అమరావతి స్తూపం: కూర్పుల మధ్య తేడాలు

చి ప్రసిద్ధి లాంటి పదాలు తొలగించు
చి cleanup and update lead
పంక్తి 1:
[[అమరావతి (గ్రామం)|అమరావతి]] లో [[గౌతమ బుద్ధుడు|గౌతమ బుద్ధుని]] అవశేషాలను పూజల నిమిత్తమై పొందుపరచి వాటిపై కట్టిన కట్టడమే అమరావతి స్తూపం. ఇది ముఖ్యంగా బౌద్ధులకు ఒక పర్యాటక అకర్షణ. క్రీస్తు పూర్వము 2వ శతాబ్దము, క్రీస్తు శకము 3వ శతాబ్దముల మధ్య కట్టబడి ఉన్నత స్థితిని పొంది, బౌద్ధం క్షీణతతో మరుగున పడి. 1797 లో మరలా వెలుగులోకి వచ్చింది. అమరావతి శిల్పకళ బుద్ధ విగ్రహం మలచడంలోను, నాగిని ప్రతిమల రూపురేఖలలోను తనదైన ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆగ్నేయ ఆసియా, శ్రీలంక దేశాలకు ఈ శిల్పకళ విస్తరించింది. ఇక్కడ లభించిన శాసనాలు వలన బ్రాహ్మీలిపి నుండి తెలుగు లిపి పరిణామ క్రమంలో తొలి నాలుగు దశలను తెలుపుతుంది. శాసనాలు, శిల్పాలు స్థానిక పురావస్తు ప్రదర్శనశాల, చెన్నై లో పురావస్తు ప్రదర్శనశాల, బ్రిటీష్ మ్యూజియము లలో భద్రపరరచబడ్డాయి.
 
==చరిత్ర==
పంక్తి 76:
*సింహద్వారం వెడల్పు: 7.9 మీ.
 
ఆయక వేదికలు శిల్పఫలకాలతో కప్పబడి ఉండేవి. ప్రాకారంలోని నిలువు స్తంభాలు, అడ్డకమ్మీలు, మదురు సుందరశిల్పాలతో ఉండేవి. మదురు వెలుపలి వైపున పెద్దపూలదండ శిల్పీకరించబడింది. దీనిని [[స్త్రీలు]], [[పురుషులు]] మోస్తూ ఉంటారు. పూలదండ వంకీలలో [[బోధిచెట్టు]], [[ధర్మచక్రం]], స్తూప నమూనాలు ఉన్నాయి. పూలదండ మకరం నోటినుండి వెలువడుతున్నట్లు ఉంది. మదురు లోపలివైపున బుద్ధుని జీవిత ఘట్టాలు, జాతక కథలు చెక్కి ఉన్నాయి. [[నిలువు]] స్తంభాలపై పద్మాలున్నాయి. వీటిపై [[భక్తులు]] బుద్ధచిహ్నాలను ఆరాధిస్తున్న శిల్పాలున్నాయి. [[జగ్గయ్యపేట]]లోని చిన్న స్తూపం నమూనాగా తీసికొని ఈ స్తూపాన్ని నిర్మించి ఉండవచ్చునని చరిత్రకారులు భావిస్తున్నారు.
 
; మేధి లేదా స్తూపాధిష్టానము
పంక్తి 84:
 
; వెలుపలి ప్రాకారము
ప్రాకార వైశాల్యం 17,000 చ. [[అడుగులు]], చుట్టు కొలత 600 అడుగులు. ఈ ప్రాకారం రెండువైపులా ఎంతో అందమయిన [[శిల్పాలు]]న్నాయిశిల్పాలున్నాయి. ఆ శిల్పాల సందాల కారణంగానే ఈ వెలుపలి ప్రాకారానికి దీటు వచ్చేది హిందూదేశంలో మరెక్కడా కానరాదని పరిశోధక పండితుల అభిప్రాయం. ఈ ప్రాకారాన్ని రాతి కట్టడం లాగా కాకుండా చెక్క కట్టడంలాగా నిర్మించారు. ప్రాకారం అంతా నిలువు రాతి స్తంభాలతో ఏర్పడింది. రెండేసి నిలువు స్తంభాలకు మూడేసి అడ్డ రాతి కమ్మలు బిగించారు. స్తంభం పైన "కుసులు" (ముడులు?)గా తీర్చి దిద్దారు. ఈ కుసులను ఆ పై రాతి దూలాలలో తొలిచిన తొలలలో (తొర్రలలో) దూర్చబడ్డాయి. ఇలా పైన ఉండే రాతి దూలాలు ప్రాకారం పైన అంచులాగా ఏర్పడ్డాయి. అది ఉష్ణీషము (తలపాగా) లాగా ఉండడం వలన దానిని ఉష్ణీషము అని వ్యవహరించేవారు. ఉష్ణీషం వెలుపలినైపున పూలదండలను మనుష్యులు మోస్తున్నట్లుగాను, ఆ ఉష్ణీషం వెడల్పు పెరిగిన చోట దాగొబా, [[బోధివృక్షం]], త్రిరత్నాలు, నాగములు, [[యక్షులు]] వంటి చిత్రాలు చెక్కబడి ఉన్నాయి.
 
; ద్వారములు
పంక్తి 126:
ధాన్యకటకములోనిది మహావిహారం. అనగా ఒకే ప్రాకారంలో అనేక విహారాలున్నాయి. [[హుయాన్ త్సాంగ్]] వ్రాతలలో 'పూర్వశైల సంఘారామం' అనబడింది. ఒక శాసనం ప్రకారం పాటలీపుత్ర బౌద్ధ భిక్షువుల కోసం ఒక ప్రత్యేక విహారముంది. మహాచైత్యానికి నైరుతీ దిశలో ఉన్న నేటి బచ్చలమ్మ గుడి ముందున్న కుంటను మంజుశ్రీ విహారంగా గుర్తించారు. విహారంలో దేశ విదేశాలనుండి వచ్చిన శ్రమణులు, పండితులు, [[యాత్రికులు]], భిక్షువులు వివిధ అంగాలను అభ్యసించేవారు. ధమ్మమేకాక లౌకిక విషయాలపై కూడా బోధన, పరిశోధన జరిగేవి. [[ఖగోళ శాస్త్రము]], [[జ్యోతిష్యము]], [[న్యాయము]], [[వ్యాకరణము]], [[తర్కము]] మున్నగు శాఖలలో బోధన జరిగేది.
 
[[విశ్వవిద్యాలయము]]లోవిశ్వవిద్యాలయములో 8000 మంది ఉన్నతవిద్య నభ్యసించడానికి అవకాశాలుండేవి. నలందా విహారము తర్వాత పెద్ద విహారమిదే. ధాన్యకటకవిద్యాపీఠం నమూనాగా [[టిబెట్]] రాజధాని [[లాసా]]లో డాపంగ్ విశ్వవిద్యాలయము నిర్మించబడిందని లామా [[తారానాథుడు]] పేర్కొన్నాడు.<ref name="MSS"/> అశోకుడు పంపిన మహాదేవభిక్షు ధాన్యకటక చైత్యశాలలో నివసించి ధర్మప్రచారం చేశాడు. బోధిసత్వమంజుశ్రీ ఇచటినుండే పరిసరారణ్యములోని నాగజాతి ప్రజలకు బౌద్ధం బోధించినట్లు, 'బోధిచర్యావతారం' అనే గ్రంథానికి జన్మభూమి అయినట్లు 'గండవ్యూహ' అనే గ్రంథం ద్వారా తెలుస్తోంది.
 
[[ఆచార్య నాగార్జునుడు]] ఇచటి విహారంలో నివసించి ప్రజ్ఞాపారమిత సూత్రాలను స్థానిక నాగరాజు నుండి గ్రహించి గ్రంథస్థం చేసినట్లు తెలుస్తోంది. తర్కపండితుడు భావవివేకుడు విహారంలో కొంతకాలం ఉండి రచనలు చేశాడు. క్రీ. శ. 684లో [[హుయాన్ త్సాంగ్]] '[[అభిధమ్మ పిటకం]]' అభ్యసించి రచనలు చేశాడు. అనేక సంఘారామాలున్నట్లు, వాటిలో జనావాసం చాలవరకు తగ్గినట్లు, అవి శిథిలావస్థలో ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇరవై విహారాలలో మాత్రం బౌద్ధ సాంఘికులు నివసిస్తున్నట్లు వ్రాశాడు.<ref name="MSS"/> అనగా అప్పటికే వైదికమతము పుంజుకున్నట్లు తెలుస్తున్నది. క్రీ. శ. 1344నాటి గదలదేనియ (కాండీ, [[శ్రీలంక]]) శాసనం ప్రకారం బౌద్ధ థెర ధర్మకీర్తి రెండంతస్తుల విహారానికి జీర్ణోద్ధరణ చేశాడు.
"https://te.wikipedia.org/wiki/అమరావతి_స్తూపం" నుండి వెలికితీశారు