అమరావతి స్తూపం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
"స్తూపం" అనే పదం సంప్రదాయాన్నిబట్టి బౌద్ధ నిర్మాణాలకే వర్తిస్తుంది. దీని ప్రాకృత రూపం "థూపము". అయితే ప్రాచీన (బౌద్ధ) కాలంలో "స్తూపం" అనే పదం వాడుకలో ఉన్నట్లు కనిపించదు. అందుకు బదులు "చైత్యము" అనే పదమే వ్యవహారంలో ఉండేది. ఒకే చైత్యము ఉంటే దానిని చైత్యమనీ, చాలా చైత్యాలున్నచోట ప్రధాన కట్టడాన్ని మహాచైత్యమనీ అనేవారు కావచ్చును. "చైత్యము" అన్నపదం "చితా" శబ్దమునుండి పుట్టింది. ప్రాచీన బౌద్ధంలో బుద్ధుని, లేదా ఇతర "అర్హతుల" ధాతు విశేషాలను గౌరవ ప్రదంగా లేదా స్మృతి చిహ్నంగా లేదా పూజా సంకల్పంతో భద్రపరచే ఆచారం అప్పుడు ఉండేది. అలా చేయవచ్చునని బుద్ధుడు తన శిష్యుడు ఆనందునితో అన్నట్లు [[మహాపరినిర్వాణ సూత్రం]]లో ఉంది.
 
బుద్ధుని నిర్యాణం తరువాత అతని ధాతువులపై 8 చైత్యాలను నిర్మించారు. తరువాత వాటిలో ఏడింటిని తెరిపించి [[అశోకుడు]] అందులోని శకలాలను చిన్న ఖండాలుగా చేసి 84 వేల స్తూపాలను కట్టించాడని ఒక ప్రతీతి ఉంది. దీనిలో కొంత నిజమున్నదని చరిత్రకారులు భావిస్తున్నారు.<ref name="MSS">[http{{Cite book | |url=https://www.archive.org/details/amaravathistupam025779mbpin.ernet.dli.2015.388296 |author=మల్లంపల్లి సోమశేఖర శర్మ -|title= అమరావతి స్తూపము, ఇతర వ్యాసములు]|date=1932|publisher=మల్లంపల్లి సోమశేఖర శర్మ}}</ref> కాలక్రమంలో బుద్ధుని లేదా ఇతర గురువుల వస్తువులపై కూడా ఇలాంటి చైత్యాలను నిర్మించడం మొదలుపెట్టారు. కాలాంతరంలో చైత్యమనే పదం వృక్ష వేదికకు గాని, సంపూర్ణ దేవాలయమునకు గాని, గర్భ గృహమునకు గాని వర్తించ సాగింది. కనుక చైత్యమనేది బౌద్ధ మతవిషయికమైన సాధారణ పదంగాను, స్తూపమనేది వస్తు విశేష సంబంధమయిన నిర్మాణ పదం (Architectural term for relic mound) గాను ఇటీవలి కాలంలో వ్యవహరింపబడుతున్నాయి.<ref name="AVS">{{Cite wikisource | title=ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము - ద్వితీయ సంపుటము |chapter=అమరావతి స్తూపము |author= టి.ఎన్.రామచంద్రన్ |editor=కొమర్రాజు వెంకట లక్ష్మణరావు|publisher= కాశీనాధుని నాగేశ్వరరావు |date=1934|scan=పుట:Andhravijnanasarvasvamupart2.pdf/310}}</ref>
 
బౌద్ధ భిక్షువులు దేశ సంచారం చేస్తూను, సంఘారామాలలో నివసిస్తూను ధర్మ ప్రచారం సాగించారు. ఆరాధన నిమిత్తం సంఘారామాలలో స్తూపాలు, చైత్యాలు నిర్మించుకొన్నారు. బౌద్ధుల స్తూపాలలో మూడు రకాలున్నాయి<ref name="BSL">[http://www.archive.org/details/bouddamuandhramu018708mbp బౌద్ధము, ఆంధ్రము - డా.బి.ఎస్.ఎల్. హనుమంతరావు] (తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ)</ref>
"https://te.wikipedia.org/wiki/అమరావతి_స్తూపం" నుండి వెలికితీశారు