములు శివుని ఇచ్చట పరివేష్టించియుండిరట. కావుననే దీనికాపేరులు వచ్చెనని చెప్పుదురు. ఈశిఖరమున వున్న [[లింగములు|లింగము]]నకే ''కొత్త కోటప్పకొండ'' అను వ్యవహారము. అందుకే ఇక్కడి శివుడు త్రికూటేశ్వరుడయ్యాడు. ఈ శిఖరాలను రుద్ర శిఖరం, బ్రహ్మ శిఖరం, విష్ణు శిఖరంగా భావిస్తూ కోటి మంది దేవతలు ఇక్కడ శివుడి కోసం తపస్సు చేయడం వల్ల కూడా ఈ క్షేత్రం కోటప్ప క్షేత్రంగా మారిందని భక్తులు నమ్మకం. ఈ దేవుడికే శివరాత్రి నాడు అతివైభవముతో [[తిరునాళ్ళు]] జరుపుతారు.
శివుని ఇచ్చట పరివేష్టించియుండిరట. కావుననే దీనికాపేరులు వచ్చెనని చెప్పుదురు. ఈశిఖరమున వున్న [[లింగములు|లింగము]]<nowiki/>నకే ''కొత్త కోటప్పకొండ'' అను వ్యవహారము. అందుకే ఇక్కడి శివుడు త్రికూటేశ్వరుడయ్యాడు. ఈ శిఖరాలను రుద్ర శిఖరం, బ్రహ్మ శిఖరం, విష్ణు శిఖరంగా భావిస్తూ కోటి మంది దేవతలు ఇక్కడ శివుడి కోసం తపస్సు చేయడం వల్ల కూడా ఈ క్షేత్రం కోటప్ప క్షేత్రంగా మారిందని భక్తులు నమ్మకం. ఈ దేవుడికే శివరాత్రి నాడు అతివైభవముతో [[తిరునాళ్ళు]] జరుపుచుందురు.
 
దక్ష యజ్ఞమున హవిర్భాగములను స్వీకరించిన పాపము పొవుటకై విష్ణువీ శిఖరమున రుద్రిని గూర్చి తపము చేసెను. రుద్రుడు ప్రత్యక్షమై త్రిశూలముతో నేలమీద పొడిచెను. ఆరంధ్రముల నుండి వెంటనే [[జలము]] పైకి పొంగి ప్రవహించెను.
ఆజలమున స్త్నానము చేసి తన్ను ప్రార్థించిన [[పాపము]] పోవునని రుద్రుడు చెప్పెను. విష్ణు అలా చేసి పాపమును పోగొట్టు కొనెను. ఇచ్చట ప్రత్యక్షమయిన రుద్రుడను పాపవినాశనేశ్వరుడందురు. ఈశిఖరమునకు 'గద్దలచోడు' అనియుపేరు.
యాత్రికులు తొలుత ఈ శిఖరమునకు ఎక్కి ఇచ్చట తీర్ధమున స్నానమాడి, పాపవినాశనేశ్వరుడుని సేవించి తరువాత కొత్త కోటప్పకొండకు చేరుదురు.
=='''స్థలపురాణం'''==
త్రికూట పర్వతాలలో మధ్యమ శిఖరంపై శ్రీ కోటేశ్వర లింగం ఉంది. కొత్త ఆలయం దక్షిణ భాగంలో గణనాధుని గుడి, పడమర ‘’సాలంకేశ్వరాలయం‘’ ఉత్తరాన ‘’సంతాన కోటేశ్వర లింగం‘’, ఎడమ బాగాన బిల్వ వృక్షం కింద ‘’మార్కండేయ లింగం‘’, తూర్పు మండపంలో నందీశ్వరుడు, దీనికి తూర్పున ‘’అడవి రామ లింగం‘’, వెనక లింగ మూర్తి తూర్పున దుర్గా, భైరవులు, గర్భాలయంలో ద్వారపాలురు ఉంటారు. సోపాన మార్గ ప్రారంభంలో కింద తలనీలాలను సమర్పించే ప్రదేశాన్ని ‘’బొచ్చు కోటయ్య‘’ గుడి అంటారు. కొండ కింద నీలకంఠేశ్వరస్వామి, దీనికి నైరుతిన వాసు దేవానంద సరస్వతి స్వాముల వారు కాశీ నుంచి తెచ్చిన శివలింగం ఉన్నాయి. ఈ క్షేత్రంలో దైవ నిర్మితమైన దోనెలు ఎన్నో ఉన్నాయి. దిగువ దోనేలలో ఎద్దడుగు దోన, పుర్ర చేతి దోన, ఉబ్బు లింగయ్య దోన, పాలదోనలో భక్తులు స్నానాలు చేస్తారు. ఇక్కడే తపస్సు చేసుకోవటానికి ఎన్నో గుహలు అనుకూలంగా ఉన్నాయి. త్రికూటానికి దక్షిణాన "ఒగేరు" లేక ‘’ఓంకార నది’’ ప్రవహిస్తోంది. చేజెర్లలో శిబిచక్రవర్తి లింగైక్యం చెందిన కోటేశ్వర లింగానికి సమస్త దేవతలు, సిద్ధ సాధ్యాదాదులు మహర్షులు ఓంకారంతో అభిషేకించిన జలం కపోతేశ్వర స్వామి గుడి వెనక నుండి బయల్దేరి కోటప్ప కొండ దగ్గర ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. భక్తులు ముందుగా విష్ణు శిఖరంలోని పాప వినాశన తీర్ధంలో స్నానం చేసి లింగమూర్తిని పూజించి, గొల్ల భామను దర్శించి తర్వాత త్రికూటేశ్వర లింగ దర్శనం చేయటం విధానం. శ్రావణ మాసంలో రుద్ర శఖరాన్ని కార్తీక మాసంలో విష్ణు శిఖరాన్ని, మాఘంలో బ్రహ్మ శిఖరాన్ని దర్శించి మహాలింగార్చన చేసి ప్రాచీన, నూతన కోటేశ్వర స్వాముల దర్శనం చేసి తరించాలి. కోటప్పకొండ అపర కైలాసం అని అచంచల విశ్వాసం.
 
'''చరిత్ర ప్రసిద్ధి:'''
 
కోటప్ప కొండ దేవుడికి వెయ్యేళ్ళ పైబడి చరిత్ర ఉంది. ఇక్కడి దాన శాసనాలలో వెలనాటి గొంకరాజు, వెలనాడు చాళుక్య భీమరాజు, వెలనాటి కుళోత్తుంగ చోళుడు, వెలనాటి రాజేంద్రుడు పేర్లున్నాయి. కృష్ణ దేవరాయలు, మల్రాజు వెంకట నారాయణి, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు మొదలైన రాజులు జమీందార్లు స్వామికి విలువైన మాన్యాలు రాసి సమర్పించారు.
 
'''త్రికూటాచల మహాత్మ్యం:'''
Line 97 ⟶ 68:
శివభక్తుడైన సాలంకయ్యకు శివఅనుగ్రహంతో ఐశ్వర్యం లభిస్తుంది.  పరమేశ్వరుడు కొన్ని రోజుల పాటు జంగమదేవర రూపంలో అతని ఇంటికి వచ్చేవాడు. కొన్నాళ్లకు కనిపించలేదు. దీంతో సాలంకయ్య నిరాశ చెందాడు. ఆ సమయంలోనే త్రికూటాచల దక్షిణాన ‘’కొండ కావూరు‘’ గ్రామంలో యాదవ వంశంలో సుందరి సునందలకు గారాలబిడ్డగా ‘’ఆనంద వల్లి‘’ అనే పాప జన్మించింది. చిన్న నాటి నుంచే శివభక్తిలో లీనమయ్యేది. రుద్రాక్షమాలలు ధరించేది. ఆధ్యాత్మిక భావాలను బోధించేది. పెరిగే కొద్దీ శివునిపై భక్తి పెంచుకొని శైవగీతాలు ఆలపించేది. . ఆనందవల్లి ప్రతిరోజూ రుద్రాచలానికి వచ్చి శివలింగానికి పూజలు నిర్వహించేది. ఒక శివరాత్రి నాడు ఆమె ఓంకార నదిలో స్నానం చేసి రుద్ర శిఖరం చేరి త్రికూటేశ్వరుని దర్శించి, బిల్వ వృక్షం కింద తపస్సులో ఉండగా, సంగతి తెలుసుకున్న సాలంకయ్య తనకు కూడా శివదర్శనం ఇప్పించాలని కోరాడు. అయితే ఆమె అంగీకరించక శివుని ఆరాధనలో కొనసాగింది. ఒక రోజు అభిషేకం కోసం జలం తీసుకువెళుతుండగా నీటి కొరకు ఒక కాకి బిందె మీద వాలింది. దీంతో ఆగ్రహించి కాకులు ఇక్కడకు రాకూడదని శాపం పెట్టింది. ఇప్పటికీ కాకులు ఈ క్షేత్రంలో రాకపోవడం విశేషం. ఆమె భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఆమెను కుటుంబ జీవితం కొనసాగించమని బ్రహ్మచారిణిగా ఉన్న ఆమెను గర్భవతిగా మారుస్తాడు. అయినా ఆమె శివారాధన చేయడం మానలేదు. ఆమె భక్తికి మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై తానే ఆమె వెంట వచ్చి పూజలు స్వీకరిస్తానని అయితే ఇంటికి వెళ్లే సమయంలో తిరిగి చూడకుండా వెళ్లాలని ఆజ్ఞాపిస్తాడు. ఆనందవల్లి కొండ మెట్లు దిగుతూ ఒక చోట కుతూహలం కొద్దీ వెనక్కు తిరిగి చూడటంతో స్వామి వెంటనే అక్కడ వున్న గుహాలో లింగరూపం ధరించాడు. ఆనందవల్లికి కుమారుడు జన్మించాడు. తాను వెనక్కు తిరిగిచూడటంపై ఆనందవల్లి బాధపడింది. మరణానికి సిద్ధం కావడంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ఆ సమయంలో బాలుడు కూడా అదృశ్యమవుతాడు. ఇదంతా శివమాయ అని ఆనందవల్లి గ్రహిస్తుంది. అనంతరం ఆమె భక్తీ కి సంతసించి జంగమయ్య శివైక్యాన్ని ప్రసాదించాడు.
 
'''విశిష్ట సేవా విధానం:'''
 
శ్రీ త్రికూటేశ్వరాలయంలో ఎప్పుడూ అఖండ దీపారాధన, అభిషేకాలు పూజలు జరుగుతాయి. శివరాత్రి ఉత్సవానికి ఇక్కడికి కుల మత భాషా ప్రాంత భేదాలు లేకుండా అశేష జనం వస్తారు. మహా ఎత్తైన ప్రభలు కట్టుకొని రావటం ఇక్కడ ప్రత్యేకత. అందుకే ఏదైనా ఎత్తుగా ఉంటె ‘’కోటప్పకొండ ప్రభ‘’ అనటం అలవాటైంది. మాఘమాసంలో పశువులతో ప్రదక్షిణ చేసి స్వామిని సేవిస్తారు. తడి బట్టలతో చిన్న చిన్న ప్రభలను భుజాన పెట్టుకొని గరి నెక్కి ప్రదక్షిణ చేస్తారు. సంతాన హీనులు, భూతప్రేత పిశాచాదుల బారిన పడినవారు నేత్రదృష్టి కోల్పోయిన వారు కోటేశ్వరస్వామి ప్రదక్షిణ చేసి దర్శించి మనోభీస్టాన్ని నేరవేర్చుకొంటారు.
 
'''కోటి ప్రభల కోటేశ్వరుడు:'''
 
కొండ కింద ప్రసన్నకోటేశ్వరుడు, నీలకంఠేశ్వరుడు మొదలైన ఆలయాలున్నాయి. అన్నదాన సత్రాలున్నాయి. శివరాత్రికి అన్నికులాల వారికి అన్నదానం జరుగుతుంది. శివరాత్రి తిరునాళ్ళు పరమ వైభవంగా నిర్వహింపబడుతాయి. నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. ’’శివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో కోటిన్నోక్క ప్రభలతో నా కొండకు వచ్చే భక్తుల కోసం నేను కొండ దిగి వచ్చి దర్శనం అనుగ్రహిస్తాను‘’ అని కోటేశ్వరుడు అభయమిచ్చినట్లు భక్తులు విశ్వసిస్తారు. శివుడికి ఇష్టమైన వెదురు గడలతో ప్రభలను నిర్మించి, అనేక చిత్ర విచిత్ర పటాలను అలంకరించి విద్యుద్దీపాలతో వెలుగులు వెలయింపజేస్తూ కోటప్పకొండ తిరునాళ్ళకు వస్తారు. కాని ఇన్నేళ్ళుగా ప్రభలు కట్టినా కోటిన్నొక ప్రభ సంఖ్య కాలేదట. ఎప్పటికప్పుడు ఒక ప్రభ తగ్గుతోందట. ఆలెక్క పూర్తీ అయితే ప్రళయం వచ్చి స్వామి కిందకి దిగివస్తాడని నమ్ముతున్నారు. ‘’చేదుకో కోటేశ్వరా, చేదుకొని మమ్మాదరించవయ్యా‘’ అని భక్తీతో ఆర్తితో వేడుకొంటూ హరహర మహాదేవ స్మరణతో దిక్కులు పిక్కటిల్లిపోతాయి. ఎడ్ల పందాలు, చిత్రమైన ఆటలు కోలాటాలు, నృత్య గీతాలతో, రంగుల రాట్నాలతో ప్రాంగణం అంతా శోభాయమానంగా కనిపిస్తుంది. పశువులతో గిరి ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకొనే అశేష జనసమూహం ఉత్సాహాన్నిస్తుంది. శివరాత్రి వేడుకలతో బాటు కార్తీక, మార్గశిర మాఘ మాసాలలో భక్తులు సామూహిక బిల్వార్చన, రుద్రాభిషేం, రుద్రయాగం జరగటం ఇక్కడి విశేషం.
 
'''లింగ ప్రాధాన్యం:'''
 
సంతానం అపేక్షించేవారు శుచిగా తడి బట్టలతో ’’సంతాన కోటేశ్వరలింగం‘’కు ప్రదక్షిణాలు చేసి మొక్కుకుంటారు. లింగోద్భవ కాలంలో అర్ధరాత్రి వరకు తడి బట్టలతోనే శివ పంచాక్షరి జపిస్తూ గడగడలాడే చలిలో కూడా ఆలయం చుట్టూ సాష్టాంగ దండ ప్రమాణాలు చేయటం వారి మహాభక్తికి, విశ్వాసానికి, నమ్మకానికి నిదర్శనం. కొత్త కోటేశ్వరాలయం పైన ఉన్న సెలయేరు దగ్గరున్న మార్కండేయ మహాముని చేత ప్రతిష్టింపబడిన మార్కండేయ శివలింగం ఉంది. కైలాసం నుండి సతీవియోగ వికల మనస్కుడై ఇక్కడికి వచ్చి దక్షిణామూర్తి గా వెలసిన శివుని వెతుక్కొంటూ ఆయన వాహనమైన బసవన్న ఇక్కడికి వచ్చి ఘోర తపస్సు చేశాడు. ఆయన అమోఘ తపస్సుకు భంగం కాకుండా పరమేశ్వరుడు ఇక్కడ తాగు నీటికోసం ఒక వాగును ప్రవహింప జేశాడు. అదే ‘’ఎద్దడుగు వాగు‘’ అని పిలువబడుతోంది. త్రికోటేశుని సన్నిధిలోని ‘’బసవ మందిరం‘’ భక్తులు శివరాత్రి మొదలైన పర్వ దినాలలో పూజలు, వ్రతాలు ఆచరిస్తారు. ఇక్కడి అసలు దైవం బ్రహ్మచారి అయిన దక్షిణామూర్తి కనుక ధ్వజస్తంభ ప్రతిష్ట జరగలేదు. కళ్యాణ వైభోగం లేదు అందుకే స్వామిని ‘’బాల కోటేశ్వరుడు‘’ అని ‘’సంతాన కోటేశ్వరుడు‘’ అని అంటారు. అడవి రామలింగేశ్వరుడు, కూకట్లశంభుడు, శంభు లింగమ్మ, నాగమ్మ, వెంకటేశ్వరుడు అనే భక్తులు స్వామిని సేవించి పునీతులైనారు. 200ఏళ్ళ నుండి ప్రభలతో మొక్కులు సమర్పించటం ఉన్నదని తెలుస్తోంది. పొట్లూరి గ్రామం నంది వాహనంపై శివుని అలమరించి శివరాత్రి జాగరణ నాడు ప్రభలతో ఆ గ్రామ ప్రజలు అన్ని మెట్లు యెక్కిస్వామిని దర్శించటం ఇప్పటికీ ఆనవాయితిగా వస్తోంది. ఇక్కడి ప్రభలు ‘’ఈశ్వరుని క్రాంతి ప్రభలకు‘’ నిదర్శనం. ఆహ్లాదానికి, ఔన్నత్యానికి సమైక్యతకూ ప్రతీక. 40 అడుగుల నుండి 100 అడుగుల ఎత్తు వరకు ప్రభలు వాటిపై విద్యుత్ కాంతులతో నిర్మించటం విశేషాలలో విశేషం. ‘’అమావాస్యనాడు పున్నమి’’ సందర్శనాన్ని తలపింపజేస్తుంది.
 
=='''దక్షిణా మూర్తి దీక్ష''' ==
ధనుర్మాసంలో ఆర్ద్రా నక్షత్ర ఉత్సవానికి ముందు నలభై రోజుల పాటు వేలాది భక్తులు శ్రీ మేధా దక్షిణామూర్తి దీక్షను స్వీకరిస్తారు. దీనికే ‘’కోటప్ప దీక్ష‘’అని పేరు. నియమ నిష్టలతో భక్తీ విశ్వాసాలతో శివనామస్మరణ, శివ పంచాక్షరీ జపాలతో, అభిషేకాలతో, సంత్సంఘాలతో, ఉపవాసాలతో ఆలయం పులకించిపోతుంది. ‘’దక్షినానన దక్షినానన దక్షినానన పాహిమాం–త్రికోటేశ్వర త్రికోటేశ్వర త్రికోటేశ్వర రక్షమాం‘’ అని శివస్మరణ చేస్తూ ఆలయం అపరకైలాసాన్ని స్పురణకు తెస్తుంది. మేధా దక్షిణామూర్తి భక్త సమాజం వారు 46 రోజుల పాటు 35 మంది వేద పండితులతో ‘’మహా రుద్ర యాగ పూర్వా కోటి బిల్వార్చన’’, నిరతాన్న దానాలు, గోస్టులు, సాంస్కృతిక కార్యకలాపాలతో కళకళ లాడుతుంది ప్రాంగణం అంతా. కోరిన కోర్కేలను తీర్చే కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించి భక్తులు తరిస్తారు.
 
{{వ్యాఖ్య|'''’’శివః కారయితాకర్తా-శివో భోజయితా భోక్తా శివః -ప్రీణాతు శంకరః ‘’'''<br /><br /> }}
 
క్రీస్తు శకం 6, 7శతాబ్దాల్లోనే ఈ ప్రాంతాన్ని ఆనంద గోత్రికులు, విష్ణుకుండినులు పాలించి త్రికూటాధిపతులుగా బిరుదులు పొందారు. నిర్మలత్వం,  ప్రశాంతత మూర్తీభవించిన ఓంకార స్వరూపుడు దక్షిణామూర్తి. ఈ స్వామి అనుగ్రహంతో సర్వవిద్యలు లభిస్తాయని ప్రతీతి. దక్షిణాభిముఖంగా ఆశీనుడైన మూర్తి కనుక దక్షిణామూర్తి పేరు సార్థకమైందని చెబుతారు. 200 ఏళ్లకు పూర్వం బ్రహ్మశిఖరంపై పినపాడు వేలేశ్వర అయ్యవారు జనాకర్షణ, మొక్కుబడులు, అష్టదిగ్బంధ గణపతి, సంతాన కోటేశ్వర యంత్రాలు స్థాపించినట్లు శాసన ఆధారాలు ఉన్నాయి. మేధాదక్షిణా మూర్తి వద్ద విష్ణువు కూడా బ్రహ్మోపదేశం పొందినట్లు స్థల పురాణం చెబుతోంది. దీంతో ఇక్కడ విష్ణు శిఖరం ప్రసిద్ధి చెందింది. అయితే పూర్వాశ్రమంలో ప్రజలకు ఇవి తెలియవు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు కోటప్పకొండకు ఘాట్‌ రోడ్డు నిర్మాణం చేయించారు. ఘాట్‌ రోడ్డులోని రెండు మలుపుల్లో బ్రహ్మదేవుని విగ్రహాన్ని అదే మలుపులో మహావిష్ణువు, లక్ష్మీదేవి, ఆదిశేషుని విగ్రహాలను ఏర్పాటు చేయించారు. కొండపైన భారీ వినాయకుని విగ్రహాన్ని కూడా నిర్మించారు.
 
=='''సామూహిక అక్షరాభ్యాసం'''==
 
ప్రముఖ శైవక్షేత్రంమైన [[కోటప్పకొండ]] త్రికోటేశ్వరస్వామి సన్నిధిలో కొలువుతీరిన మేధా దక్షిణామూర్తి పాదాల చెంత ప్రతి సంవత్సరమూ వేలమంది చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం జరుగుతుంది. విద్య బతుకు తెరువును చూపేది మాత్రమే కాక బతుకు పరమార్థాన్ని తెలిపేది అని కూడా మన పెద్దల అభిప్రాయం. ఈ దృష్టితోనే అక్షరాభ్యాసాన్ని ఒక పవిత్రమైన సంస్కారంగా భావించి, కోటప్పకొండను అక్షరాభ్యాస కేంద్రంగా రూపొందించారు. పర్వదినాలు అక్షరాభ్యాసానికి అనువైనవి. ముఖ్యంగా విజయదశమీ, శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఉన్న రోజు, శ్రీపంచమి వంటి పర్వదినాలలో ఈ కార్యక్రమం చేయటంవల్ల ఆ దేవతల ఆశీస్సులూ అనుగ్రహమూ లభించి, విద్యాభివృద్ధికి దోహదం కలిగిస్తుందని నమ్మకం. అదేవిధంగా, ఈ రోజున చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తే వాళ్లు విద్యావంతులవుతారని నమ్మకం. మాఘమాసం ప్రకృతి వికాసానికి, సరస్వతి మనోవికాసానికి సంకేతం. ఈ రెండింటి కలయిక పరిపూర్ణ వికాసానికి నిదర్శనం. దీనికి ప్రతీకగా వసంత పంచమి వ్యాప్తిలోకి వచ్చింది. మనిషిలో ఉండే అవిద్య లేదా అజ్ఞానం తొలగిపోయి ఎప్పుడు జ్ఞానం అనే వెలుగురేఖ ప్రసారమవుతుందో ఆ రోజు మనిషి వికాసానికి ప్రారంభసూచిక అవుతుంది. అజ్ఞానం అనే మంచుతో గడ్డకట్టిన మనిషి హృదయాన్ని చదువు అనే వేడితో కరిగించి జ్ఞానం అనే వెలుగును ప్రసరింపజేయటమే వసంత పంచమి అంత‌రార్థం. కాబట్టి, వసంతపంచమి రాగానే పిల్లలతో తొలిసారి అక్షరాలు దిద్దిస్తారు. సర్వసాధారణంగా అక్షరాభ్యాసం ఐదో ఏట చేస్తారు. ఆ వయస్సు వచ్చేసరికి విషయాన్ని గ్రహించి అర్థం చేసుకుని, మనస్సులో నిలుపుకొనే శక్తి చిన్నారికి లభిస్తుంది.
 
{{వ్యాఖ్య|'''మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభ దినేపిచ <br /> పూర్వేహ్ని సమయం కృత్యాతత్రాహ్న సంయత: శుచి:'''<br /><br /> }}
 
ఈ మంత్రాన్ని పఠిస్తూ.. సరస్వతీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలవాలి. సరస్వతీదేవి ప్రతిమ ముందు పుస్తకాలు, విద్యకు సంబంధించిన వస్తువులు ఉంచి షోడవోపచారాలతో మాతను పూజించాలి. తల్లికి తెల్లని పూలు, సుగంధ ద్రవ్యాలను రంగరించిన చందనంతో, తెలుపు వస్త్రాలతో అమ్మవారిని పూజించాలి. అందుకే అక్షరాభ్యాసం చేయించుకొనే చిన్నారులకు పలక, బలపం, సరస్వతి అమ్మవారి రూపు, కంకణములు, ప్రసాదం పంపిణీ చేసి పిల్లలతో తొలిసారి అక్షరాలు దిద్దిస్తారు. ఈ సందర్భంగా గణపతి పూజ, మేథా దక్షణామూర్తి, సరస్వతి పూజలు, గణపతి హోమం, మేథా దక్షణామూర్తి హోమం జరిపి, అక్షరాభ్యాసం చేయించే పిల్లవాడిని తండ్రి తొడమీద కూర్చోబెట్టుకుని '''‘ఓం నమః శివాయః సిద్ధం నమః’''' అనే అక్షరాలను కుమారుడుచేత రాయిస్తాడు. సరస్వతీదేవి ఎలా వీణ పట్టుకుంటుందో దక్షిణామూర్తి కూడా అలా వీణ పట్టుకుని ఉంటాడు. సమస్త విద్యలకు అధిదేవత పరమశివుడు. అందుకే శివుడు తెలుపు, సరస్వతీదేవి కూడా తెలుపు. ఇద్దరూ జ్ఞాన ప్రదాతలే. విద్యాధి దేవత సరస్వతి అయినా, జ్ఞానస్వరూపుడు శివుడు కాబట్టి '''‘నమశ్శివాయ’''' అక్షరాలు దిద్దడంతో అక్షరాభ్యాసం ప్రారంభమవుతుంది. విద్యార్థితో తొలి అక్షరాలను బియ్యంపై రాయించే ఆచారం కొన్నిచోట్ల ఉంది. ఆ చిన్నారికి ఎప్పుడూ ధనధాన్యాలు సమృద్ధిగా చేకూరాలని దీవించడమే ఇందులోని అంతరార్థం. రాష్ట్ర విభజన అనంతరం బాసర తరహాలో కోటప్పకొండను అక్షరాభ్యాస కేంద్రంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రకటించారు.
 
=='''ప్రభల ఉత్సవ సంబరాలు'''==
[[దస్త్రం:Prabha 26.jpg|thumb|శివరాత్రికి కోటప్పకొండ ప్రభలు]]మహాశివరాత్రి సందర్భంగా ప్రభల ప్రదర్శన అత్యంత వైభవంగా సాగుతోంది. జంగమయ్య చిత్రాలతో చిన్న ప్రభల నుంచి భారీ ఎత్తున ప్రభలను ఊరేగింపుగా తీసుకువస్తారు. ప్రతి ఏటా కార్తీకమాసంలో కోటప్పకొండ తిరుణాళ్ళు వైభవంగా జరుగుతాయి. తిరునాళ్ళ సందర్భంగా ఏర్పాటయ్యే ఎత్తయిన ప్రభలు చాలా ప్రసిద్ధిని పొందాయి. కార్తీకమాసంలోనే ఈ దేవాలయంలో కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతూ వుంటాయి. కోటప్ప కొండ అనగానే శివరాత్రి ప్రభల సంబరమే గుర్తుకొస్తుంది. కోటప్ప కొండ త్రికూటేశ్వరునికి సంబంధించి ప్రభల సంభరం అత్యంత ప్రసిద్ధిగాంచిన ఓ ఉత్సవం. ఈ ఉత్సవంలో భాగంగా చిన్న పిల్లలు చిన్న చిన్న ప్రభలు, అలానే పెద్దలు దాదాపు 100 అడుగులకు పైగా ఎత్తుండే చక్కగా అలంకరించబడ్డ ప్రభలను చుట్టుపక్కల గ్రామాల వారు శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్మించి, శివుడికి కానుకగా సమర్పిస్తారు. వీటిని త్రికూట పర్వతం ముందు నిలిపి ఉంచుతారు. వీటిని ట్రాక్టర్లలో బండ్లలో డప్పులు, బ్యాండు, రికార్డింగ్ డ్యాన్సులతోనూ, పగటి వేషాల వంటి పలు కార్యక్రమముల తోనూ తీసుకొస్తారు. ఒక్కొక్క ప్రభను ఒక్కొక్క రకంగా అలంకరించి కొండ క్రింద పొలాల్లో ఉంచుతారు. ఇవి పెద్దవే వందల సంఖ్యలో ఉంటాయి. చిన్నవయితే లక్షల సంఖ్యలో కనుపిస్తూ, కొండ పైభాగమునుండి చూసేవారికి సముద్రంలో తెరచాపల్లా కనువిందు చేస్తూఉంటాయి. గతంలో ఎడ్లబండ్లలో తీసుకువచ్చేవారు. ప్రస్తుతం ట్రాక్టర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మేడారం తరువాత రెండో అతిపెద్ద జన జాతర శివరాత్రి రోజున కోటప్పకొండలోనే జరుగుతుంది. విభజన తర్వాత కోటప్పకొండ తిరునాళ్లకు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదాను కల్పించింది. ఈ తిరునాళ్లలో విద్యుత్ ప్రభలే ప్రధాన ఆకర్షణ.
 
;<nowiki>శరభ శరభ:</nowiki>
;<nowiki>కోటప్పకొండ ప్రభల విన్యాసం:</nowiki>
 
ప్రతి శివరాత్రికీ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. తిరుపతి కొండకు వెళ్ళి మ్రొక్కులు తీర్చుకున్నట్లే ఇక్కడ కూడా వేలాది మంది మ్రొక్కులు తీర్చుకుంటారు. ఎవరికి వారు మ్రొక్కులు తీర్చు కోవడానికి వస్తూ పెద్ద పెద్ద ప్రభలను కట్టి వాటిని ఎంతో అందంగా అలరించి ఒకరిని మించి ఒక పోటీలు పడి ఈ ప్రభలను నిర్మిస్తారు.
 
;<nowiki>ముద్దుల ఎద్దుల అలంకారం:</nowiki>
 
ప్రభల బండ్లకు కావలసిన ఎడ్లను ఎంతో ముద్దుగా పెంచుతారు. అందుకోసం వాటికి మంచి తిండి పెట్టి కన్న బిడ్డలను సాకినట్లు సాకుతారు. వాటికి మెడలో మువ్వల పట్టెడలు, గంటల పట్టెడలు, మూతికి అందమైన శిఖమార్లు, నడుంకు తోలు బెల్టులు, ముఖానికి వ్రేలాడే కుచ్చులు, కొమ్ములకు రంగులు, కాళ్ళకు గజ్జెలు, వీపుమీద రంగు రంగుల గుడ్డలు అలంకరిస్తారు. ప్రభలు బయలుదేరి వస్తూ వుంటే ఎడ్ల సౌందర్యాన్ని చూడడానికి జనం మూగుతారు. ప్రభలు వారి వారి శక్తి కొలది పెద్ద పెద్ద ప్రభలను తీసుకువస్తారు. ఆ ప్రభలను రంగు రంగుల గుడ్డలతో, రంగుల కాగితాలతో, ఫోటోలతో అలంకరిస్తారు. శక్తి కలవారు జనరేటర్ పెట్టి ప్రభలకు ఎలక్ట్రిక్ బల్బులను అమర్చుతారు.
 
;<nowiki>ప్రభల విన్యాసం:</nowiki>
 
అలంకార శోభమయమైన ప్రభలు ఊరేగింపుగా బయలుదేరితే, మ్రొక్కుబడులున్న వారు భక్తి శ్రద్ధలతో ప్రభ ముందు నడుస్తారు. ప్రభ ముందు తప్పెట వాయిద్యాన్ని గమకాలతో సాగిస్తూ వుంటే వాయిద్యానికి తగినట్టుగా బండికి కట్టిన ఎద్దులు ఠీవిగా నడుస్తూవుంటే, అలంకరించిన మువ్వల, గజ్జల, గంటల మ్రోతలు తాళానికి అనుగుణంగా మ్రోగినట్లుంటుంది. ఉత్సాహంతో ఠీవిగా నడిచే ఎద్దులు అప్పుడప్పుడు రంకెలు వేస్తూ వుంటే, సంగీత శాస్త్రంలో ఎద్దు వేసే రంకెను, సప్త స్వరాలలో రెండవది అయిన (రిషభం) అని నిర్ణయించారని కీ||శే|| డా. కే.యస్. కేసరి గారు వారి చిన్ననాటి ముచ్చట్ల గ్రంథంలో ఉదహరించారు. రిషభ స్వరం ద్వారా వీరరసం, అద్భుతరసం, రౌద్రరసం వెలువడతాయని వివరించారు.
 
కోడె గిత్తలతో నడుపబడే ఈ ప్రభలను నడిపే వారు యుక్త వయస్సులో వున్న యువకులు, చెర్నాకోలును చేతిలో ధరించి తలకు మంచి తలపాగాను అందంగా చుట్టి ఆహా హై చో... చో అంటూ ఎడ్లను అదిలిస్తూ కోర మీసం దువ్వుతూ చలాకీగా ఎడ్లను తోలుతూ వుంటే పౌరుషంతో కోడె గిత్తలు ముందుకు సాగిపోతాయి. ఇలా బయలు దేరిన ప్రభల బండ్లు ఆయా గ్రామాల గుండా ప్రయాణించేటప్పుడు గ్రామస్థులు ఎదురు వచ్చి కడవలతో స్త్రీలు వార పోయగా, పురుషులు కత్తి చేత బట్టి దండకాలను చదువుతారు. ఇలా చదివేవారు జంగాలు, ఆరాధ్య బ్రాహ్మణులు.
 
;<nowiki>శరభ శరభ:</nowiki>
శైవులు, వీర శైవులు పలు సందర్భాలలో దక్షయజ్ఞ దండకం చదివినట్లె ఇక్కడా చదువుతారు. ఇలా చదివేటప్పుడు ఖడ్గదారులు ప్రభ ముందు నిలబడి వెనకకూ ముందుకు నడుస్తూ ఎగిరెగిరి గంతులు వేస్తూ పరవళ్ళు త్రొక్కుతూ వుంటే పక్క నున్న వాళ్ళు బుంజ వాయిద్యాన్ని తప్పెట వాయిద్యాన్ని వాయిస్తూ, కొమ్ము బూరలనూ, కాహశాలనూ ఊది దండకం చదువరిని వుత్తేజ పరుస్తారు.
=='''పర్యాటక ఆకర్షణలు'''==
కోటప్పకొండ పర్యావరణ పర్యాటక క్షేత్రంగానూ అభివృద్ధి చెందుతోంది. సభాపతి డాక్టర్‌ [[కోడెల శివప్రసాదరావు]] పర్యాటక క్షేత్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే భక్తుల కోసం బోట్‌ షికారు, టాయ్‌ ట్రైన్‌, బోట్‌ షికారు కోసం కాళింది మడుగు, పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఆట వస్తువులతో ఏర్పాటు చేసిన పిల్లల రాజ్యం, అక్వేరియం ప్రత్యేకంగా ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. త్వరలో తీగమార్గం రాబోతోంది. కొండమీద ఒక చిన్న సరసును నిర్మించి దాని మద్యలో కాళీయమర్ధన శిల్పాన్ని నిరించి ప్రత్యేక కాంతి ప్రసారం చేస్తుంటారు. ఇది పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా ఉంది. వివిధ జలసేకరణ ప్రణాళికల ద్వారా ఈ సరసుకు నీటిని సరఫరా చేస్తుంటారు. కృత్రిమ జురాసిక్ పార్క్ మరొక పర్యాటక ఆకర్షణగా ఉంది. ఇక్కడ పెద్ద జురాసిక్‌లను ఏర్పాటు చేసారు. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన నెమళ్ళు, పావురాళ్ళు, ఈమోలు మరియు చిలుకలు కూడా ఉన్నాయి. యాత్రీకుల సౌకర్యార్ధం 30 వసతి గదులు కూడా నిర్మించబడ్డాయి. యాత్రీక ఆకర్షణలలో మరొకటి ధ్యానమందిరం. ఇక్కడ హోమాలు నిర్వహించబడతాయి. ఇందులో విశాలమైన భోజనశాల కూడా ఉంది. వివిధ పర్యాటక కేంద్రాలను పర్యవేక్షించడానికి వీలుగా రోప్ వే త్రవ్వకాలలో లభించిన అవశేషాలను బధ్రపరచిన మ్యూజియం పర్యాటక ఆకర్షణగా ఉంది. కార్తీక మాసం అనగానే సహజంగానే వనభోజనాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు. అనేక పట్టణాల నుంచి, పిల్లల నుంచి పాఠశాలల విద్యార్థులను కార్తీక మాసంలో ఇక్కడ క్షేత్రానికి తీసుకువచ్చి అన్ని చూపించి భోజనాలు ఆయా పాఠశాలల యాజమాన్యాలే ఏర్పాటు చేస్తున్నాయి. ఇవికాకుండా కొండ కింద అన్ని సామాజిక వర్గాలకు అన్నదాన సత్రాలు ఉన్నాయి. ఇక్కడ ఈ సత్రాలకో ప్రత్యేకత ఉంది. గతంలో అయితే పండుగల సమయంలోనే ఉచిత భోజనం ఉంది. ఇప్పుడు భక్తులు ముందుగా వచ్చి చెబితే నిత్యం భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.
 
=='''వసతి సౌకర్యాలు'''==
Line 151 ⟶ 84:
=='''దర్శన సమయాలు'''==
[[దస్త్రం:Sri Trikoteswara Swamy Temple, Kotappakonda.JPG|thumb|300px|right|శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం, కోటప్ప కొండ]]
ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మళ్లీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది.
ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మళ్లీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది. స్వామివారికి అర్చన, ఉచిత దర్శనం సమయంలో తీసుకుంటే రూ.5 టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా ప్రత్యేక దర్శనం రూ.75, అష్టోత్రం రూ.100, అభిషేకం దంపతులకు మాత్రమే రూ.200, పంచ హారతి ఒక్కొక్కరికి రూ.100, పిల్లలకు అన్నప్రాసన చేయిస్తే రూ.150, అక్షరాభ్యాసం చేయిస్తే రూ.150 వీటితో పాటు వాహన పూజలు చేయించుకోవచ్చు. నవగ్రహ పూజ, శనిత్రయోదశి సందర్భాల్లో రూ.200 చెల్లించి పూజలు చేయించుకోవాలి. శాంతి యాదశాల పూజకు రూ.1116లు, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం (ఒకే కుటుంబానికి) రూ.1116లు చెల్లించాల్సి ఉంటుంది. మూలవిరాట్‌ అభిషేకం పర్వదినాల్లో అయితే రూ.400 చెల్లించాలి. ఇవి కాకుండా ప్రత్యేక స్కీములు ద్వారా కూడా స్వామివారికి పూజలు నిర్వహిస్తారు. జీవితకాల అభిషేకం (పదేళ్లు) రూ.2116లు, జీవిత కాల అష్టోత్రం (10 ఏళ్లు) రూ.1116లు, నిత్య గోత్రనామ పథకం ఏడాదికి రూ.1116లు చెల్లించాలి. కొండ వద్ద వసతిగృహాలు ఉన్నాయి. ఆనందవల్లి అతిథిగృహంలో గదికి రూ.250 చెల్లించాలి. తోట వారి అతిథిగృహంలో అయితే రూ.300, నంది అతిథిగృహంలో రూ.750 చొప్పున రుసుములు చెల్లించాల్సి ఉంది.
 
=='''రవాణా సౌకర్యాలు'''==
కోటప్పకొండకు దగ్గరలో కల [[నరసరావుపేట]] పాత బస్ స్టాండు, కొత్త బస్ స్టాండుల నుండి ప్రతి అరగంటకు ఇక్కడకు బస్సు ఉంది. విజయవాడ, గుంటూరు వైపు నుంచి వచ్చే యాత్రికులు చిలకలూరిపేట మీదుగా, నరసరావుపేట మీదుగా కూడా కోటప్పకొండకు చేరుకోవచ్చు. సత్తెనపల్లి, పెదకూరపాడు ప్రాంతాల భక్తులు నరసరావుపేట మీదుగానే కోటప్పకొండకు చేరవచ్చు. మాచర్ల, గురజాల, కారంపూడి యాత్రికులు కూడా నరసరావుపేట మీదుగా కోటప్పకొండకు వెళ్లే మార్గం ఉంది. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, దర్శి, కురిచేడు, త్రిపురాంతంకం, యర్రగొండపాలెం తదితర ప్రాంతాల భక్తులు వినుకొండ మీదుగా నరసరావుపేట వచ్చే మార్గంలో పెట్లూరివారిపాలెం మీదుగా కోటప్పకొండకు చేరవచ్చు. ఇవేకాక ప్రైవెటు వాహనములు కూడా ఈ దారిని ప్రయాణిస్తుంటాయి. కొండ పైకి వెళ్ళుటకు బస్సులు, జీపులు, ఆటోలు దొరకుతాయి. అలాగే డాక్టర్ కోడెల శివప్రసాద్ మంత్రిగా వున్న సమయంలో కోటప్పకొండ మీదకు బస్సు మార్గాన్ని ఏర్పరచి అనేక సౌకర్యాలు కల్పించారు. భక్తులు ఒక్కసారైనా తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం కోటప్పకొండ.
 
=='''కోటప్పకొండపైకి పురాతన మెట్ల మార్గం'''==
గుంటూరు జిల్లా కోటప్పకొండలోని త్రికోటేశ్వరస్వామి వారి దేవాలయానికి చేరుకునే పురాతన మెట్ల మార్గం బయటపడింది. కొండ కింద నుంచి తాగునీటి పైప్ లైన్ ఏర్పాటుకు పనులు చేపట్టిన సందర్భంలో శిథిలావస్థలో ఉన్న మెట్లు బయటపడ్డాయి. తాగునీటి ఎద్దడి నివారణకు కొండ కింద సంపు నిర్మించి కొండపైకి నీటిని పంపింగ్ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కొండపైకి పైప్‌లైన్ ఏర్పాటు చేసేందుకు ముళ్ళ పోదలను తొలగిస్తుండగా ఇవి కనిపించాయి. కమ్మజన సంఘం సత్రం వెనుక వైపు నుంచి నేరుగా కొండమీదకు వెళ్ళే విధంగా కొండ రాళ్ళను మెట్లుగా అమర్చారు.
 
ఈ సోపాన మార్గాన్ని వంద ఏళ్ల కింద వాడారు.. సోపాన మార్గంలో మెట్లను అభివృద్ధి చేసిన తరువాత ఈ దారి ఎవరూ వినియోగించక పోవడంతో.. ఈ ప్రాంత మంతా ముళ్ళ పోదలతో నిండిపోయింది. భక్తులు కోటప్పకొండకు చేరుకునేందుకు రెండు మెట్ల మార్గాలు ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు బయటపడిన మార్గంతో పాటు డిఆర్‌డిఎ శిక్షణా కేంద్రం వెనుక వైపు నుండి మరో మార్గం ఉండేది. ఈ దారిని ఏనుగుల దారి అంటారు. కొండమీదకు అవసరమైన సామాగ్రిని ఏనుగుల ద్వారా కొండమీదకు తరలించే వారని చెబుతారు. అయితే తరువాతి కాలంలో త్రికోటేశ్వరస్వామి వారి దేవస్థానం ట్రస్టీలుగా ఉన్న నరసరావుపేట జమీందార్లు నూతనంగా సోపాన మార్గం నిర్మించారు.
 
దీంతో ఈ మార్గం గుండానే భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. కాలక్రమంలో గతంలో ఉన్న రెండు మెట్ల మార్గాలు కనుమరుగయ్యాయి. ఇప్పుడు బయటపడి న మెట్ల మార్గం పూర్తిగా కొండపైకి లేదు. కొండపైన అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టిన విస్తరణ పనుల్లో ఈ మార్గం మూతబడిపోయింది. కొండపైన ఇప్పుడు ఉన్న క్యాంటిన్ వెనక కొండరాళ్ళతో నింపి విస్తరించడంతో మెట్ల మార్గం దాని కిందకు వెళ్ళిపోయింది. బయటపడిన మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశం లేదని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
==మూలాలు==
<references />
=='''బయటి లింకులు'''==
#[http://www.kotappakonda.com/ కోటప్పకొండ వెబ్గురించిన సైటుబ్లాగ్ సైట్]
 
#[http://www.kotappakonda.com/ కోటప్పకొండ వెబ్ సైటు]
#https://kotappakonda.com/history/
#https://kotappakonda.com/
#http://www.eenadu.net/special-pages/aalayaalu/aalayaalu-inner.aspx?featurefullstory=16893
 
"https://te.wikipedia.org/wiki/కోటప్ప_కొండ" నుండి వెలికితీశారు