కార్బన్-14: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా , , → , (2) using AWB
ట్యాగు: 2017 source edit
పంక్తి 14:
== రేడియోకార్బన్ డేటింగ్ ==
సుమారు 60,000 సంవత్సరాల నాటి కర్బనమత పదార్థాల వయస్సును కార్బన్-14 (<sup>14</sup>C) ఉపయోగించి గణించుటకు ఉపయోగించే పద్ధతిని రేడియోధార్మిక డేటింగ్ అంటారు. ఈ విధానాన్ని చిగాగో విశ్వావిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ విల్లార్డ్ లిబ్బీ మరియు అతని సహచరులు 1949లో అభివృద్ధి చేసారు. <ref>{{cite journal|author1=Arnold, J. R.|author2=Libby, W. F.|year=1949|title=Age Determinations by Radiocarbon Content: Checks with Samples of Known Age,|journal=Science|volume=110|pages=678–680|pmid=15407879|doi=10.1126/science.110.2869.678|issue=2869|bibcode=1949Sci...110..678A}}</ref> ఒక గ్రాము స్వచ్ఛమైన కార్బన్ యొక్క మార్చుకోదగిన కార్బన్-14 నిమిషానికి 14 రేడియోధార్మిక పరివర్తనాలు చెందుతుందని లిబ్బీ అంచనావేశాడు. ఇది నవీన రేడియోకార్బన్ ప్రామాణితకు ఇప్పటికీ ఉపయోగపడుతుంది. <ref>{{cite web|url=http://www.c14dating.com/agecalc.html|title=Carbon 14:age calculation|accessdate=2007-06-11|publisher=C14dating.com|archiveurl=https://web.archive.org/web/20070610195000/http://www.c14dating.com/agecalc.html|archivedate=2007-06-10|deadurl=no|df=}}</ref><ref>{{cite web|url=http://www.ldeo.columbia.edu/~martins/isohydro/c_14.html|title=Class notes for Isotope Hydrology EESC W 4886: Radiocarbon <sup>14</sup>C|accessdate=2007-06-11|publisher=Martin Stute's homepage at Columbia|archiveurl=https://web.archive.org/web/20060924135028/http://www.ldeo.columbia.edu/%7Emartins/isohydro/c_14.html|archivedate=2006-09-24|deadurl=no|df=}}</ref> 1960లో ఈ కృషికి రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది.
 
కార్బన్ మామూలుగా రేడియో ఆక్టివ్ ధాతువు కాదు. దాని అణు భారం 12. కానీ దానికి కూడా ఐసోటోప్స్ అనబడే రకాలున్నాయి. కార్బన్(14) అనేది రేడియో యాక్టివ్ ధాతువు. దీని హాఫ్ లైఫ్ సుమారు 5720 ఏళ్ళు. అంటే.. కొంత కార్బన్(14)ను తీసుకుంటే అందులో సగం అణువులు విచ్చిన్నమై నైట్రోజన్ గా మారుతుంది.
 
రేడియో యాక్టివ్ కార్బన్ (14) వాతావరణపు పై పొరలలో నైట్రోజన్ ను కాస్మిక్ కిరణాలు ఢీ కొట్టినప్పుడు ఏర్పడుతుంది. మామూలు కార్బన్ (12) ప్రాణ వాయువుతో కలిసి కార్బన్ డయాక్సైడ్ గా ఏర్పడినట్లే, రేడియో కార్బన్ కూడా ప్రాణవాయువుతో కలిసి రేడియో కార్బన్ డయాక్సైడ్ గా ఏర్పడుతుంది.
 
వృక్షాలు కార్బన్ డయాక్సైడ్ ను ఉపయోగించుకొని ఆహారం తయారు చేసుకుంటాయి కదా. అవి మామూలు కార్బన్ డయాక్సైడ్ తోపాటు, స్వల్పంగా రేడియో కార్బన్ డయాక్సైడ్ ను కూడా స్వీకరిస్తాయి. అంటే ప్రతి వృక్షంలోనూ, లేదా శాకాహారం తిన్న ప్రతి జంతువులోనూ మామూలు కార్బన్ డయాక్సైడ్ తో పాటు, రేడియో కార్బన్ డయాక్సైడ్ వుండి ఉంటుంది.
 
పురావస్తు ప్రదేశాల నుండి సేంద్రీయ అవశేషాలను తరచుగా డేటింగ్ చేసే పద్ధతులలో ఇది ఒకటి. మొక్కలు వాతావరణంలోని కార్బన్‌ను కిరణజన్య సంయోగక్రియ ద్వారా పొందుతాయి. కనుక మొక్కలు మరియు జంతువులలో <sup>14</sup>C స్థాయి అవి మరణించేనాటికి అప్పటికి వాతావరణంలో ఉన్న <sup>14</sup>C స్థాయితో సుమారు సమానంగా ఉంటుంది. ఏదేమైనా రేడియోధార్మిక క్షయం వల్ల ఈ స్థాయి క్రమంగా తగ్గిపోతుంది. దీని ఆధారంగా వాటి మరణించే తేదీని అంచనా వేస్తారు. దీని గణన కోసం ప్రారంభ <sup>4</sup>C స్థాయి అంచనావేయబడుతుంది లేదా 10,000 సంవత్సరాల క్రియం చెట్ల వలయాల సమాచారం నుండి నేరుగా పోల్చబడుతుంది లేదా 45,000 సంవత్సరాల క్రితం నుండి గుహ నిక్షేపాల నుండి అంచనావేయబడుతుంది.
 
కృత్రిమ రేడియోధార్మికతను ఉపయోగించి శిలాజాల వయస్సును తెలుసుకొనే పద్ధతి రేడియోధార్మిక డేటింగ్. ఇక్కడ <sup>14</sup>C (కార్బన్) ని ఉపయోగిస్తారు. <sup>14</sup>C అర్థజీవిత కాలం సుమారు 5730 సంవత్సరాలు. విశ్వకిరణాలు (కాశ్మిక్ కిరణాలు) చర్య వలన వాతావరణంలో నైట్రోజనులో నుండి <sup>14</sup>C అవిచ్ఛిన్నంగా తయారవుతుంది. <sup>14</sup>C ని జీవరాసులు మరియు మొక్కలు సహజ <sup>12</sup>C తో పాటుగా అవిచ్ఛిన్నంగా శోషిస్తాయి. జీవించి ఉన్న జీవరాశులలో <sup>14</sup>C / <sup>12</sup>C ల నిష్పత్తి ఒక స్థిరాంకం. జీవరాశుల మరణానంతరం, వాటిలో ఉన్న <sup>14</sup>C పరిమాణం ప్రతిక్షేపించబడకుండా విఘటనం చెందును, మరియు నిష్పత్తి తగ్గును. కావున <sup>14</sup>C / <sup>12</sup>C ల నిష్పత్తి గణించి శిలాజాల వయస్సును నిర్ణయించవచ్చు. ఈ పద్ధతిని కార్బన్ డేటింగ్ అంటారు.కానీ ఈ రేడియో కార్బన్ అర్ధాయువు చాలా తక్కువ కాబట్టి ఈ పద్దతి వల్ల సుమారు 50 వేల ఏళ్ల కిందటి అవశేషాల కాలాన్ని మాత్రమే కనుక్కోవటానికి వీలౌతుంది.
 
== మూలం ==
"https://te.wikipedia.org/wiki/కార్బన్-14" నుండి వెలికితీశారు