విజయవాడ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 237:
విజయవాడలో ఎఫ్.ఎమ్. రేడియో స్టేషన్లు : ఏ.ఐ.ఆర్ (AIR) రెయిన్‌బౌ కృష్ణవేణి ఎఫ్‌ఎమ్ (102.2 MHz), [[రేడియో మిర్చి]] ఎఫ్‌ఎమ్ (98.3 MHz) మరియు రెడ్.ఎఫ్.ఎమ్. (RED FM) (93.5 MHz).
 
===సినిమా====
విజయవాడ నగర సంస్కృతిలో సినిమాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. 1921లోనే నగరంలో ప్రారంభమైన మారుతీ హాలుతో సినిమాల ప్రదర్శన ప్రారంభమైంది. దుర్గా కళామందిరం (1923), రామా టాకీసు (1929) వంటి సినిమా హాళ్ళు తెలుగు సినిమా టాకీలు ప్రారంభం కావడానికి ముందే విజయవాడలో వెలిశాయి. తెలుగు సినిమా రంగం ప్రారంభమయ్యాకా నిర్మాణ కేంద్రం కాలేకపోయినా పంపిణీ కేంద్రంగా విజయవాడ అభివృద్ధి చెందింది. దానితో పాటుగా తెలుగు సినిమా రంగంపై చర్చాగోష్టులు, సమావేశాలు, అభిమాన సంఘాలు,. సినిమా పత్రికలు వంటివాటన్నిటికీ కూడా స్థానంగా నిలిచింది. తెలుగు సినిమాల్లో విజయవాడతోనూ, పరిసర ప్రాంతాలతో అనుబంధం ఉన్న [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.రామారావు]], [[అక్కినేని నాగేశ్వరరావు]], [[సావిత్రి (నటి)|సావిత్రి]] వంటి నటీనటులు మంచి పేరు సంపాదించారు. నగరంలో విజయవాడ ఫిలిం సొసైటీ ఏర్పడి ఉత్తమ చిత్రాలను ఆదరించేలా ప్రేక్షకుల్లో అభిరుచి పెంపొందించాలన్న లక్ష్యంతో చాలాకాలం పనిచేసింది. ఈ పరిణామాలన్నీ నగర జన జీవితంలో సినిమా ప్రభావం చూపడానికి దోహదపడ్డాయి.{{Sfn|జాన్సన్ చోరగుడి|2000|p=16}}{{Sfn|జాన్సన్ చోరగుడి|2000|p=17}}
 
 
=== ముద్రణ ===
"https://te.wikipedia.org/wiki/విజయవాడ" నుండి వెలికితీశారు