అరుణ్ జైట్లీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
 
==నేతగా ఎదిగిన న్యాయ ప్రస్థానం==
దేశంలోని దిగ్గజ న్యాయవాదుల్లో ఒకరిగా పేరొందిన అరుణ్‌జైట్లీ.. న్యాయస్థానం నుంచి వృత్తి జీవితాన్ని మొదలుపెట్టి రాజకీయ నేతగా చట్టసభకు ప్రస్థానం సాగించారు.1987 నుంచి పలురాష్ట్రాల హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. 1990లో 37 ఏళ్ల వయసులోనే దిల్లీ హైకోర్టులో సీనియర్‌ అడ్వొకేట్‌ హోదా లభించింది. అంతకు ఏడాది ముందు అదనపు సొలిసిటర్‌ జనరల్‌(ఏఎస్‌జీ)గా నియమితులయ్యారు. ఏఎస్‌జీగా అప్పట్లో దేశంలో సంచలనం సృష్టించిన బోఫోర్స్‌ కేసును చేపట్టారు. దేశంలో చరిత్రాత్మక తీర్పులు వెలువడిన ఎన్నో ముఖ్యమైన కేసుల్ని వాదించారు. ఆయన క్లయింట్లలో శరద్‌యాదవ్‌, మాధవరావు సింధియా, ఎల్‌కే ఆడ్వాణీ, బిర్లా కుటుంబం తదితరులే కాకుండా బహళజాతి కార్పొరేట్‌ సంస్థలు ఉన్నాయి. న్యాయ తదితర అంశాలపై పుస్తకాలు వెలువరించారు. రాజ్యసభలో విపక్షనేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత న్యాయవాద వృత్తికి దూరమయ్యారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు గవర్నర్ల బోర్డులో సభ్యుడిగానూ వ్యవహరించారు.
 
గుజరాత్‌ అల్లర్ల కేసులో మోదీకి, వివాదాస్పద సోహ్రబుద్దీన్‌, ఇస్రాత్‌ జహాన్‌ ఎన్‌కౌంటర్ల కేసుల్లో అమిత్‌షాకు న్యాయసేవలు అందించారు. కేంద్రం చేపట్టే న్యాయ నియామకాల్లో జైట్లీ ముద్ర సుస్పష్టం. న్యాయమంత్రిగా పలు ఎన్నికలు, న్యాయ సంస్కరణలు చేపట్టారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు పథకాన్ని అమలు చేశారు. కోర్టుల కంప్యూటరీకరణపై ప్రత్యేక దృష్టిసారించారు. కేసులు త్వరగా పరిష్కారమయ్యేందుకు వీలుకల్పిస్తూ పలు చట్టాల్లో సవరణలు తీసుకొచ్చారు.
పంక్తి 60:
*2002 జూలైలో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి పార్టీ కార్యదర్శిగా, ప్రధాన ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు. 2003లో వాజ్‌పేయి మంత్రివర్గంలో చేరారు
*2014లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2014, 2017లో కొద్ది నెలల పాటు రక్షణ మంత్రిగా వ్యవహరించి రక్షణ రంగంలో ప్రైవేటీకరణ వంటి కీలక సంస్కరణలు తీసుకొచ్చారు.
 
==సంస్కరణాభిలాషి==
అరుణ్‌ జైట్లీ అస్తమించినప్పటికీ.. ఆయన వదలిన సంస్కరణల ముద్రలు మాత్రం భారత్‌లో ఉదయిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా జీఎస్‌టీ అమలును చెప్పుకోవాలి. ఒకే దేశం.. ఒకే పన్ను కోసం మోదీ 1.0 ప్రభుత్వం తలపెట్టిన కార్యాన్ని నెత్తికెత్తుకుంది ఈయనే. బ్యాంకింగ్‌ వ్యవస్థలో మొండి బకాయిల ప్రక్షాళనకావించిన జైట్లీ తన హయాంలో పలు విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. అదే సమయంలో వృద్ధి మందగమనం రూపంలో అతిపెద్ద వైఫల్యాన్నీ మూటగట్టుకున్నారు.
 
===జైట్లీ హయాంలో సంస్కరణలు==
 
===జీఎస్‌టీ===
వస్తువులు, సేవల పన్ను(జీఎస్‌టీ) విషయంలో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడం అరుణ్‌ జైట్లీ అతి పెద్ద విజయం. దేశం మొత్తాన్ని ఒకే పన్ను కిందకు తీసుకురావడానికి ఉభయ సభల్లో బిల్లు ఆమోదంలోనూ మోదీకి మంచి చేయూతనిచ్చారు. ఆ తర్వాత తన అధ్యక్షతన జరిగిన లెక్కకు మించిన జీఎస్‌టీ మండలి సమావేశాల్లో శ్లాబుల నుంచి పలు అంశాల్లో సవరణలు చేసే విషయంలో, వాటిపై అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించి.. అందరికీ సానుకూలంగా ఉండే నిర్ణయాలు తీసుకోవడం సఫలం అయ్యారు.
 
===దివాలా స్మృతి===
బ్యాంకింగ్‌ వ్యవస్థలో దివాలా కోసం ఉన్న పలు వ్యవస్థలన్నిటినీ ఒకే చట్టం కిందకు తీసుకొచ్చారు. సంక్లిష్టతలను తగ్గించారు. మొండి బకాయిల వసూలును సరళతరం చేశారు. ఇటీవల దీనికి మరికొన్ని సవరణలూ చేపట్టి.. కంపెనీలకు మరింత వెసలుబాటు కల్పించారు. మొత్తం మీద జైట్లీ హయాంలో వచ్చిన ఈ బిల్లు ప్రారంభం నుంచి అమలు వరకూ ఆయన కీలక పాత్ర పోషించారు.
 
===జన్‌ధన్‌===
బ్యాంకింగ్‌ సేవలను మూలమూల్లోకీ విస్తరించడమే ధ్యేయంగా చేపట్టిన ప్రధాన్‌ మంత్రి జన్‌ధన్‌ యోజన ద్వారా పల్లెసీమల్లో అత్యధికంగా ఖాతాలు ప్రారంభమయ్యాయి. ఇక ఆధార్‌ ఆధారంగా 55 సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేశారు. దీని వల్ల రూ.లక్ష కోట్ల వరకు ప్రజాధనం పక్కదార్లు పట్టకుండా కాపాడినట్లు తెలుస్తోంది.
 
===సీఎండీ పోస్టు విభజన===
ఆర్థిక వ్యవస్థలో మార్పులను ముందుగానే ఊహించిన జైట్లీ.. పీజే నాయక్‌ కమిటీ సిఫారసులను అమలు చేశారు. బ్యాంకు బోర్డుల్లో పలు సంస్కరణలు చేపట్టారు. సీఎండీ పోస్టును విభజించడంతో పాటు.. డైరెక్టర్లు, బ్యాంకు అధిపతుల నియామకం కోసం బ్యాంక్‌ బోర్డ్స్‌ బ్యూరో(బీబీబీ)ను ఏర్పాటు చేశారు. ఆర్‌బీఐకి తోడుగా కొత్త నియంత్రణ సంస్థల వైపు కూడా ఆయన మొగ్గుచూపారు.
 
===ద్రవ్యలోటు===
జైట్లీ హయాంలో ద్రవ్యలోటు నియంత్రణలోనే ఉంది. అయితే లక్ష్యమైన 3 శాతాన్ని ఎపుడూ చేరలేదు. మధ్యంతర బడ్జెట్‌లో మాత్రం 3.4 శాతానికి చేర్చగలిగారు. ప్రధాని నిర్దేశించిన ద్రవ్యోల్బణ లక్ష్యాలను సాధించగలిగారు. ఆయన పగ్గాలు చేపట్టిన సమయంలో ద్రవ్యోల్బణం 7.72 శాతంగా ఉండగా.. అనారోగ్యం కారణంగా తాత్కాలికంగా పక్కకు తప్పుకునే సమయానికి 2.92 శాతానికి చేరింది.
 
విజయవంతమైన అంశాలను పక్కనపెడితే ఎన్‌బీఎఫ్‌సీల మొండి బకాయిలను ఒక దారికి తీసుకువచ్చే కార్యక్రమాన్ని అసంపూర్తిగానే వదిలి వెళ్లారు. వైఫల్యాల విషయానికొస్తే వృద్ధిని పరుగులు తీయించలేకపోయారు. మందగమనానికి అడ్డుకట్టవేయలేకపోయారు. ఒక దశలో 8% పైన నమోదైన వృద్ధి ప్రస్తుతం 7% దిగువకు చేరుకుంది. అయితే ఈ మందగమనాన్ని జైట్లీకే అంటగట్టలేం. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయ మందగమనం, అధిక కమొడిటీ, ముడి చమురు ధరలు కూడా మందగమనానికి కారణాలుగా పనిచేశాయి.
 
===జైట్లీ విజయాలు===
 
* జీఎస్‌టీ, దివాలా బిల్లు వంటి సంస్కరణల అమలు
* ద్రవ్యోల్బణం 7.7% నుంచి 2.9%కి పరిమితం
* ద్రవ్య నియంత్రణ చర్యలు
* బ్యాంకుల్లో మొండి బకాయిల ప్రక్షాళన
* జన్‌ధన్‌ ఖాతాలు
* స్థిరాస్తి బిల్లు
* సంక్షేమ పథకాలకు ఆధార్‌ ఆధారిత ప్రత్యక్ష నగదు బదిలీ
* నాయక్‌ కమిటీ సిఫారసుల అమలు
 
==మరణం==
"https://te.wikipedia.org/wiki/అరుణ్_జైట్లీ" నుండి వెలికితీశారు