హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 78:
[[దస్త్రం:Muhammad Quli Qutb Shah portrait.JPG|thumb|left|[[మహమ్మద్ కులీ కుతుబ్ షా]], 5వ [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్ షాహీ]] సుల్తాన్, హైదరాబాదు నగర స్థాపకుడు.]]
 
హైదరాబాదును [[మూసీ నది]] ఒడ్డున క్రీ.శ.[[1590]] దశకంలో, [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్ షాహీ]] వంశస్థుడయిన, [[మహమ్మద్ కులీ కుతుబ్ షా]] నిర్మించాడు<ref name=history>[http://hyderabad.ap.nic.in/history.htm హైదరాబాదు అధికారిక వెబ్‌సైటు] నుండి హైదరాబాదు చరిత్ర గురించి 29/10/2000న సేకరించబడినది.</ref>. [[గోల్కొండ]]లోని నీటి సమస్యకు సమాధానంగా పరిపాలనను ఇక్కడకు మార్చారని చరిత్రకారులు చెబుతారు. ఇక్కడి నుండే కుతుబ్ షాహీ వంశస్తులు ఇప్పటి [[తెలంగాణ]] ప్రాంతాన్ని మరియు [[ఆంధ్రప్రదేశ్]], [[కర్ణాటక]], [[మహారాష్ట్ర]]లలోని కొన్ని భాగాలను పాలించారు.<ref name="Plunkett">ఆర్.ప్లంకెట్, టి.కాన్నన్, పి.డేవిస్, పి.గ్రీన్‌వే మరియు పి.హార్డింగ్‌లు, (2001)లో రాసిన [http://books.google.com/books?ie=UTF-8&hl=en&id=JmL9KqczbRYC Lonely Planet South India] అనే పుస్తకములోని 419వ పేజీ నుండి 5/3/2006న సేకరించబడినది. ప్రచురణకర్తలు: Lonely Planet <!-- id = ISBN 1-86450-161-8 --></ref>
400 సంవత్సరా లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన అతి గొప్ప నగరమది. కుతు బ్‌షాహికుతుబ్‌షాహి నవాబులు నిర్మించిన ఈ నగరం తొలుత [[చించలం]] (ఇప్పుడు [[శాలిబండ]] ) పేరుతో చిన్న గ్రామంగా ఉండేది. 1590లో కలరా మహమ్మారి సోకి గోల్కొండ నగరం అత లాకుతలమయింది. నవాబ్ [[కులీ కుతుబ్ షా]] అక్కడి నుంచి చించలం గ్రామానికి తరలి వచ్చి తాత్కాలికంగా బస చేశాడు. వ్యాధి బెడద తగ్గిన తరువాత తిరిగి గోల్కొండ వెళుతూ తన బసకు గుర్తుగా 1591లో చార్మినార్ నిర్మించాడు. ఆ తర్వాత 1594లో నాల్గవ ఖలీఫా హజరత్ [[హైదర్ అలీ]] పేరిట నగరం నిర్మించాడు. 17వ శతాబ్దంలో హైదరాబాద్‌ను సందర్శించిన ఇటాలి యన్ యాత్రికుడు [[టావెర్నియర్]] నగరంలోని ఉద్యానవనముల శోభకు అమితంగా ముగ్ధుడయ్యాడు. హైదరాబాద్ నిజానికి 'బాగ్‌నగర్' అని శ్లాఘించాడు. ఉద్యాన వనాలకేకాక సరస్సులకు కూడా హైదరాబాద్ పెట్టింది పేరు.దేశానికి స్వాతంత్య్రం లభించేనాటికే హైదరాబాద్ సకల వసతులు కల రాజధాని నగరం. శాసనసభా భవనం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు, విమానాశ్రయం, కంటోన్మెంటు, విశాలమైన కార్యాలయాలు, అతిథి గృహాలు, చక్కని డ్రైనేజి వ్యవస్థ, నిరంతరం ఉచిత మంచినీటి సరఫరా వ్యవస్థ, సిమెంట్ రోడ్లు, డబుల్ డెక్కర్ బస్సులు, డీజిల్ రైలు, కారు వ్యవస్థ, రేడియో స్టేషను, టంకశాల, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు మొదలైన సౌకర్యాలు అప్పటికే ఏర్పాటై ఉన్నా యి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ కూడా పార్లమెంటు భవనం లేకపోవడం మినహా దేశరాజధాని కావడానికి హైదరాబాద్‌కు అన్ని అర్హతలూ ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సంవత్సరానికి ఒకసారైన పార్లమెంటు సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించాలని ఆయన సూచించారు. అంబేద్కర్ సూచన మేరకే బొల్లారంలో రాష్ట్రపతి నిలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.1956లో హైదరాబాద్ దేశంలో ఐదవ పెద్ద నగరంగా ఉండేది. ఇప్పుడు ఆరవ పెద్ద నగరంగా ఉంది. రాష్ట్రాల పునర్విభజన జరిగినప్పుడు హైదరాబాద్ రాష్ట్రం నుంచి కర్ణాటకకు మూడు జిల్లాలు, మహారాష్ట్రకు ఐదు జిల్లాలు బదిలీ అయ్యాయి. విభజన తర్వాత కర్నూలులో తగిన వసతులు లేక ప్రభుత్వ కార్యాలయాలు చాలా భాగం మద్రాసులోనే ఉండిపోయాయి. అందువల్ల అన్ని వసతులు ఉన్న హైదరాబాద్‌ను రాజధానిగా ఏర్పాటుచేశారు.
=== పేరు పుట్టుక ===
మహమద్ కులీ కుతుబ్‌షా [[భాగమతి]] అనే బంజారా స్త్రీని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఆ తరువాత ఆవిడ పేరు మీదనే భాగ్యనగర్ అని పేరు పెడతాడు. పెళ్ళయిన తరువాత భాగమతి ఇస్లాం మతం స్వీకరించి, [[హైదర్ మహల్]] అని పేరు మార్చుకుంటుంది. దానిని అనుసరించి నగరం పేరు కూడా హైదరాబాదుగా (అనగా హైదర్ యొక్కనగరం) రూపాంతరం చెందింది<ref name=itlname>[http://www.indiatraveltimes.com/legend/sultan.html హైదరాబాదుకు ఆ పేరు ఎలా వచ్చింది] ఇండియా ట్రావెల్ టైంస్ సైటు నుండి [[మే 12]], [[2007]]న సేకరించబడినది</ref>. ఉర్దూ భాషాయుక్తంగా చూస్తే హైదరాబాదు పేరు వెనక మరొక అర్థం ఉంది. హైదర్ (రాజు పేరు) ఎక్కడయితే ఆబాదు (ప్రఖ్యాతి) అయ్యాడో ఆ నగరమే హైదరాబాదు అని ప్రతీతి.
[[దస్త్రం:Golkonda fort overlooking city.JPG|thumb|left|250px|[[గోల్కొండ|గోల్కొండ కోట]]పై నుండి హైదరాబాదు నగరం]]
 
=== భారత స్వాతంత్ర్యం అనంతరం ===
[[1947]]లో భారతదేశంలో ఆంగ్లేయుల పాలన అంతమయిన తరువాత అప్పటి నిజాము స్వతంత్రంగా పాలన సాగించాలని నిర్ణయించాడు. వ్యాపార, వాణిజ్యాలు స్థిరముగా ఉండేందుకు హైదరాబాదు రాజ్యానికి అన్ని వైపులా ఉన్న భారత దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటి తెలంగాణా కమ్యునిస్టులు హైదరాబాదును భారత దేశంలో కలుపుటకు, నిజాము సొంత సైన్యమయిన రజాకర్ల మీద చేసిన పోరాటం వలన శాంతి భద్రతలు క్షీణించాయి. పెరిగిన హింస కారణంగా అప్పటి మద్రాసు రాష్ట్రంలో ఉన్న కోస్తా ఆంధ్ర ప్రాంతానికి వలసలు బాగా పెరిగినాయి. అటువంటి సమయంలోనే, అప్పటి గృహమంత్రి, [[సర్దార్ వల్లభాయి పటేల్]] నేతృత్వంలో భారతదేశం ఆపరేషన్ పోలో పేరుతో [[హైదరాబాదుపై పోలీసు చర్య|పోలీసు చర్య]]కు ఉపక్రమించింది. [[సెప్టెంబరు 17]], [[1948]]న, అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం తరువాత, హైదరాబాదులో ఐదు రోజుల పోలీసు చర్య జరపడం వల్ల హైదరాబాదు భారతదేశంలో కలిసింది. భారతదేశంలో అంతర్భాగమయిన తరువాత '''ఎనిమిది సంవత్సరాలపాటు ([[సెప్టెంబరు 17]], [[1948]] నుండి [[1956]] [[నవంబర్ 1]]వరకు) హైదరాబాదు ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉంది.''' [[1956]] [[నవంబర్ 1]]న భారత దేశాన్ని భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజించినపుడు హైదరాబాదు రాష్ట్రం మూడు భాగాలుగా విడి [[ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ|ఆంధ్ర ప్రదేశ్]], [[మహారాష్ట్ర]], [[కర్ణాటక]] లలో కలిసిపోయింది. హైదరాబాదు నగరం మరియు దాని చుట్టుపక్కల తెలుగు మాట్లాడే ప్రాంతాలు [[ఆంధ్ర ప్రదేశ్]]లో కలిసాయి, అంతేకాదు హైదరాబాదు ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అయింది.
 
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు" నుండి వెలికితీశారు