లక్ష్మీరాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Laxmirajyam.jpg|thumb|ప్రభాకర్ ప్రొడక్షన్స్ చిత్రం "మంగళసూత్రం"(1948)లో లక్ష్మీరాజ్యం]]
'''సి.లక్ష్మీరాజ్యం''' ([[1922]] - [[1987]]) [[తెలుగు సినిమా]], రంగస్థల నటి మరియు నిర్మాత. [[1922]]లో [[విజయవాడ]]లో జన్మించిన లక్ష్మీరాజ్యం 1935లో విడుదలైన [[శ్రీకృష్ణ లీలలు (1935 సినిమా)|శ్రీకృష్ణ లీలలు]] సినిమాలో బాలనటిగా నటించింది. లక్ష్మీరాజ్యం మొత్తం 35 సినిమాలలో నటించింది. రెండు చిత్రాలలో [[ఎన్టీ రామారావు]] సరసన హీరోయిన్‌గా నటించింది. ఈమె 1941లో [[తెనాలి]]కి చెందిన రెవిన్యూ శాఖా ఉద్యోగి [[కె.శ్రీధరరావు]]ను వివాహమాడినది.
 
చిన్నతనంలో నరసింహం గారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. యుక్తవయసులో హరికథలు చెప్పాలనే మక్కువతో సాలురు రాజేశ్వరరావు గారి వద్ద హరికథలు చెప్పడం నేర్చుకున్నారు. మేనమామ వెంకటరామయ్య గారితో పటు సూరిబాబు నాటక సమాజంలో చేరి స్త్రీ పాత్రలు ఉత్తమంగా పోషించారు.
 
వీరు 1951లో [[రాజ్యం పిక్చర్స్]] అను సినిమా నిర్మాణ సంస్థను ప్రారంభించి [[నందమూరి తారక రామారావు]]తో అనేక సినిమాలు తీశారు. వాటిలో ప్రముఖమైనది 1963లో విడుదలైన [[నర్తనశాల]]. ఈ సినిమా జకర్తాలో జరిగిన మూడవ ఆఫ్రో ఆసియన్ చిత్రోత్సవములో రెండు బహుమతులు గెలుచుకున్నది. ఈ చిత్రప్రదర్శనకు గాను లక్ష్మీరాజ్యం ఇతర సినిమా బృందముతో జకర్తా వెళ్ళినది. లక్ష్మీరాజ్యం నిర్మించిన ఇతర చిత్రాలలో [[హరిశ్చంద్ర (1956 సినిమా)|హరిశ్చంద్ర]], [[శ్రీకృష్ణ లీలలు]], [[శకుంతల (1966 సినిమా)|శకుంతల]], [[దాసి]], [[రంగేళి రాజా]] మరియు [[మగాడు]] ఉన్నవి. రాజ్యం పిక్చర్స్ సంస్థ నిర్మించిన మొత్తం 11 సినిమాలలోను 5 సినిమాలలో ఎన్.టి.ఆర్. హీరోగా నటించాడు.
"https://te.wikipedia.org/wiki/లక్ష్మీరాజ్యం" నుండి వెలికితీశారు