కోటప్ప కొండ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: అధికారిక లింకు కాదు కావున
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 45:
'''[[కోటప్పకొండ]]''' [[గుంటూరు]] జిల్లా, [[నరసరావుపేట]] దగ్గర ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి. కైలాశాధినేత అయిన ఆ మహా శివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిది కోటప్పకొండ. యల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతి పాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ప్రతి ఏటా కార్తీకమాసంలో కోటప్పకొండ తిరుణాళ్ళు, కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతాయి. ఈ తిరణాళ్లలో చుట్టుప్రక్కల ఊర్లనుండి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని దర్శిస్తారు.
 
=='''దేవాలయ చరిత్ర'''==
ఈ కొండను ఏ కోణం నుండి చూసినా (త్రికూటాలు) మూడు శిఖరాలు కనపడతాయి. కనుక త్రికూటాచలమని పేరు వచ్చింది. అందువలన ఇక్కడి స్వామి త్రికూటాచలేశ్వరుడు అయ్యాడు. ఈ మూడు శిఖరాలు [[బ్రహ్మ]], [[విష్ణు]], [[రుద్ర]] రూపాలుగా భావిస్తారు. చారిత్రక త్రికోటేశ్వర ఆలయం క్రీ.శ 1172 లో నాటికే ప్రసిద్ధి చెందినట్లు వెలనాటి చోళ రాజైన కుళొత్తుంగా చోళరాజు, సామంతుడు మురంగినాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. <ref> {{Cite web |title=మహిమాన్విత క్షేత్రం.. కోటప్పకొండ|url=https://www.eenadu.net/districts/mainnews/37574/Guntur/19/4 |archiveurl=https://web.archive.org/web/20190812041154/https://www.eenadu.net/districts/mainnews/37574/Guntur/19/4|archivedate=2019-08-12|publisher= ఈనాడు |date=2018}}</ref> ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురి రాజులలో ఒకరైన [[శ్రీకృష్ణదేవరాయలు]] దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చాడు. నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతి జమీందారులు మరియు ఇతరులు దేవాలయాభివృద్ధికి అనేక విధాలుగా దానాలు చేసారు. కోటప్ప కొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి [[ఆలయం]] 600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయాన్ని భక్తులు కొండపైకి ఎక్కడానికి 703 మెట్లతో మెట్లమార్గాన్ని క్రీ.శ.1761లో నరసరావుపేట జమీందారు '''శ్రీ రాజా మల్రాజు నరసింహరాయణి''' నిర్మించాడు. ఈ ఆలయానికి నరసరావుపేట సంస్థానాధీశులు రాజా మల్రాజు వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలూసదుపాయాలు చేసారు. వాహనాలలో వెళ్ళడానికి 1999లో [[కోడెల శివప్రసాదరావు]] మంత్రిగా ఉన్న సమయంలో గుడి దాకా చక్కని ఘాట్ రోడ్డు వేశారు. ఘాట్ రోడ్డు మొదట్లో విజయ గణపతి, సాయిబాబా ఆలయాలు, రోడ్డు ఇరువైపులా ఏంతో అందమైన పూలతోటలు, తోవలో మ్యూజియం, జింకల పార్కు, పిల్లల కోసం పార్కు, ఒక సరస్సు, మధ్య చిన్ని కృష్ణుడు కాళీయమర్దనం చేసే విగ్రహం, దూరంనుంచే చూస్తే ఆకర్షించే బ్రహ్మ, లక్ష్మీనారాయణులు, వినాయకుడు, ముగ్గురమ్మలు (లక్ష్మి, సరస్వతి, పార్వతి ఒక్కచోట ఉంటారు).
===స్థలపురాణం===
పురాణ కథనాలను అనుసరించి దక్షాయజ్ఞం భగ్నం చేసిన తరువాత పరమశివుడు తనకు తాను చిన్న బాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపస్సు ఆచరించిన సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో [[దక్షిణామూర్తి]]ని సందర్శించి, ప్రార్థించి తమకు జ్ఞానభోధ చెయ్యమని కోరాడు.
[[పరమశివుడు]] బ్రహ్మాదులను త్రికూటాచలానికి వస్తే జ్ఞానం ఇస్తానని చెప్పగా, బ్రహ్మదేవుడు త్రికూటాచలానికి వచ్చి పరమశివుని నుండి జ్ఞానోపదేశం పొందాడు. ఈ చోటనున్న గుడికే పాత [[కోటప్పగుడి|కోటప్ప గుడి]] అను పేరు. లోపలి లింగము ఒక అడుగు ఎత్తు కలది. ఈ గుడి ఉన్న శిఖరమును రుద్ర శిఖరము అనబడుచున్నది. రుద్ర శిఖరమునకు [[నైఋతి]] భాగమునున్న శిఖరమునకు బ్రహ్మశిఖరమని పేరు. రుద్ర విష్ణు శిఖరములపై స్వయంభువులగు [[జ్యోతిర్లింగాలు|జ్యోతిర్లింగములు]] వెలయుటయు, ఈ శిఖరముపై ఏమియు లేకపోవుటయుకని చింతిల్లి, బ్రహ్మ శివుని గూర్చి తపము చేసి శివుడిని లింగమును ఆవిర్భవింపజేసెను. ఇదియే బ్రహ్మశిఖరము. ఇచ్చట తూర్పున గల చిన్నపల్లె [[మునిమంద]], [[ఎల్లమంద]] అనిపేరు గలవి. తొలుత బ్రహ్మాది దేవతలు, సకల మునిగణములు శివుని ఇచ్చట పరివేష్టించియుండిరట. కావుననే దీనికాపేరులు వచ్చినవని చెపుతారు..
==అభివృద్ధి==
యాత్రీకులు సాధారణంగా శ్రీ రాజా మల్రాజు నరసింహరాయలు నిర్మించిన మెట్ల మార్గంలో ప్రయాణించి ఆలయం చేరుకుంటారు. వాహనాలలో వెళ్ళడానికి 1999లో [[కోడెల శివప్రసాదరావు]] మంత్రిగా ఉన్న సమయంలో గుడి దాకా చక్కని ఘాట్ రోడ్డు వేశారు. ఘాట్ రోడ్డు మొదట్లో విజయ గణపతి, సాయిబాబా ఆలయాలు వున్నాయి. రోడ్డు ఇరువైపులా ఎంతో అందమైన పూలతోటలు, తోవలో మ్యూజియం, జింకల పార్కు, పిల్లల కోసం పార్కు, ఒక సరస్సు, మధ్య చిన్ని కృష్ణుడు కాళీయమర్దనం చేసే విగ్రహం, దూరంనుంచే ఆకర్షించే బ్రహ్మ, లక్ష్మీనారాయణులు, వినాయకుడు, ముగ్గురమ్మలు (లక్ష్మి, సరస్వతి, పార్వతి) విగ్రహాలు వుంచారు.
 
యాత్రీకులు సాధారణంగా శ్రీ రాజా మల్రాజు నరసింహరాయలు నిర్మించిన మార్గంలో ప్రయాణించి ఆలయం చేరుకుంటారు. ఈ కొండను ఏ కోణం నుండి చూసినా (త్రికూటాలు) మూడు శిఖరాలు కనపడతాయి. కనుక త్రికూటాచలమని పేరు వచ్చింది. అందువలన ఇక్కడి స్వామి త్రికూటాచలేశ్వరుడు అయ్యాడు. ఈ మూడు శిఖరాలు [[బ్రహ్మ]], [[విష్ణు]], రుద్ర రూపాలుగా భావిస్తారు.
 
==దేవాలయ విశేషాలు==
పురాణ కథనాలను అనుసరించి దక్షాయజ్ఞం భగ్నం చేసిన తరువాత పరమశివుడు తనకు తాను చిన్న బాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపస్సు ఆచరించిన సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో [[దక్షిణామూర్తి]]ని సందర్శించి, ప్రార్థించి తమకు జ్ఞానభోధ చెయ్యమని కోరాడు.
[[పరమశివుడు]] బ్రహ్మాదులను త్రికూటాచలానికి వస్తే జ్ఞానం ఇస్తానని చెప్పగా, బ్రహ్మదేవుడు త్రికూటాచలానికి వచ్చి పరమశివుని నుండి జ్ఞానోపదేశం పొందాడు. ఈ చోటనున్న గుడికే పాత [[కోటప్పగుడి|కోటప్ప గుడి]] అను పేరు. లోపలి లింగము ఒక అడుగు ఎత్తు కలది. ఈ గుడి ఉన్న శిఖరమును రుద్ర శిఖరము అనబడుచున్నది. రుద్ర శిఖరమునకు [[నైఋతి]] భాగమునున్న శిఖరమునకు బ్రహ్మశిఖరమని పేరు. రుద్ర విష్ణు శిఖరములపై స్వయంభువులగు [[జ్యోతిర్లింగాలు|జ్యోతిర్లింగములు]] వెలయుటయు, ఈ శిఖరముపై ఏమియు లేకపోవుటయుకని చింతిల్లి, బ్రహ్మ శివుని గూర్చి తపము చేసి శివుడిని లింగమును ఆవిర్భవింపజేసెను. ఇదియే బ్రహ్మశిఖరము. ఇచ్చట తూర్పున గల చిన్నపల్లె [[మునిమంద]], [[ఎల్లమంద]] అనిపేరు గలవి. తొలుత బ్రహ్మాది దేవతలు, సకల మునిగణములు శివుని ఇచ్చట పరివేష్టించియుండిరట. కావుననే దీనికాపేరులు వచ్చినవని చెపుతారు..
 
<gallery>
"https://te.wikipedia.org/wiki/కోటప్ప_కొండ" నుండి వెలికితీశారు