"సచిన్ దేవ్ బర్మన్" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (→‎బయటి లింకులు: +{{Authority control}})
చి
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
== 1930వ దశకం ==
 
1920దశకం చివర్లో కలకత్తా రేడియో స్టేషన్ లో గాయకునిగా కెరీర్ ప్రారంభించిన బర్మన్ బెంగాలీ జానపద, హిందుస్థానీ సంప్రదాయ సంగీతంలో పాటలను స్వరపరచి, పాడేవారు. ఆ తరువాత కూడా ఆయన స్వరాలలో బెంగాలీ జానపదాల ప్రభావం ఉండేది. అతని మొదటి రికార్డు 1932లో విడుదలైంది. ఆ రికార్డ్ లో ఒకవైపు [[ఖమస్ రాగం|ఖమాస్ రాగంలోరాగం]]లో పాడిన '' ఏ పాతే ఆజ్ ఏసో ప్రియో'' పాట, రెండో వైపు ''దాక్లే కోకిల్ రోజ్ బిహానే'' అనే జానపద పాట ఉన్నాయి. అదే సంవత్సరంలో బెంగాలీలో 131 పాటలు పాడి, ప్రముఖ స్వరకర్తల సినిమాలలో అత్యధిక పాటలు పాడి గాయకునిగా అత్యున్నత శిఖరాలను అందుకున్నారు. హిమంగ్సు దత్తా, ఆర్.సి.బోరల్, నజ్రుల్ ఇస్లామ్, శైలేష్ దాస్ గుప్త, సుబల్ దాస్ గుప్తల సంగీత దర్శకత్వంలో 1932 సంవత్సరంలో ఎక్కువ పాటలు పాడారు బర్మన్. ఆ తరువాతి కాలంలో మాధవ్ లాల్ మాస్టర్, బర్మన్ కుమారుడు ఆర్.డి.బర్మన్ ల సంగీత దర్శకత్వంలో కూడా పాటలు పాడారు.
 
1934లో అఖిలభారత సంగీత సమ్మేళనంలో పాల్గొన్న బర్మన్ ''బెంగాలీ టుమ్రీ''తో అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ సమ్మేళనానికి అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి బర్మన్ కు ఆహ్వానం అందింది. ఈ సమ్మేళనంలో అతని ప్రతిభకు [[విజయలక్ష్మీ పండిట్]], అబ్దుల్ కరీం ఖాన్ ఘరానాల ప్రశంసలు లభించాయి. ఆ తరువాత, అదే సంవత్సరంలో కలకత్తాలో జరిగిన బెంగాల్ సంగీత సమ్మేళనంలో అదే టుమ్రీ పాడి బంగారు పతకం సాధించారు బర్మన్. ఈ సమ్మేళనాన్ని [[రవీంద్రనాధ టాగూరు]] ప్రారంభించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2710669" నుండి వెలికితీశారు