హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 87:
[[1947]]లో భారతదేశంలో ఆంగ్లేయుల పాలన అంతమయిన తరువాత అప్పటి నిజాము స్వతంత్రంగా పాలన సాగించాలని నిర్ణయించాడు. వ్యాపార, వాణిజ్యాలు స్థిరముగా ఉండేందుకు హైదరాబాదు రాజ్యానికి అన్ని వైపులా ఉన్న భారత దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటి తెలంగాణా కమ్యునిస్టులు హైదరాబాదును భారత దేశంలో కలుపుటకు, నిజాము సొంత సైన్యమయిన రజాకర్ల మీద చేసిన పోరాటం వలన శాంతి భద్రతలు క్షీణించాయి. పెరిగిన హింస కారణంగా అప్పటి మద్రాసు రాష్ట్రంలో ఉన్న కోస్తా ఆంధ్ర ప్రాంతానికి వలసలు బాగా పెరిగినాయి. అటువంటి సమయంలోనే, అప్పటి గృహమంత్రి, [[సర్దార్ వల్లభాయి పటేల్]] నేతృత్వంలో భారతదేశం ఆపరేషన్ పోలో పేరుతో [[హైదరాబాదుపై పోలీసు చర్య|పోలీసు చర్య]]కు ఉపక్రమించింది. [[సెప్టెంబరు 17]], [[1948]]న, అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం తరువాత, హైదరాబాదులో ఐదు రోజుల పోలీసు చర్య జరపడం వల్ల హైదరాబాదు భారతదేశంలో కలిసింది. భారతదేశంలో అంతర్భాగమయిన తరువాత '''ఎనిమిది సంవత్సరాలపాటు ([[సెప్టెంబరు 17]], [[1948]] నుండి [[1956]] [[నవంబర్ 1]]వరకు) హైదరాబాదు ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉంది.''' [[1956]] [[నవంబర్ 1]]న భారత దేశాన్ని భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజించినపుడు హైదరాబాదు రాష్ట్రం మూడు భాగాలుగా విడి [[ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ|ఆంధ్ర ప్రదేశ్]], [[మహారాష్ట్ర]], [[కర్ణాటక]] లలో కలిసిపోయింది. హైదరాబాదు నగరం మరియు దాని చుట్టుపక్కల తెలుగు మాట్లాడే ప్రాంతాలు [[ఆంధ్ర ప్రదేశ్]]లో కలిసాయి, అంతేకాదు హైదరాబాదు ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అయింది.
== భౌగోళికము ==
{{infobox mapframe|zoom=12 |frame-width=512|frame-height=400}}
హైదరాబాదు దాదాపు [[తెలంగాణ]] రాష్ట్రము మధ్య ప్రాంతములో ఉంది. ఇది [[దక్కను పీఠభూమి]]పై సముద్రమట్టము నుండి 541 మీ. (1776 అడుగులు) ఎత్తులో ఉంది. సుమారుగా ఈ నగర వైశాల్యం 260 చ.కి.మీ. (100 చ.మైళ్ళు).
 
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు" నుండి వెలికితీశారు