ఈనాడు: కూర్పుల మధ్య తేడాలు

→‎శీర్షికలు, విశిష్టతలు: ఈ విభాగంలో అవసరంలేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 36:
పరిశోధనాత్మక వార్తలకు ఈనాడు పేరెన్నికగన్నది. [[1978]], [[1983]] మధ్య కాలంలో ఎన్నో సంచలనాత్మక పరిశోధనలతో అలజడి సృష్టించింది, ఈనాడు. [[సిమెంటు]] కుంభకోణం, [[టిటిడి]]లో మిరాశీదార్ల అక్రమాలు, భూకబ్జాలు మొదలైన వాటినెన్నిటినో వెలుగులోకి తెచ్చింది ఈనాడు. 1983లో [[తెలుగు దేశం]] పార్టీ అధినేత [[నందమూరి తారక రామారావు|రామారావు]] అధికారంలోకి రావడంలో ఈనాడు ప్రముఖ పాత్ర పోషించింది. రామారావు పర్యటనలకు, ప్రకటనలకు విస్తృత ప్రచారం కల్పించింది.<ref>[http://www.cscsarchive.org:8081/MediaArchive/clippings.nsf/(docid)/8925453A49DBC9EBE5256B800039F298 A Newspaper Ensured NTR's Victory - The Onlooker, 01-02-1983]</ref> [[1993]], [[1994]]లలో జరిగిన మధ్యనిషేధ ఉద్యమంలో మహిళల పక్షాన నిలిచి పోరాటం చేసింది. ఆ సమయంలో ఉద్యమం కొరకు ఒక పేజిని ప్రత్యేకించింది, ఈనాడు. [[గుజరాత్]] [[భూకంపం]], [[హిందూ]] మహాసముద్ర [[సునామి]] వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ఈనాడు తన వంతుగా సహాయం చేసింది.
 
1989 [[జనవరి]] 26న గ్రామీణ వార్తల కొరకు మినీ ఎడిషన్లని ప్రారంభించింది. గ్రామీణ స్థాయిలో విలేకరుల వ్యవస్థని ప్రారంభించిన తొలిపత్రికగా పేరుపొందింది. తన రాష్ట్రం, తన జిల్లా వార్తల వరకే పరిమితమైన తెలుగు పాఠకులు తన గ్రామంలో జరిగిన వార్తలను కూడా పత్రికలలో చదవడం మొదలు పెట్టారు. ఈ సంప్రదాయాన్ని మిగిలిన పత్రికలూ అనుసరించాయి.

ఆదివారం అనుబంధాన్ని 28 [[పిభ్రవరి]] 1988 నుండి వారపత్రిక రూపంలో ప్రచురించటంతో బాగా ప్రాచుర్య పొంది మిగతా దినపత్రికలు కూడా ఆ పద్ధతినే అవలంబించాయి. 1992 [[సెప్టెంబరు]] 24న మహిళల కోసం ప్రత్యేకంగా [[వసుంధర]] పేజీని ప్రారంభించింది. 1994 ఏప్రిల్ 15 న ఉద్యోగవకాశాల కథనాలతో "ప్రతిభ" శీర్షికను ప్రారంభించింది. 1985 [[ఆగష్టు]] నుండి రైతేరాజు శీర్షికతో రైతాంగానికి సంబంధించిన సమాచారం అందజేస్తున్నది.<ref name=Bendalam>{{Cite book|title="మేటి పత్రికలు-ఈనాడు", వార్తలు ఎలా రాయాలి|last= బెందాళం |first=క్రిష్ణారావు, |pages= 410-411|publisher=[[ఋషి ప్రచురణలు]]|year= 2006 }}</ref> ఈనాడులో [[2010]] తరువాత ఆదివారము అనుబంధంలో [[రాశి ఫలాలు]] చేర్చారు
 
==అమ్మకాలు, చదువరులు==
"https://te.wikipedia.org/wiki/ఈనాడు" నుండి వెలికితీశారు