అమరావతి స్తూపం: కూర్పుల మధ్య తేడాలు

చి cp
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 154:
==అమరావతి శిల్పరీతి==
[[బొమ్మ:AP Amaravthi sculpture Bodhi.JPG|right|thumb|250px|సంబోధి]]
కళాక్షేత్రంగా అమరావతి ఆర్జించిన కీర్తి అద్భుతమైనది. వీటి ద్వారా ఆంధ్ర శిల్పి నైపుణ్యం దేశ దేశాలలో వ్యాపించింది. అమరావతీ శిల్పరీతియే ఆంధ్రరీతియై పల్లవ చాళుక్యాది దాక్షిణాత్య శిల్పులకు వరవడియై మలయా, జావా, సుమత్రా, సింహళాది దేశాలలో తన వైజయంతికలను ప్రసరింపజేసిందట.<ref name="BSL">[http://www.archive.org/details/bouddamuandhramu018708mbp బౌద్ధము, ఆంధ్రము - డా.బి.ఎస్.ఎల్. హనుమంతరావు] (తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ)</ref>. అమరావతి శిల్ప కళారీతి (Amaravati school of art) శ్రీలంక, ఆగ్నేయాసియాలలోని నిర్మాణాలపై గణనీయమైన ప్రభావం కలిగి ఉంది. ఇక్కడినుండి శిల్పాలు ఆయా దేశాలకు తీసికొని వెళ్ళడం ఇందుకు ఒక కారణం.<ref>[http://www.nagarjunainstitute.com/buddhisthim/backissues/vol11/v11newevid.htm Nagarjuna Institute : Buddhist Himalaya Vol12 1999-2005 (Combined Issue)<!-- Bot generated title -->]</ref>.
 
డా. ఉల్రిక్ వాన్ ష్రోడర్ (Dr. Ulrich Von Schroeder) అనే అధ్యయనకారుడు శ్రీలంకలోని బౌద్ధ శిల్పంపై కూలంకషమైన మౌలిక పరిశోధన చేసి తన అధ్యయనాన్ని విస్తారమైన ఆధారాలతో ప్రచురించాడు. శ్రీలంక లంకలోని వవిధ నిర్మాణాలలోని సున్నపురాయి శిల్పాలను వాటి కొలతలతో సహా జాబితా తయారు చేశాడు. అతని ప్రచురణలోని అధ్యాయాల పేర్లు "ప్రారంభ అమరావతి రీతి కాలంలో దిగుమతి అయిన శిల్పాలు" (Imported Sculptures from Early Amaravati School) మరియు "అనంతర అమరావతి రీతి (నాగార్జున కొండ) కాలంలో దిగుమతి అయిన శిల్పాలు" (Imported Sculptures from late Amaravati (Nagarjunakonda)). దీన్నిబట్టి అమరావతి, నాగార్జునకొండలలోని శిల్పులు శ్రీలంకకు, ఇతర దక్షిణాసియా దేశాలకు బౌద్ధ, ఇతర శిల్పాలను ఎగుమతి చేస్తుండేవారని స్పష్టంగా తెలుస్తున్నది.
"https://te.wikipedia.org/wiki/అమరావతి_స్తూపం" నుండి వెలికితీశారు