విజయవాడ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 242:
=== ముద్రణ ===
 
''[[విశాలాంధ్ర]]'' విజయవాడ నుండి ప్రారంభమైన తొలి తెలుగు వార్తాపత్రిక.<ref>{{cite news|last1=Correspondent|first1=Special|title=‘Visalandhra maintaining quality of information’|url=http://www.thehindu.com/news/cities/Visakhapatnam/visalandhra-maintaining-quality-of-information/article4843187.ece|accessdate=5 June 2017|work=The Hindu|language=en}}</ref> 2013–14 వార్షిక ప్రెస్ నివేదిక ప్రకారం, విజయవాడనుండి వెలువడే పెద్ద, మధ్యమ వార్తాపత్రికలలో ''[[ఆంధ్రజ్యోతి]]'', ''[[ఈనాడు]]'', ''[[సాక్షి]]'', ''[[సూర్య]]'', ''[[ఆంధ్రప్రభ]]'', ''[[వార్త]]'', ''ప్రజాశక్తి'', ''ఉదయ భారతం'' వున్నాయి. టీవీ ఛానెళ్ళు అభివృద్ధి చెంది వాటి స్థానాన్ని తీసుకునేవరకూ విజయవాడ నగరంలో పలు పత్రికల సాయంకాలం ఎడిషన్లు, కొన్ని ప్రత్యేకమైన సాయంకాలం పత్రికలు తాజా వార్తలు అందించేవి.{{Sfn|జాన్సన్ చోరగుడి|2000|p=15}}
 
విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ లో ప్రచురితమయ్యే అనేక ప్రచురణల కేంద్రం. ఓ అంచనా ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో ప్రచురితమయ్యే పుస్తకాలలో 90% పుస్తకాలు ఇక్కడినుండే ముద్రితం మరియు ప్రచురితమౌతున్నాయి. విజయవాడ పుస్తక ఉత్సవం, ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంది. ఈ ఉత్సవం దేశంలోనే [[కోల్కతా]] తరువాత, రెండవ అతిపెద్ద ఉత్సవం. విశాలాంధ్ర, [[ప్రజాశక్తి]], [[నవోదయ]], [[జయంతి]],అరుణ ప్రచురణ సంస్థలు ఉన్నాయి.
 
విజయవాడలో పుస్తక ప్రచురణ సంస్థలు, పుస్తకాల షాపులు, గ్రంథాలయాలు సాహిత్య వాతావరణాన్ని కల్పించాయి. 1903లో ఇ.సుబ్బుకృష్ణయ్య ఆస్తిక పుస్తక భాండాగారం పేరిట గ్రంథాలయాన్ని స్థాపించాడు. 1916లో దీనిని బకింగ్ హాం పేటలోని శాశ్వత భవనంలోకి మార్చి, శ్రీ రామ్మోహన ధర్మ పుస్తక భాండాగారంగా పేరు మార్చారు. దీన్నే సాధారణంగా [[శ్రీ రామ్మోహన గ్రంథాలయం]]<nowiki/>గా వ్యవహరిస్తారు. [[ఉప్పు సత్యాగ్రహం]]<nowiki/>లో పాల్గొని లాఠీ దెబ్బలు తిని, జైల్లో మరణించిన [[వెలిదండ్ల హనుమంతరావు]] పేరుమీదుగా [[హనుమంతరాయ గ్రంథాలయం]] 1934 డిసెంబరు 2న ప్రారంభమైంది. చిరకాలం నుంచి ఈ గ్రంథాలయాలు నగరంలో సాంస్కృతిక కేంద్రాలుగా విలసిల్లాయి. హనుమంతరాయ గ్రంథాలయానికి అధ్యక్షులుగు నగరంలో పలువురు రాజకీయవేత్తలు, విద్యావేత్తలు వ్యవహరించి అభివృద్ధి చేశారు.{{Sfn|జాన్సన్ చోరగుడి|2000|p=14}}
 
తెలుగువారికి పత్రికా రంగానికి ప్రధానమైన కేంద్రంగా విజయవాడ 20వ శతాబ్ది మధ్యభాగం నుంచి అభివృద్ధి చెందింది. టీవీ ఛానెళ్ళు అభివృద్ధి చెంది వాటి స్థానాన్ని తీసుకునేవరకూ విజయవాడ నగరంలో పలు పత్రికల సాయంకాలం ఎడిషన్లు, కొన్ని ప్రత్యేకమైన సాయంకాలం పత్రికలు తాజా వార్తలు అందించేవి.{{Sfn|జాన్సన్ చోరగుడి|2000|p=15}}
 
== రాజకీయాలు ==
"https://te.wikipedia.org/wiki/విజయవాడ" నుండి వెలికితీశారు