కోటప్ప కొండ: కూర్పుల మధ్య తేడాలు

చి cleanup and fix copy violations partly
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 50:
=='''దేవాలయ చరిత్ర'''==
[[బొమ్మ:kotappakonda 1.jpg|thumb|right|త్రికోటేశ్వరస్వామి వారి అంతరాలయ దృశ్యం.]]
చారిత్రక త్రికోటేశ్వర ఆలయం క్రీ.శ 1172 లో నాటికే ప్రసిద్ధి చెందినట్లు వెలనాటి చోళ రాజైన కుళొత్తుంగా చోళరాజు, సామంతుడు మురంగినాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. <ref> {{Cite web |title=మహిమాన్విత క్షేత్రం.. కోటప్పకొండ|url=https://www.eenadu.net/districts/mainnews/37574/Guntur/19/4 |archiveurl=https://web.archive.org/web/20190812041154/https://www.eenadu.net/districts/mainnews/37574/Guntur/19/4|archivedate=2019-08-12|publisher= ఈనాడు |date=2018}}</ref> ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురి రాజులలో ఒకరైన [[శ్రీకృష్ణదేవరాయలు]] దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చాడు. [[నరసరావుపేట]], [[చిలకలూరిపేట]], [[అమరావతి]] మరియు ఇతరులు దేవాలయాభివృద్ధికి అనేక విధాలుగా దానాలు చేసారు. కోటప్ప కొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి [[ఆలయం]] 600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయాన్ని భక్తులు కొండపైకి ఎక్కడానికి 703 మెట్లతో మెట్లమార్గాన్ని క్రీ.శ.1761లో నరసరావుపేట జమీందారు '''శ్రీ రాజా మల్రాజు నరసింహరాయణి''' నిర్మింపజేశారు. ఈ ఆలయానికి నరసరావుపేట సంస్థానాధీశులు రాజా మల్రాజు వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలూ చేసారు. వాహనాలలో వెళ్ళడానికి 1999లో డాక్టర్ కోడెల శివప్రసాదరావు మంత్రిగా ఉన్న సమయంలో గుడి దాకా చక్కని ఘాట్ రోడ్డు వేయించారు. ఘాట్ రోడ్డు మొదట్లో విజయ గణపతి, సాయిబాబా ఆలయాలు, రోడ్డు ఇరువైపులా ఏంతో అందమైన పూలతోటలు, తోవలో మ్యూజియం, జింకల పార్కు, పిల్లల కోసం పార్కు, ఒక సరస్సు, మధ్య చిన్ని కృష్ణుడు కాళీయమర్దనం చేసే విగ్రహం, దూరంనుంచే చూస్తే ఆకర్షించే బ్రహ్మ, లక్ష్మీనారాయణులు, వినాయకుడు, ముగ్గురమ్మలు (లక్ష్మి, సరస్వతి, పార్వతి ఒక్కచోట ఉంటారు).. ఇలా పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేసారు.
 
యాత్రీకులు సాధారణంగా శ్రీ రాజా మల్రాజు నరసింహరాయలు నిర్మించిన మార్గంలో ప్రయాణించి ఆలయం చేరుకుంటారు. ఈ కొండను ఏ కోణం నుండి చూసినా (త్రికూటాలు) మూడు శిఖరాలు కనపడుతుంటాయి. కనుక దీనికి త్రికూటాచలమని పేరు వచ్చింది. అందువలన ఇక్కడి స్వామి త్రికూటాచలేశ్వరుడు అయ్యాడు. ఈ మూడు శిఖరాలు [[బ్రహ్మ]], [[విష్ణు]], రుద్ర రూపాలుగా భావించబడుతుంటాయి. పురాణ కథనాలను అనుసరించి దక్షాయజ్ఞం భగ్నం చేసిన తరువాత పరమశివుడు తనకు తాను చిన్న బాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపస్సు ఆచరించిన సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో [[దక్షిణామూర్తి]]ని సందర్శించి, ప్రార్థించి తమకు జ్ఞానభోధ చెయ్యమని కోరాడు.
పంక్తి 67:
 
శివభక్తుడైన సాలంకయ్యకు శివఅనుగ్రహంతో ఐశ్వర్యం లభిస్తుంది.  పరమేశ్వరుడు కొన్ని రోజుల పాటు జంగమదేవర రూపంలో అతని ఇంటికి వచ్చేవాడు. కొన్నాళ్లకు కనిపించలేదు. దీంతో సాలంకయ్య నిరాశ చెందాడు. ఆ సమయంలోనే త్రికూటాచల దక్షిణాన ‘’కొండ కావూరు‘’ గ్రామంలో యాదవ వంశంలో సుందరి సునందలకు గారాలబిడ్డగా ‘’ఆనంద వల్లి‘’ అనే పాప జన్మించింది. చిన్న నాటి నుంచే శివభక్తిలో లీనమయ్యేది. రుద్రాక్షమాలలు ధరించేది. ఆధ్యాత్మిక భావాలను బోధించేది. పెరిగే కొద్దీ శివునిపై భక్తి పెంచుకొని శైవగీతాలు ఆలపించేది. . ఆనందవల్లి ప్రతిరోజూ రుద్రాచలానికి వచ్చి శివలింగానికి పూజలు నిర్వహించేది. ఒక శివరాత్రి నాడు ఆమె ఓంకార నదిలో స్నానం చేసి రుద్ర శిఖరం చేరి త్రికూటేశ్వరుని దర్శించి, బిల్వ వృక్షం కింద తపస్సులో ఉండగా, సంగతి తెలుసుకున్న సాలంకయ్య తనకు కూడా శివదర్శనం ఇప్పించాలని కోరాడు. అయితే ఆమె అంగీకరించక శివుని ఆరాధనలో కొనసాగింది. ఒక రోజు అభిషేకం కోసం జలం తీసుకువెళుతుండగా నీటి కొరకు ఒక కాకి బిందె మీద వాలింది. దీంతో ఆగ్రహించి కాకులు ఇక్కడకు రాకూడదని శాపం పెట్టింది. ఇప్పటికీ కాకులు ఈ క్షేత్రంలో రాకపోవడం విశేషం. ఆమె భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఆమెను కుటుంబ జీవితం కొనసాగించమని బ్రహ్మచారిణిగా ఉన్న ఆమెను గర్భవతిగా మారుస్తాడు. అయినా ఆమె శివారాధన చేయడం మానలేదు. ఆమె భక్తికి మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై తానే ఆమె వెంట వచ్చి పూజలు స్వీకరిస్తానని అయితే ఇంటికి వెళ్లే సమయంలో తిరిగి చూడకుండా వెళ్లాలని ఆజ్ఞాపిస్తాడు. ఆనందవల్లి కొండ మెట్లు దిగుతూ ఒక చోట కుతూహలం కొద్దీ వెనక్కు తిరిగి చూడటంతో స్వామి వెంటనే అక్కడ వున్న గుహాలో లింగరూపం ధరించాడు. ఆనందవల్లికి కుమారుడు జన్మించాడు. తాను వెనక్కు తిరిగిచూడటంపై ఆనందవల్లి బాధపడింది. మరణానికి సిద్ధం కావడంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ఆ సమయంలో బాలుడు కూడా అదృశ్యమవుతాడు. ఇదంతా శివమాయ అని ఆనందవల్లి గ్రహిస్తుంది. అనంతరం ఆమె భక్తీ కి సంతసించి జంగమయ్య శివైక్యాన్ని ప్రసాదించాడు.
 
 
 
 
 
 
=='''ప్రభల ఉత్సవ సంబరాలు'''==
"https://te.wikipedia.org/wiki/కోటప్ప_కొండ" నుండి వెలికితీశారు