అమరావతి స్తూపం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 123:
ధాన్యకటకములోనిది మహావిహారం. అనగా ఒకే ప్రాకారంలో అనేక విహారాలున్నాయి. [[హుయాన్ త్సాంగ్]] వ్రాతలలో 'పూర్వశైల సంఘారామం' అనబడింది. ఒక శాసనం ప్రకారం పాటలీపుత్ర బౌద్ధ భిక్షువుల కోసం ఒక ప్రత్యేక విహారముంది. మహాచైత్యానికి నైరుతీ దిశలో ఉన్న నేటి బచ్చలమ్మ గుడి ముందున్న కుంటను మంజుశ్రీ విహారంగా గుర్తించారు. విహారంలో దేశ విదేశాలనుండి వచ్చిన శ్రమణులు, పండితులు, [[యాత్రికులు]], భిక్షువులు వివిధ అంగాలను అభ్యసించేవారు. ధమ్మమేకాక లౌకిక విషయాలపై కూడా బోధన, పరిశోధన జరిగేవి. [[ఖగోళ శాస్త్రము]], [[జ్యోతిష్యము]], [[న్యాయము]], [[వ్యాకరణము]], [[తర్కము]] మున్నగు శాఖలలో బోధన జరిగేది.
 
[[విశ్వవిద్యాలయము]]లో 8000 మంది ఉన్నతవిద్య నభ్యసించడానికి అవకాశాలుండేవి. నలందా విహారము తర్వాత పెద్ద విహారమిదే. ధాన్యకటకవిద్యాపీఠం నమూనాగా [[టిబెట్]] రాజధాని [[లాసా]]లో [[డాపంగ్ విశ్వవిద్యాలయము]] నిర్మించబడిందని లామా [[తారానాథుడు]] పేర్కొన్నాడు.<ref name="MSS"/> అశోకుడు పంపిన [[మహాదేవభిక్షు]] ధాన్యకటక చైత్యశాలలో నివసించి ధర్మప్రచారం చేశాడు. [[బోధిసత్వమంజుశ్రీ]] ఇచటినుండే పరిసరారణ్యములోని నాగజాతి ప్రజలకు బౌద్ధం బోధించినట్లు, 'బోధిచర్యావతారం' అనే గ్రంథానికి జన్మభూమి అయినట్లు 'గండవ్యూహ' అనే గ్రంథం ద్వారా తెలుస్తోంది.
 
[[ఆచార్య నాగార్జునుడు]] ఇచటి విహారంలో నివసించి ప్రజ్ఞాపారమిత సూత్రాలను స్థానిక నాగరాజు నుండి గ్రహించి గ్రంథస్థం చేసినట్లు తెలుస్తోంది. తర్కపండితుడు భావవివేకుడు విహారంలో కొంతకాలం ఉండి రచనలు చేశాడు. క్రీ. శ. 684లో [[హుయాన్ త్సాంగ్]] '[[అభిధమ్మ పిటకం]]' అభ్యసించి రచనలు చేశాడు. అనేక సంఘారామాలున్నట్లు, వాటిలో జనావాసం చాలవరకు తగ్గినట్లు, అవి శిథిలావస్థలో ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇరవై విహారాలలో మాత్రం బౌద్ధ సాంఘికులు నివసిస్తున్నట్లు వ్రాశాడు.<ref name="MSS"/> అనగా అప్పటికే వైదికమతము పుంజుకున్నట్లు తెలుస్తున్నది. క్రీ. శ. 1344నాటి గదలదేనియ (కాండీ, [[శ్రీలంక]]) శాసనం ప్రకారం బౌద్ధ థెర ధర్మకీర్తి రెండంతస్తుల విహారానికి జీర్ణోద్ధరణ చేశాడు.
"https://te.wikipedia.org/wiki/అమరావతి_స్తూపం" నుండి వెలికితీశారు