దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 6:
 
== నా గురించి ==
శ్రీ [[సభ్యులు:Chakrapani Nettem| చక్రపాణి నెట్టెం]] గారు [[అనంతపురం]] వాస్తవ్యులు, వీరి తండ్రిగారు వెంకటరమణ తల్లిగారు వెంకటలక్ష్మి, తండ్రిగారు వృత్తిరిత్యా పంచాయతీరాజ్ లో జియాలజిస్టుగా సుప్రసిద్ధులు. శ్రీ చక్రపాణి గారు [[మహబూబ్ నగర్]] నగరమున అక్షరాభ్యాసము చేసినారు. తరువాత [[అనంతపురం]] నందు, [[కర్నూలు]] లోని చిన్మయా మిషన్ స్కూల్, మాంటెసోరి స్కూల్ నందు చేశారు. [[అనంతపురం]] లోని గుడ్ షెప్పర్డ్ స్కూల్, ప్రభుత్వ బాలుర కళాశాల యందు (యం.పి.సి) చేశారు. ఈ కళాశాలలో చదివే రోజులలో కళాశాల ఎన్నికలల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆ తరువాత నెల్లూరు వెళ్ళి కోచింగుకు వెళ్ళారు, అక్కడ చదువుకంటే సినిమాలకు బాగా ఆకర్షితులైనారు. అటునుండి [[తుముకూరు]] వెళ్ళి బి.ఇ (కంప్యూటర్స్) కష్టపడి చదివారు. తరువాత [[బెంగళూరు]] సమీపాన పాఠశాల యందు భోదనావృత్తి చేశారు, చిన్నపిల్లలను తన భోదనాశక్తితో బాగా ఆకట్టుకున్నారు. ఎప్పటికైనా బాగా నచ్చిన సేవ ఈ భోదనావృత్తేనని గ్రహించారు. అటునుండి వ్యయసాయము చేయాలని తలచారు. వ్యయసాయ అప్పుకోసము బ్యాంకుల చుట్టు, రిజిష్ట్రేషను కార్యాలయము చుట్టు తిరిగి తిరిగి, అక్కడ వున్న అవినీతి కళ్ళార చూచి విసుగుచెందారు, ఇంత చదువు చదివిన వాళ్ళకే ఈ వ్యవస్థ యిన్ని యిబ్బందులు పెడుతుంటె మరి చదువు లేని వ్యవసాయదారులకు ఎన్ని ఇక్కట్లు పెడుతున్నారో కదా! ఇక వ్యవసాయ పదకానికి తిలోదకాలు యిచ్చి, చదువుకున్న చదువుకు ఏదో ఒక ఉద్యోగము చేయుటకు పూనుకున్నారు.
రాజదాని [[హైదరాబాదు]] చేరుకున్నారు, అక్కడ ఇక్కట్లు తప్పలేదు విసిగిపోయి ఆఖరి ప్రయత్నంగా [[బెంగళూరు]] చేరి ప్రయత్నించారు. ఎట్టకేలకు పూణెలో ఉద్యోగము సంపాదించగలిగారు. మెదటి సారిగా జీవితము ఎంత మధురముగా వుంటుందో చవిచూశారు. ఆరు మాసముల తరువాత [[సింగపూర్]]కు వెళ్ళి అక్కడ మనుషులు ఎంత కష్టపడి పనిచేస్తారో చూసి అలాగే పనిచేసి మ్యానేజర్స్ చేత మెప్పొంది వృత్తిరిత్యా ఆనందించారు. అక్కడినుండి తిరిగి వచ్చి [[కెనడా]]కు వెళ్ళి వుండలేక [[అమెరికా]]కు మళ్ళారు. ప్రస్తుతము ఇంతే సంగతులు.
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:Chakrapani_Nettem" నుండి వెలికితీశారు