పద్మశాలీలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 84:
జన్మచేత అల్పాయుష్కుడు అయిన మార్కాండేయుడు శివుడిని మెప్పించి [[మృత్యుంజయుడు]] అయినాడు. మార్కాండేయుని ప్రస్తావన లేని పురాణేతిహాసాలు లేవంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్నో కల్పాలను చూసిన తప:శాలి. ఈతడు దేవి ఉపాసన చేసినట్టుగా మార్కాండేయ పురాణం ద్వారా అవగతమౌతుంది. మార్కాండేయ పురాణాంతర్గతమైన చంఢి సప్తశతి యందు మొట్టమొదటి మంత్రం '' ఓం ఐం మార్కాండేయాయ నమ: మరియు గౌరి అష్టోత్తరమునందు అమ్మవారిని '' ఓం మార్కాండేయ వరప్రదాయై నమ:`` అను మంత్రముల ద్వారా ఈ మార్కాండేయు శాక్తేయుడనియు మరియు మహా తప:శాలి అనియు అవగతం అవుచున్నది.
 
=== వేదశిరుడువేదశీర్షుడు (భావనాఋషి)===
 
మార్కండేయ మహర్షికి ఔరసపుత్రుడు భావనాఋషి (వేదశీ(రు)ర్షుడు). వస్త్రవిద్యను కాలుడు అనే రాక్షసుడు అపహరించి దేవాది సమస్త గణముల మాన సంరక్షణను వినాశనం చేయుట వలన ఆ రాక్షసుడిని సంహరించి, దేవ మానవ మానాలను కాపడిన మహానుభావుడు. యంత్రము ద్వారా [[వస్త్రము]]<nowiki/>ను తయారు చేసిన మొట్టమొదటి వ్యక్తిగా చరిత్రక్కెక్కిన ఘణుడు. సూర్య పద్మినల సంతానం అయిన బద్రావతి దేవిని వివాహం చేసుకొని గోత్రకర్తలు కుమారులను శతాధికంగా కన్నాడు. ఈ శతాధిక పుత్రులే పద్మశాలీ కుల కారకులు. ఈతడే మొదటి పద్మశాలి. మరియు ఇతని పుత్రులు కూడా పద్మశాలి బిరుదును పొంది ఈ కుల కారకులు అయ్యారు. ఈతను భావనోపనిషద్ అనే ఉపనిషత్త్ కి మంత్ర ద్రష్ఠ. (వామాచార విధానాన్ని ప్రోత్సహించుట వలన ఈ ఉపనిషత్త్ అంతగా ఆదరణపొందలేదు.) ఈతను సాక్షాత్ శ్రీ మహావిష్ణు అంశగా పురాణాలు వివరిస్తున్నాయి.
"https://te.wikipedia.org/wiki/పద్మశాలీలు" నుండి వెలికితీశారు