కృష్ణ జననం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 117.249.128.86 (చర్చ) చేసిన మార్పులను 2409:4070:2286:7428:7708:4D87:29D1:C78E చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
 
పంక్తి 3:
శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతం [[భాగవతం]] [[దశమ స్కంధము]]లో చెప్పబడింది.
[[ఫైలు:Krishna carried over river yamuna.jpg|thumb|left|250px|శిశువైన కృష్ణుని తీసుకొని వసుదేవుడు యమునను దాటి వెళ్ళుట - 18వ శతాబ్దానికి చెందిన చిత్రం.]]
[[మధుర|మధురా]] నగరాన్ని శూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన [[క్షత్రియులు|క్షత్రియ]] [[యాదవ]] వంశానికి చెందిన వాడు. ఆయనకు [[వసుదేవుడు]] అనే కుమారుడు ఉండేవాడు. వసుదేవునికి [[ఉగ్రసేన మహారాజు]] కుమార్తె [[దేవకి]]ని ఇచ్చి వివాహం చేస్తారు. చెల్లెలు అంటే ఎంతో ప్రేమ కల [[కంసుడు]] ఆమెను అత్తవారి ఇంటికి రథం మీద సాగనంపుతుంటే అశరీరవాణి దేవకి గర్భంలో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని చెబుతుంది. అది విన్న వెంటనే కంసుడు కుపితుడై దేవకీ దేవి జుట్టు ముడి పట్టుకొని తన కరవాలము తీసుకొని సంహరించబోతాడు. అప్పుడు వసుదేవుడు అడ్డు పడి, "కంసా! నీకు అత్యంత ప్రియమైన సోదరిని చంపుతావా? ఆమె కాదు కదా నిన్ను సంహరించేది. ఆమె గర్భం నుండి జన్మించిన కుమారుడు కదా నిన్ను సంహరించేది. దేవకి గర్భం లో ఉన్న ప్రతి సంతానాన్ని తీసుకొని నీకు సమర్పిస్తాను" అని చెబుతాడు. దానికి కంసుడు అంగీకరించి ఆమెను వసుదేవుని ఇంటికి పంపుతాడు.
దేవకి గర్భం దాలుస్తుంది; సంతానాన్ని పొందుతుంది. దేవకి పొందిన సంతానాన్ని వెంటనే వసుదేవుడు కంసునికి సమర్పిస్తాడు. వసుదేవుని సత్య నిష్ఠకు మెచ్చి, "వసుదేవా! నీ ఎనిమిదో సంతానం కదా నన్ను సంహరించేది. ఇప్పటి ఈ సంతాన్ని తీసుకొని ఆనందించు. ఎనిమిదో సంతానాన్ని తీసుకొని నాకు సమర్పించు" అని కంసుడు చెబుతాడు. వసుదేవుడు ఆనందంతో తన సంతానాన్ని తీసుకొని మధురానగరం వెడతాడు.
 
"https://te.wikipedia.org/wiki/కృష్ణ_జననం" నుండి వెలికితీశారు