గిడుగు వెంకట రామమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

Fixed typo
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 39:
 
==తొలి జీవితం==
గిడుగు వెంకట రామమూర్తి [[1863]] [[ఆగష్టు 29]] వ తేదీ [[శ్రీకాకుళం|శ్రీకాకుళానికి]] ఉత్తరాన ఇరవైమైళ్ళ దూరంలో ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న [[పర్వతాలపేట]] అనే [[గ్రామం]]లో జన్మించాడు. అతని తండ్రి వీర్రాజు, తల్లి వెంకమ్మ. వీర్రాజు పర్వతాలపేట ఠాణాలో సముద్దారు (రివెన్యూ అధికారి) గా పనిచేస్తుండేవాడు. [[1875]] దాకా ప్రాథమిక విద్య ఆ ఊళ్ళోనే సాగింది. తండ్రి [[చోడవరం]] బదిలీ అయిఅయ్యి అక్కడే విషజ్వరంతోవిష జ్వరంతో 1875 లోనే చనిపోయాడు.
 
[[విజయనగరం]]<nowiki/>లో [[మేనమామ]]<nowiki/>గారి ఇంట్లో ఉంటూ రామమూర్తి మహారాజావారి [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] పాఠశాలలో ప్రవేశించి 1875 మొదలు 1880 వరకు [[విజయనగరం]]లో గడిపాడు. [[1879]] లో [[మెట్రిక్యులేషన్|మెట్రిక్యులేషన్‌]] పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ రోజుల్లో [[గురజాడ అప్పారావు]] రామమూర్తికి సహాధ్యాయి. ఆ ఏడే రామమూర్తికి [[పెళ్ళి|పెండ్లి]] అయింది. 1880లో ముప్ఫై [[రూపాయి|రూపాయల]] జీతం మీద [[పర్లాకిమిడి]] రాజావారి స్కూల్లో ఫస్టుఫారంలో చరిత్ర బోధించే అధ్యాపకుడైనాడు. సంసారబాధ్యత (తల్లి, ఇద్దరు చెల్లెళ్ళు) రామమూర్తి పై బడింది. ప్రైవేటుగా చదివి 1886 లో ఎఫ్‌.ఏ., 1894 లో బి.ఏ. మొదటి రెండు భాగాలు ([[చరిత్ర]] తప్ప) ప్యాసయ్యాడు. [[1896]] లో మూడోభాగం ప్యాసై పట్టం పుచ్చుకున్నాడు. [[ఇంగ్లీషు]], [[సంస్కృతం|సంస్కృతాలు]] గాక, ప్రధాన పాఠ్యాంశంగా [[చరిత్ర]] తీసుకుని రాష్ట్రంలో మొదటి తరగతిలో, రెండోర్యాంకులో ఉత్తీర్ణుడయ్యాడు. రాజావారి ఉన్నత [[పాఠశాల]] [[కళాశాల]] అయింది. అప్పుడు అతనికి కళాశాల తరగతులకు పాఠాలు చెప్పే యోగ్యత వచ్చింది.