గ్రామం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 186:
 
===భారత దేశ గ్రామ రకాలు===
====రెవిన్యూ గ్రామం====
భారతదేశంలో భూమి సర్వే జరిగినపుడు, కొన్ని సర్వే ప్రాంతాలను అక్కడ వున్న జనావాసంపేరుతో రెవిన్యూ గ్రామంగా నిర్ణయించారు. అంటే ప్రభుత్వం ఆదాయం లెక్కకు నిర్దేశించినదన్నమాట.
 
====గ్రామపంచాయితీ====
పంచాయితీరాజ్ స్వపరిపాలన వ్యవస్థలో అట్టడుగు స్థాయి విభాగం గ్రామ పంచాయితీ, రెవిన్యూ గ్రామం పూర్తిగా గాని లేక కొంతవరకు మిగతా రెవిన్యూ గ్రామాల భాగాలతో కలసి గాని, మండలంలో కొన్ని జనావాసాలను గ్రామపంచాయితీగా గుర్తిస్తారు.
 
====శివారు గ్రామాలు====
రెవిన్యూ గ్రామానికి గాని గ్రామపంచాయితీకి గాని సమీపంలో నిర్దిష్టంగా జనావాసం వుంటే దానిని శివారు గ్రామమంటారు. వీటిలో జనసంఖ్య, ఇళ్లు తక్కువగా వుంటాయి.
 
====నిర్జన గ్రామం====
కొన్ని రెవిన్యూ గ్రామాలుగాని గ్రామ పంచాయితీలు గాని, విపత్కర పరిస్థితులలో లేక కొన్ని ప్రజోపయోగ ప్రాజెక్టుల( ఉదా:జలాశయం నిర్మించినపుడు ముంపుకు గురయ్యే గ్రామాలు) కొరకు ఖాళీ చేయబడతాయి. వాటిని నిర్జన గ్రామాలంటారు.
 
"https://te.wikipedia.org/wiki/గ్రామం" నుండి వెలికితీశారు